Badmintan
-
‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందులో మరోసారి తన ఎటైర్‌తో అందర్నీ ఆకర్షించింది. సింధు కోర్టులో మెరుపు షాట్లతో అబ్బుర పర్చడంమాత్రమే కాదు, తనదైన శైలి ఫ్యాషన్‌తో అందమైన చీర కట్టుతో ఆకట్టుకుంది. ‘మీ అండ్ మైన్’ అంటూ ఇన్‌స్టాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులను ఆమె లుక్‌కి ఫిదా అవుతూ కామెంట్స్పెట్టారు.ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన పీవీ సింధు క్లాసిక్ ఇండియన్ కాంజీవరం చీరలో అద్భుతంగా కనిపించింది. అందమైన బిగ్ జరీ బోర్డ్ పట్టుచీరలో నవ్వుతూ యువరాణిలా కనిపించింది. చీర అంతా తెల్లటి ఎంబ్రాయిడరీ అందంగా కనిపిస్తోంది. దీనికి జతగా మల్టీ లేయర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులతో తన లుక్ ను మరింత ఎలివేట్ చేసుకుంది. మృదువైన కర్ల్స్లో స్టైల్ చేసి అలా వదిలేసింది. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్వెంకట దత్త సాయి విషయానికొస్తే, అతను తెల్లటి కుర్తా-పైజామా సెట్లో ఎప్పటిలాగానే మెరిసిపోయాడు. తన లుక్‌ను మరింతగా పెంచుతూ,పీచ్-హ్యూడ్ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించాడు. ఇంకా గోల్డెన్ ఎంబ్రాయిడరీ, బటన్స్ జాకెట్‌కు ట్రెండీ స్టైల్‌ను జోడించాయి. View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) కాగా రెండుసార్లు ఒలింపియన్ అయిన సింధు గత సంవత్సరం డిసెంబర్లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రతీది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెహిందీ, సంగీత్ వేడుకల్లో అందంగాముస్తాబై, ఫ్యాషన్ ప్రియులు కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. సమయానికి తగ్గట్టుఅద్భుతమైన సాంప్రదాయ దుస్తులతో ఈ జంట అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. మ్యాచింగ్ డైమండ్ ఆభరణాలతో పీవీ సింధు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది.ఇదీ చదవండి: తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్ స్టోరీ -
Saina Nehwal: నా ఆత్మలో.. బ్యాడ్మింటన్!
మణికొండ: బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, దాన్ని ఎప్పటికీ వదలిపెట్టనని పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, అలకాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్–3 వద్ద యోనెక్స్ స్పోర్ట్స్ స్టోర్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో క్రీడాకారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులతో పాటు వారికి నచి్చన క్రీడలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు మన దేశంలో రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఫిట్‌గా ఉండేలా చూసుకుని క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. రెజ్లర్ వినేష్ పోగట్‌కు మరో పథకం వస్తుందనే ఆశతోనే ఉన్నానన్నారు. కార్యక్రమంలో స్టోర్ యజమానులు అమర్, కిరణ్, వెంకట్‌తో పాటు ఆమె అభిమానులు పాల్గొన్నారు. -
ప్యారిస్ ఒలింపిక్స్ : రొమాంటిక్ లవ్ ప్రపోజల్, వైరల్ వీడియో
సిటీ ఆఫ్ లవ్.. ప్యారిస్. తన ఇష్టసఖి మనసు గెల్చుకునేందుకు విశ్వక్రీడావేదికను ఎంచుకున్నాడు. ఈ రొమాంటిక్ స్టోరీ ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ చైనీస్ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యాకియోంగ్, జెంగ్ సివీ స్వర్ణం గెలిచి తమ కలను సాకారం చేసుకున్నారు. కానీ బోయ్ ఫ్రెండ్ డైమండ్ రింగ్‌ను సొంతం చేసుకుంటానని ఊహించలేదు..హువాంగ్. స్టోరీ ఏంటంటే..:తన లవ్ ప్రపోజల్‌కు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది అనుకున్నాడో ఏమో గానీ చైనీస్ షట్లర్ లియు యుచెన్, తన ప్రేయసి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ మోకాళ్లపై వంగి ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ హువాంగ్ యాకియోంగ్కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. దీంతో సిగ్గుల మొగ్గ అవ్వడం ఆమె వంతైంది. సోషల్ మీడియాలో ఈ ప్రేమికులకు అభినందనలు వెల్లువెత్తాయి. లియు యుచెన్ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలవలేదు కానీ ఒలింపిక్ బంగారు పతక విజేతను గెల్చుకున్నాడు అంటూ అభినందించారు. పురుషుల డబుల్స్‌లో టోక్యో-2020 రజత పతకాన్ని గెల్చుకున్నాడు లియు."I’ll love you forever! Will you marry me?""Yes! I do!" OMG!!! Romance at the Olympics!!!❤️❤️❤️Huang Yaqiong just had her "dream come true", winning a badminton mixed doubles gold medal🥇with her teammate Zheng SiweiThen her boyfriend Liu Yuchen proposed! 🎉🎉🎉 pic.twitter.com/JxMIipF7ij— Li Zexin (@XH_Lee23) August 2, 2024శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- జియోంగ్ నా-యూన్ (21-8, 21-11)పై చైనాకు చెందిన జెంగ్ సివీ మరియు హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు.కాగా అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్పోయ్ లవ్ స్టోరీ కూడా ప్యారిస్ ఒలింపిక్స్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి ప్రతిపాదన తెచ్చేందుకు తొమ్మిదేళ్లు వెయిట్ చేసిన మరీ ఆమె మనసు దోచుకున్నాడు -
Paris Olympics 2024: నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్..ఆర్చరీ..– పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్):ప్రవీణ్ జాధవ్ × వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి).పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్..– పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్):స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి).మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్..– పురుషుల వ్యక్తిగత ఫైనల్స్:గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్..– మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్:నిఖత్ జరీన్ × యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్..– పురుషుల డింగీ తొలి రెండు రేసులు:విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి).– మహిళల డింగీ తొలి రెండు రేసులు:నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీ..భారత్ × బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్..– పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్:(మధ్యాహ్నం గం. 12:00 నుంచి).– పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్:సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి × చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి).మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
అలుపెరుగని షటిల్... అశ్విని!
హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ.. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లుగా ఎదిగే లక్ష్యంతో ఎంతోమంది వర్ధమాన షట్లర్లు అక్కడ సాధన చేస్తున్నారు.. అదే అకాడమీలోని ఒక కోర్టులో 35 ఏళ్ల యంగ్ అమ్మాయి కూడా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది.ఏదో ఫిట్నెస్ కోసం ఆడుకోవడమో లేక చిన్న చిన్న చాలెంజర్ టోర్నీల కోసమో ఆమె శ్రమించడం లేదు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కోసం ఆమె సన్నద్ధమవుతోంది. డబుల్స్ విభాగంలో ఆమె వరుసగా మూడో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించబోతోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకం గెలుచుకొని కూడా పుష్కరకాలం దాటింది. అటువైపు భాగస్వాములూ మారారు. కానీ తాను మాత్రం ఇంకా బ్యాడ్మింటన్ కోర్టుపై తన సత్తాను ప్రదర్శిస్తూనే ఉంది.ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ ప్లేయర్లో అదే పట్టుదల, అదే పోరాటతత్వం కనిపిస్తోంది. వరల్డ్, ఆసియా, కామన్వెల్త్ క్రీడల పతకాలు ఇప్పటికే తన ఖాతాలో ఉన్నా, మిగిలిన ఆ ఒక్క ఒలింపిక్ పతకాన్ని కూడా ఒడిసిపట్టుకోవాలనే లక్ష్యంతో సుదీర్ఘ సమయం పాటు సాధన కొనసాగిస్తోంది. ఆ ప్లేయర్ పేరే అశ్విని పొన్నప్ప.భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్‌లో ఆమెకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం ఉంది. పెద్ద సంఖ్యలో పతకాలు, ట్రోఫీలు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత రికార్డులు, ఘనతలే కాదు.. ఈ వయసులోనూ ఇంకా ఏదైనా సాధించాలనే తపన, కసి అశ్వినిని ఇంకా ఆడేలా ప్రోత్సహిస్తున్నాయి.అశ్విని పొన్నప్ప స్వస్థలం బెంగళూరే అయినా ఆమె కెరీర్ ఆసాంతం హైదరాబాద్‌తోనే ముడిపడి ఉంది. జూనియర్ స్థాయిలో విజయాల తర్వాత హైదరాబాద్ కేంద్రంగానే శిక్షణ కొనసాగించిన ఆమె ఆపై అగ్రశ్రేణి షట్లర్‌గా ఎదిగింది. ఆమె తండ్రి ఎంఏ పొన్నప్ప హాకీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు యూరోపియన్ లీగ్‌లలో కూడా ఆడాడు. అయితే అశ్వినికి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఏర్పడటానికి మాత్రం తల్లే కారణం.2010, కామన్వెల్త్ గేమ్స్ విమెన్ డబుల్స్ స్వర్ణంతో.., 2018, కామన్వెల్త్ గేమ్స్ విమెన్ డబుల్స్ కాంస్య పతకంతో..అసలు ఆటలంటే ఏమీ తెలియని రెండున్నరేళ్ల వయసులోనే తల్లి తనకు బ్యాడ్మింటన్‌ను పరిచయం చేసిందని అశ్విని చెప్పుకుంది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల వయసులో పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మార్చాలనే లక్ష్యంతో ఆమెను వారు కోచింగ్‌లో నేర్పించారు. బేసిక్స్ తర్వాత వివిధ వయో విభాగాల్లో విజయాలు సాధిస్తూ అశ్విని ఒక్కో మెట్టే ఎక్కుతూ వచ్చింది. 2001లో తొలిసారి జాతీయ సబ్ జూనియర్ టైటిల్ గెలుచుకున్న ఆమె, మూడేళ్ల తర్వాత సబ్ జూనియర్లో సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ విజేతగా నిలిచింది. ఆపై వరుసగా రెండేళ్ల జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకుంది.అందరిలాగే అశ్విని కూడా ముందుగా సింగిల్స్‌పైనే దృష్టి పెట్టింది. జాతీయ స్థాయిలో ఫలితాలు సాధించిన తర్వాత 2008లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తు గాయాలు, ఫిట్నెస్ సమస్యలు అశ్విని ఆటను కట్టిపడేశాయి. దాంతో తన ఆటపై ఒత్తిడిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎంతో ఇష్టపడే బ్యాడ్మింటన్ నుంచి తప్పుకునే పరిస్థితి లేదు. దాంతో సన్నిహితులు, కోచ్‌ల సూచనల ప్రకారం డబుల్స్ వైపు మళ్లింది.అది ఆమె జీవితంలో తీసుకున్న అతి కీలకమైన, సరైన నిర్ణయం. ఇది అశ్విని కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగేలా చేసింది. 2010లో పీసీ తులసితో కలసి ఆమె దక్షిణాసియా (శాఫ్) క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకుంది. అయితే ఏదో తెలియని లోటు తన ఆటకు తగిన ఫలితం ఇవ్వలేదన్నట్లుగా, తనను కట్టి పడేసినట్లుగా అనిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామం భారత డబుల్స్ బ్యాడ్మింటన్‌లో అత్యంత విజయవంతమైన జోడీకి అంకురార్పణ జరిగింది.2014, కామన్వెల్త్ గేమ్స్ విమెన్ డబుల్స్ సిల్వర్ మెడల్‌తో.., 2011 వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యంతో అశ్విని– జ్వాల ద్వయం..జ్వాలతో జత కట్టి..2010లో న్యూఢిల్లీ నగరం కామన్వెల్త్ క్రీడలకు ముస్తాబైంది. సొంతగడ్డపై ఇంత పెద్ద ఈవెంట్లో పతకాలు గెలవడం అశ్విని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కోచ్‌ల మార్గనిర్దేశనంలో ఆమె ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గుత్తా జ్వాలను కొత్త డబుల్స్ పార్ట్నర్గా ఎంచుకుంది. అశ్విని కంటే ఐదేళ్లు పెద్దదయిన జ్వాల అప్పటికే డబుల్స్‌లో ఎన్నో విజయాలు అందుకుంది. అప్పటి వరకు సక్సెస్ఫుల్ జంటగా ఉన్న జ్వాల – శ్రుతి కురియన్ విడిపోయారు.దాంతో జ్వాలకు కూడా సరైన పార్ట్నర్ అవసరమైంది. అప్పుడు జ్వాల – అశ్విని ద్వయం సమయం మొదలైంది. చక్కటి సమన్వయంతో ఆడిన వీరిద్దరూ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి ప్రయత్నంలోనే స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఈ జోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో హవా చూపించింది.వీటిలో 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్య పతకం అన్నింటికంటే బెస్ట్. లండన్‌లో జరిగిన ఈ పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన జ్వాల–అశ్విని జంట వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత జంటగా ఘనతకెక్కింది. అయితే 2013లో భాగస్వామిని మార్చి కొత్తగా ప్రయత్నిద్దామని చేసిన ప్రయోగం కొద్ది రోజులకే విఫలమైంది.జ్వాల వ్యక్తిగత కారణాలతో ఆటకు కొంతకాలం దూరంగా ఉండటంతో అశ్విని మరో భాగస్వామితో బరిలోకి దిగింది. అయితే సరైన ఫలితాలు రాకపోవడంతో కొన్ని నెలలకే వీరిద్దరు మళ్లీ జత కట్టారు. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు సర్క్యూట్లో మంచి విజయాలు సాధించిన అనంతరం 2016లో జ్వాల–అశ్విని పూర్తిగా విడిపోయారు.భర్త కరణ్ మేడప్పతో..భాగస్వాములు మారినా..‘క్రీడా భాగస్వామ్యాల్లో వేర్వేరు దశలు ఉంటాయి. కొన్నిసార్లు అద్భుత విజయాలు లభిస్తాయి. కొన్నిసార్లు పరాజయాలు పలకరిస్తాయి. డబుల్స్‌లో నేను ఫలానావారితో ఆడతాను అంటే కుదరదు. మార్పు సహజం. తప్పేమీ లేదు. దానిని అంగీకరించాలి. కొత్త భాగస్వామితో ఆరంభంలో సమన్వయం చేసుకునేందుకు కొంత ఇబ్బంది ఎదురు కావచ్చు. కానీ తర్వాతి రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి. అందుకే నేను ఒక్క చోట ఆగిపోకుండా ఇంకా కొనసాగిపోతున్నాను’ అని తన గురించి తాను అశ్విని చెప్పుకుంది.2016లో జ్వాలతో విడిపోయిన తర్వాత హైదరాబాద్‌కే చెందిన సిక్కి రెడ్డితో ఆమె జత కట్టింది. అశ్విని–సిక్కి ద్వయం కూడా పలు టోర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. వీటిలో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన కాంస్య పతకం కూడా ఉంది. అయితే ఆ తర్వాత సిక్కి రెడ్డితో కూడా అశ్విని విడిపోయింది.రెండేళ్ల క్రితం భారత జట్టుకు స్పెషలిస్ట్ డబుల్స్ కోచ్‌లు రావడంతో కొత్త జోడీ సాధ్యమైంది. ఒకవైపు తన అనుభవం, మరోవైపు యువ రక్తం కలగలసి మంచి ఫలితాలు వస్తాయని కోచ్‌లు అంచనా వేశారు. ఇప్పుడు సీనియర్‌గా ఉన్న తాను మరో యువ ప్లేయర్‌తో జత కట్టడం సరైందిగా అందరికీ అనిపించింది. దాంతో తనీషా క్రాస్టోను కొత్తగా అశ్వినికి భాగస్వామిగా ఎంపిక చేశారు. అశ్వినికి, తనీషాకు మధ్య వయసులో 14 ఏళ్ల తేడా ఉంది. కానీ కోర్టులోకి వచ్చేసరికి సరైన జుగల్బందీ కొనసాగింది.దాంతో ఏడాది వ్యవధిలోనే అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ జంట 3 టోర్నమెంట్లలో విజేతగా నిలిచి మరో రెండు టోర్నీల్లో రన్నరప్ స్థానాన్ని అందుకుంది. ఇదే క్రమంలో వరుస విజయాల కారణంగా పాయింట్లు సంపాదించి పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది.ఒకే ఒక లక్ష్యంతో..అశ్విని సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో విజయాలు ఉన్నాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాధించిన కాంస్యం వీటిలో అగ్రభాగాన నిలుస్తుంది. ఇది కాకుండా టీమ్, వ్యక్తిగత విభాగాలు అన్నీ కలసి ఆసియా క్రీడల్లో కాంస్యం.. కామన్వెల్త్ క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం.. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, కాంస్యం ఆమె గెలుచుకుంది.ఇక శాఫ్ క్రీడల్లో 4 స్వర్ణాలు, 2 రజతాలు గెలిచిన ఆమె ఉబెర్ కప్‌లో రెండు కాంస్యాలు సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. వీటికి తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ టోర్నీల్లో కూడా ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు అన్నింటినీ మించి ఒలింపిక్స్ పతకం కోసమే ఆమె శ్రమిస్తోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో జ్వాల–అశ్విని మంచి ఫామ్‌లో ఉంది.గ్రూప్ దశలో రెండు మ్యాచ్‌లు గెలిచినా దురదృష్టవశాత్తు ఒక పాయింట్ తేడాతో వీరు ముందంజ వేసే అవకాశం కోల్పోయారు. 2016 రియో ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందే డెంగీ బారిన పడిన తర్వాత అతి కష్టమ్మీద కోలుకొని బరిలోకి దిగినా గ్రూప్ రౌండ్లోనే ఓటమి తప్పలేదు. 2019లో మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో టోర్నీల్లో పాల్గొనలేక 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.మరెవరైనా అయితే ఈ స్థితిలో ఆటకు గుడ్‌బై చెప్పేవారేమో! కానీ అశ్విని కొత్త స్ఫూర్తితో, పట్టుదలతో మళ్లీ పైకెగసింది. నాలుగేళ్లుగా సాధన కొనసాగిస్తూ ఇప్పుడు మూడో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. ఈసారైనా ఆమె ఒలింపిక్స్ నెరవేరుతుందేమో చూడాలి. భారత ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా దక్కించుకున్న అశ్విని 2017లో తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త కరణ్ మేడప్పను పెళ్లి చేసుకుంది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
37 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం
అందివచ్చిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకున్న భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు ఆసియా క్రీడల్లో 37 ఏళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. అత్యంత సులువైన ‘డ్రా’ పొందిన భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో నేపాల్ జట్టుపై 3–0తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్ 21–5, 21–8తో ప్రిన్స్ దహాల్‌పై.. రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–4, 21–3తో సునీల్ జోషిపై.. మూడో సింగిల్స్‌లో మిథున్ మంజునాథ్ 21–2, 21–17తో బిష్ణు కతువాల్పై నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. భారత పురుషుల జట్టు ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో మూడుసార్లు సెమీఫైనల్లో ఓడిపోయి (టెహ్రాన్; 1974లో, న్యూఢిల్లీ; 1982లో, సియోల్; 1986లో) కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు భారత మహిళల జట్టు కథ ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 0–3తో థాయ్‌లాండ్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–14, 15–21, 14–21తో చోచువోంగ్ చేతిలో... రెండో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 19–21, 5–21తో జాంగ్‌కోల్ఫాన్–రవింద ప్రజోంగ్జయ్ చేతిలో... మూడో మ్యాచ్‌లో అషి్మత చాలిహా 9–21, 16–21తో బుసానన్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
చైనాలో.. అదరగొట్టనున్న.. తెలంగాణ బిడ్డ! అరుదైన అవకాశం!!
సాక్షి, మహబూబాబాద్: చైనాలోని హాంగ్జౌ వేదికగా శనివారం నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి సిక్కిరెడ్డి ప్రతిభ కనబర్చనున్నారు. పతకం సాధించి తెలంగాణకు పేరు తేవాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యంలో ఇక్కడే ఆటలో ఓనమాలు దిద్దారు. తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లో పని చేయడంతో అక్కడ బ్యాడ్మింటన్‌లో పూర్తి మెలకువలు నేర్చుకున్నారు. ఎడమ చేతివాటంతో చిన్నతనం నుంచి ప్రతిభ కనబర్చిన సిక్కిరెడ్డి 2014 మే నెలలో ఢిల్లీ ఉబర్ కప్‌లో కాంస్యం, 2015లో నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం, కామన్వెల్త్లో కాంస్యం.. ఇలా అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. అరుదైన అవకాశం.. ఆసియా గేమ్స్‌లో 40 దేశాలకు పైగా.. 41 క్రీడాంశాల్లో 655 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి ఉండడం గర్వకారణం. -
వైకల్యాన్ని జయించి అద్భుతాలు సృష్టిస్తున్న రూపాదేవి
-
సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు..
కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీపై సిందూ గెలుపొందింది. తొలి సెట్లో 19-21 తేడాతో ఓటమి పాలైన సింధు .. రెండో సెట్లో తిరిగి పుంజుకుని 21-14తో అద్భుతమైన విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో 21-18తో ప్రత్యర్ధిని మట్టికరిపించి సెమీస్‌లో సింధు అడుగు పెట్టింది. ఇక సెమీ ఫైనల్లో సింధు గెలిపొందితే భారత్‌కు మరో పతకం ఖాయమవుతోంది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా తొమ్మిదో రోజు భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. రెండు రజత పతకాలు భారత ఖాతాలో చేరాయి. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్ సాధించగా, పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్ ఖాతాలో 28 పతకాలు వచ్చి చేరాయి. వాటిలో 9 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. చదవండి: CWG 2022 9th Day: భారత్ ఖాతాలో 27వ పతకం.. రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం -
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన్యం యువకుల సత్తా
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇండో–నేపాల్ అంతర్జాతీయ యూత్ గేమ్స్–2022లో భారత్ తరఫున పాల్గొన్న ఏజెన్సీక్రీడాకారులు తమ సత్తాను చాటారు. నేపాల్‌లోని ఖాట్మండులో జరుగుతోన్న బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగం పోటీల్లో భారత్ తరఫున అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన పలాసి శ్రీను, జుర్ర పవన్‌కుమార్ పాల్గొన్నారు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్ జట్టుపై విజయం సాధించారు. డుంబ్రిగుడ మండలం కొర్రాయి గ్రామానికి చెందిన కిల్లో రాజేష్ పాల్ ఇండో–నేపాల్ యూత్ గేమ్స్‌లో పాల్గొని ఈ నెల 12న జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. చదవండి: Khelo India 2022: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా -
భారత బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడిగా పుల్లెల గోపీచంద్
జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ‘బాయ్’ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంత బిశ్వశర్మను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శలు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్ లఖాని ఎన్నికయ్యారు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
సిరిల్ వర్మతో శ్రీకాంత్ తొలి పోరు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు జరిగే ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ‘డ్రా’ను నిర్వాహకులు గురువారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ కిడాంబి శ్రీకాంత్ తన తొలి మ్యాచ్‌ను హైదరాబాద్‌కు చెందిన సిరిల్ వర్మ (భారత్)తో ఆడతాడు. సెమీఫైనల్ వరకు చేరుకోవడం శ్రీకాంత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే సెమీఫైనల్లో శ్రీకాంత్‌కు ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్) ఎదురవుతాడు. స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో లో కీన్ యు చేతిలోనే శ్రీకాంత్ ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. మరో భారత షట్లర్ సాయిప్రణీత్ తన తొలి మ్యాచ్‌లో లూయిస్ ఎన్రిక్ (స్పెయిన్)తో ఆడనున్నాడు. మహిళల విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్న తెలుగు తేజం పీవీ సింధుకు సులువైన ‘డ్రా’ లభించింది. భారత్‌కే చెందిన శ్రీ కృష్ణప్రియతో సింధు తన తొలి మ్యాచ్ ను ఆడుతుంది. ఈ ఏడాది మొత్తం గాయాలతో ఇబ్బంది పడ్డ సైనా నెహ్వాల్... ఆరంభ మ్యాచ్‌లో ఐరిస్ వాంగ్ (అమెరికా)తో ఆడుతుంది. చదవండి: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబంగ్ ఢిల్లీ బోణీ.. 16 పాయింట్లతో మెరిసిన నవీన్ -
సుదిర్మన్ కప్ చిరాగ్–సాత్విక్ జోడి ఔట్!
Chirag Satwik Pair Withdraws From Sudirman Cup: భారత బ్యాడ్మింటన్ టాప్ పురుషుల డబుల్స్ జంట చిరాగ్ శెట్టి – సాత్విటక్ సాయిరాజ్ అనారోగ్య సమస్యలతో ఆదివారంనుంచి జరిగే సుదిర్మన్ కప్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరల్డ్ నంబర్ 10 జోడీ అయిన వీరిలో చిరాగ్ అనారోగ్యంగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారి ఒకరు వెల్లడించారు. చదవండి: సన్‌రైజర్స్ అవుట్! -
పారాలింపిక్స్‌లో పతకం సాధించిన కలెక్టర్ సాబ్ కథ ఇదీ..
టోక్యో: సుహాస్ యతిరాజ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్. కలెక్టర్ అవడం కంటే గొప్ప కల ఏముంటుంది. కానీ ఇతను కల సాకారంతోనే ఆగిపోలేదు. కలని మించి ఆలోచించాడు. చక్కగా ఆచరణలో పెట్టాడు. అందుకే ఇపుడు టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతక విజేత అయ్యాడు. కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన కంప్యూటర్ ఇంజినీర్ సుహాస్ 2007 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధనగర్ (నోయిడా) జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి కాలి పాదాల వైకల్యమున్నా... బ్యాడ్మింటన్ అంటే ఎనలేని ఆసక్తి. అందుకేనేమో అందులో ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఎదిగాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ పారా క్రీడల్లో మనసుపెట్టి పోటీపడే ఈ ప్రొఫెషనల్ ఖాతాలో చాలా పతకాలే ఉన్నాయి. 2016లో బీజింగ్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యూరోక్రాట్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘యశ్ భారతి’ పురస్కారంతో సుహాస్‌ను సత్కరించింది. జకార్తాలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలిచాడు. ఇలా అంతర్జాతీయ కెరీర్లో ఈ పారా షట్లర్ 5 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్యాలు గెలిచాడు. చాలా ఉద్విగ్నంగా ఉంది. ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. ఇదే సమయంలో ఇంత బాధ కూడా ఎప్పుడూ పడలేదు. పారాలింపిక్స్‌లో రజతం ఆనందమైతే... స్వర్ణం చేజార్చుకోవడం, జాతీయ గీతాన్ని ఆలపించే అవకాశాన్ని కోల్పోవడం చాలా నిరాశ పరిచింది. ఓవరాల్‌గా పారాలింపిక్ పతకం సాధించినందుకు గర్వపడుతున్నాను. –సుహాస్ చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. -
పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్..
టోక్యో: టోక్యో వేదికగా జరగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. తాజాగా ఆదివారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల బ్యాడ్మింటన్ ఎస్ఎల్4 విభాగంలో సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించాడు. దీంతో భారత్ ఖాతాలో 18 పతకాలు చేరాయి. పారాలింపిక్స్‌లో పతకం సాధించిన మొట్టమొదటి భారత ఐఏఎస్ అధికారిగా సుహాస్ యతిరాజ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. సుహాస్ పూర్తిపేరు సుహాస్ లలినకెరె యతిరాజ్... కర్ణాటకలో జన్మించిన సుహాస్, ఎన్ఐటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు.సుహాస్ యతిరాజ్ ప్రస్తుతం నోయిడాలోని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లాకి మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సుహాస్ యతిరాజ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు చదవండి: మొగ్గు మనవైపు! What. A. Match 🤯#FRA's Lucas Mazur and #IND's Suhas Yathiraj served up a true classic in the #ParaBadminton Men's Singles SL4 Final. 🔥 #Gold #Silver #Tokyo2020 #Paralympics pic.twitter.com/jUjC8QqboA — #Tokyo2020 for India (@Tokyo2020hi) September 5, 2021 A fantastic confluence of service and sports! @dmgbnagar Suhas Yathiraj has captured the imagination of our entire nation thanks to his exceptional sporting performance. Congratulations to him on winning the Silver medal in Badminton. Best wishes to him for his future endeavours. pic.twitter.com/bFM9707VhZ — Narendra Modi (@narendramodi) September 5, 2021 -
తైజుయింగ్ మనసు గెలుచుకున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకాన్ని అందించి యావత్ భారత ప్రజల అభిమానాన్ని చూరగొన్న తెలుగు తేజం పీవీ సింధు సెమీ ఫైనల్లో తనను ఒడించిన చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్ మనసు కూడా గెల్చుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ఓటమి తరువాత సింధు నిజాయితీగా అందించిన మద్దతుతో తనకు కన్నీళ్లొచ్చాయని తైజుయింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు తైజూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. బంగారు పతకాన్ని కోల్పోవడం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఒలింపిక్స్ కలల వేదికపై మూడోసారి అడుగుపెట్టి.. చివరకు ఫైనల్‌కు చేరుకున్నాను, కానీ ఫైనల్లో విజయం సాధించలేకపోయాను. లోపాలు ఎప్పుడూ ఉంటాయి, అయినా మెరుగైన ఫలితాన్ని సాధించడం ఉత్సాహాన్నిచ్చింది. తైజూయింగ్ యూ ఆర్ గ్రేట్ అంటూ తనను తాను అభినందించుకోవడం విశేషం ఈ సందర్భంగా తనకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఒక చిన్న విషయాన్ని చెప్పాలంటూ సింధుపట్ల తన గౌరవాన్ని చాటుకుంది. మ్యాచ్ తర్వాత సింధు పరుగెత్తుకువచ్చి ఆలింగనం చేసుకుంది. ఆరోగ్యం బాగా లేకపోయినా, టప్ ఫైట్ ఇచ్చారు. కానీ ఈ రోజు మీది కాదంటూ అనునయంగా చెప్పి తను ఏడిపించేసిందంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు. కాగా రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయ మహిళగా వీసీ సింధు రికార్డు సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో తైజుయింగ్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ, కాంస్య పతకం మ్యాచ్‌లో హీ బింగ్ జియావోను ఓడించింది. దీంతో వీవీ సింధుపై ప్రశంసల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌కు ఒలింపిక్స్ ఫైనల్లో నిరాశ ఎదురైంది. గట్టిగా పోరాడినప్పటికీ చైనాకు చెందిన చెన్ యు ఫే (18-21, 21-19, 18-21 తేడాతో) చేతిలో ఓటమి పాలై తైజుయింగ్ గోల్డ్ మెడల్ చేజార్చుకుంది. ఒలింపిక్ గోల్డ్ మెడల్ లక్ష్యంగా పోరాడి చివరకు రజత పతకంతో సరిపెట్టుకుంది. View this post on Instagram A post shared by Tai Tzu Ying戴資穎 (@tai_tzuying) -
Tokyo Olympics:: పీవీ సింధుకి అరుదైన గౌరవం..
టోక్యో: తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం దక్కనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. లింగ భేదం లేకుండా పురుషుల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకర్ని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజతం గెలిచింది. వాస్తవానికి ముందు జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన వారు భారత పతాకాధారిగా ఉండేవారు. గత రియో ఒలింపిక్ క్రీడల్లో భారత తరుపున బ్యాండ్మింటన్‌లో పీవీ సింధు, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ పతకాలు సాధించారు. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ కు సాక్షి మాలిక్ ఆర్హత సాధించలేదు. దీంతో పీవీ సింధు అవకాశం దక్కనుంది. పురుషుల్లో ఎవరనేది మాత్రం తేలలేదు. ముఖ్యంగా కొందరి పేర్లు మాత్రం బయటకు వస్తున్నాయి. వీటిలో బాక్సర్ అమిత్ పంఘాల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, టీటీ ప్లేయర్ ఆచంట వరత్ కమల్, అథ్లెట్ నీరజ్ చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, వీరిలో రియోలో ఏ పతకాన్ని సాధించలేదు. మరి ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాలంటే ఈ నెలాఖరవరకు ఆగాల్సిందే. చదవండి: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్‌కు గాయం -
అంతర్జాతీయంగా పనిచేసిన తెలుగు అంపైర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు ఒలింపిక్స్‌లతోపాటు (1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ) పలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో... ఆసియా క్రీడల్లో... కామన్వెల్త్ గేమ్స్‌లో.. థామస్ కప్–ఉబెర్ కప్‌లలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అంపైర్ వేమూరి సుధాకర్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో రెండు వారాలుగా కరోనా వైరస్‌తో పోరాడిన 70 ఏళ్ల సుధాకర్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా బ్యాడ్మింటన్‌తో అనుబంధం కలిగిన సుధాకర్ ప్రస్తుతం ఆసియా బ్యాడ్మింటన్ టెక్నికల్ కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ మృతిపట్ల తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, ఐటీ, మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్... భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల, వెటరన్ కోచ్ ‘ద్రోణాచార్య’ ఎస్ఎం ఆరిఫ్, భారత బ్యాడ్మింటన్ సంఘం, ఆసియా బ్యాడ్మింటన్ సంఘం, భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్మోహన్రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
నాతో పెట్టుకోకు: హీరోను ఓడించిన హీరోయిన్
హీరో సిద్ధాంత్ చతుర్వేది, హీరోయిన్ కత్రినా కైఫ్ సరదాగా బ్యాడ్మింటన్ ఆడగా.. చిత్రబృందంలోని సభ్యులు ఆటను కన్నార్పకుండా చూశారు. నువ్వానేనా అన్న తరహాలో ఆడిన వీరి ఆటలో చివరకు కత్రినా గెలిచింది. దీనికి సంబంధించిన వీడియోను కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. గుర్మిత్ సింగ్ దర్శకత్వంలో కత్రినా, సిద్ధాంత్, ఇషాన్ ఖట్టర్ కీలక పాత్రలుగా ‘ఫోన్ బూత్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉదయ్‌పూర్ కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ విరామ సమయంలో కత్రినా, సిద్ధాంత్ సరదాగా బ్యాట్లు పట్టారు. కాగా ఈ గేమ్ మధ్యలలోనే ఇశాంత్ సరదాగా డ్యాన్స్‌లు కూడా చేశాడు. ఈ విధంగా ఫోన్ బూత్ సినిమా షూటింగ్ విరామ సమయంలో నటీనటులు తమకు ఇష్టమైన క్రీడలు ఆడుతూ సేద తీరుతున్నారు. హర్రర్ కామెడీ ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఫర్హాన్ అక్తార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) -
