క్రేజీ రైడ్‌కి రెడీయా? | Samantha plays negative role in The Family Man 2 web series | Sakshi
Sakshi News home page

క్రేజీ రైడ్‌కి రెడీయా?

Published Fri, Aug 28 2020 2:23 AM | Last Updated on Fri, Aug 28 2020 2:23 AM

Samantha plays negative role in The Family Man 2 web series - Sakshi

ఇప్పటివరకూ ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు సమంత. తాజాగా తనలోని విలనీ యాంగిల్‌ చూపించడానికి రెడీ అయ్యారు. మనోజ్‌ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో రాజ్, డీకే దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌’. ఈ షోకి విపరీతమైన స్పందన లభించింది. సెకండ్‌ సీజన్‌లో సమంత కూడా భాగమయ్యారు. ఇందులో విలన్‌ పాత్రలో నటించారు సమంత. ఆమెది టెర్రరిస్ట్‌ పాత్ర అని తెలిసింది.

షూటింగ్‌ పూర్తయింది. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను గురువారం మొదలుపెట్టారు సమంత. ‘‘ఫ్యామిలీ మ్యాన్‌: సీజన్‌ 2’కు డబ్బింగ్‌ ప్రారంభించాను. సిరీస్‌ చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులందరూ రెడీగా ఉండండి. మిమ్మల్నందర్నీ ఓ క్రేజీ రైడ్‌కు తీసుకెళ్లనుంది మా ‘ఫ్యామిలీ మ్యాన్‌’ టీమ్‌. ఇలాంటి పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ రాజ్, డీకే’’ అన్నారు సమంత. త్వరలోనే అమేజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement