టాప్ హీరోయిన్‌గా.. హోస్ట్‌గా రెండు రంగాల్లో దూసుకుపోతున్నారు సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్‌కి బ్రేక్ పడుతుందనే అభిప్రాయాన్ని తప్పని నిరూపించారు సమంత. పెళ్లి తర్వాతే జెస్సీ కెరీర్ పీక్స్‌కు వెళ్లిందని చెప్పవచ్చు. ఇక తాజాగా బాలీవుడ్ గురించి సమంత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో ఒక్క జోనర్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయవచ్చు కానీ సౌత్‌లో ఆ పరిస్థితి లేదన్నారు సామ్. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లో ఒక్క జోనర్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్కరిని సంతృప్తిపర్చల్సిన అవసరం లేదు. కానీ సౌత్‌లో ఇలాంటి పరిస్థితులు లేవు. థియేటర్‌కు వచ్చే ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయాల్సి ఉంటుంది’ అన్నారు. (108 సార్లు సూర్య నమస్కారాలు: సమంత)
‘అయితే ఓటీటీ వచ్చాక పరిస్థితి మారింది. రిస్క్ తీసుకునే అవకాశం పెరిగింది. ప్రపంచ స్థాయి సినిమాలు తీసే అవకాశం లభించింది’ అన్నారు సమంత. తాజాగా సామ్ ఫ్యామిలి మ్యాన్-2 సిరీస్‌లో నటిస్తున్నారు. మనోజ్ బాజ్‌పేయ్ దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. మాలో చాలా మంది వేర్వేరు పరిశ్రమల్లోకి వెళ్లి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆశిస్తారు. సౌత్‌లో సినిమా చెప్పే విధానం, తెరకెక్కించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వారి పద్దతి మాకు చాలా నచ్చుతుంది’ అన్నారు. ఇక వీరిద్దరు త్వరలో జీ కేఫ్‌లో ప్రసారం కానున్న ‘రాయల్ స్టాగ్ బారెల్ సెలక్ట్ లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ ’గురించి కూడా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment