రమ్యకృష్ణ, ‘క్వీన్’ ఫస్ట్‌లుక్
రాజకీయ నాయకురాలిగా మారారు రమ్యకృష్ణ. నాయకురాలిగా ఆమె ఆడిన రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో చూడటానికి సమయం ఆసన్నమైంది. నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు.
ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని టాక్. ఈ చిత్రంలో ఎమ్‌జీఆర్‌గా నటుడు ఇంద్రజిత్ కనిపిస్తారట. అలాగే యంగ్ జయలలిత పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ నటించారని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్‌లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తారు. ఇక దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలిలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment