
ప్రముఖ పోలీసాఫీసర్ అవినాష్ మిశ్రా జీవితం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్‌లో టైటిల్ రోల్‌లో బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా నటించనున్నారు. ఈ సిరీస్ ద్వారా వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు రణ్‌దీప్. నీరజ్ పతాక్ దర్శకత్వం వహించనున్న ఈ సిరీస్‌కు ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్‌లో చిత్రీకరణ జరగనుంది. ‘‘ఇదో స్ఫూర్తివంతమైన కథ. ఇలాంటి సూపర్ పోలీస్ కథను అందరికీ చెప్పడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రణ్‌దీప్ హుడా.
Comments
Please login to add a commentAdd a comment