అది మంచి నిర్ణయం: పీవీ సింధు
న్యూఢిల్లీ: కోవిడ్–19తో ఏర్పడిన విరామ సమయంలో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేయడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ప్రపంచ చాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చెప్పింది. మెరుగైన శిక్షణ కోసం అక్టోబర్‌లో ఇంగ్లండ్ వెళ్లిన సింధు అక్కడే ఉండి తాజా సీజన్ కోసం సన్నద్ధమవుతోంది. ఈనెల 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనుంది. ‘నిజం చెప్పాలంటే ఇంగ్లండ్ రావడం చాలా మంచి నిర్ణయం. ఇక్కడ శీతల వాతావరణం ఉన్నప్పటికీ, తీవ్రమైన ప్రాక్టీస్ సెషన్లను ఆస్వాదిస్తున్నా. థాయ్‌లాండ్ ఈవెంట్‌తో సీజన్‌ను ప్రారంభిస్తా. చాలా కాలం తర్వాత ఈ టోర్నీల్లో పాల్గొనడం ఉత్సాహంగా అనిపిస్తోంది. ఇప్పుడు చాలా ఓపికగా ఆడాల్సి ఉంటుంది. మానసికంగానూ సిద్ధం అవ్వాలి. ఇది ఒలింపిక్స్ ఏడాది కాబట్టి థాయ్‌లాండ్‌లో విజయంతో ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాలని ఆశిస్తున్నా’ అని లండన్‌లో కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకున్న సింధు పేర్కొంది. ఆమె చివరిసారిగా మార్చి 11 నుంచి 15 వరకు జరిగిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో తలపడింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న సింధుకు థాయ్‌లాండ్ ఓపెన్‌లో అనుకూలమైన ‘డ్రా’ ఎదురైంది. -
సైనాలానే ఉందే!
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో పరిణీతీ చోప్రా లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసిన సైనా నెహ్వాల్ ‘అచ్చు నాలానే ఉందే’ అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం పరిణీతి బ్యాడ్మింటన్ సాధన చేశారు. బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపారు పరిణీతి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్‌కు రానుంది. -
‘మంచి భార్య రావాలని కోరుకోలేదు’
‘ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతమైన మహిళవు నువ్వు. మంచి భార్య రావాలని నేను ఏనాడు కోరుకోలేదు. మనం ఒక్కటై గడిచిన.. ఈ ఏడాదిని అద్భుతంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన భార్య, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై ప్రేమ చాటుకున్నాడు. మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో సైనా- కశ్యప్‌లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సైనా సైతం తమ మొదటి పెళ్లిరోజును పురస్కరించుకుని... భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. కాగా దాదాపు పదేళ్లపాటు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచిన సైనా- కశ్యప్ గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాయదుర్గంలోని సైనా నివాసం ఓరియన్ విల్లాలో ఈ రాకెట్ స్టార్స్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అత్యంత నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం సినీ, క్రీడా ప్రముఖుల కోసం ఈ జంట నోవాటెల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఇక భారత బ్యాడ్మింటన్‌లో స్టార్‌గా ఎదిగిన సైనా.. ఈ విభాగంలో భారత్‌కు ఒలింపిక్ పతకం అందించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఈ ఘనత దక్కించుకున్నారు. అంతేగాకుండా ప్రపంచ బ్మాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో సైనా జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రా సైనాగా అలరించనున్నారు. కాగా పారుపల్లి కశ్యప్ సైతం కీలక మ్యాచుల్లో విజయం సాధించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. ఇక వీరిద్దరు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ నుంచి క్రీడా ప్రస్థానం మొదలుపెట్టారన్న సంగతి తెలిసిందే. View this post on Instagram You are simply the most amazing woman in the world. I couldn’t ask for a better wife. Thanks for making the first year together so wonderful. I love you so much. Happy anniversary!! 😘😘❤️ A post shared by Kashyap Parupalli (@parupallikashyap) on Dec 16, 2019 at 11:09am PST -
‘ఒలంపిక్స్‌లో పతకం గెలవడమే నా లక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక అర్జున అవార్డు తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు తెలుగు తేజం సాయిప్రణీత్. గురువారం ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. అనంతరం సాయి ప్రణీత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం చేయడం ద్వారా క్రీడాకారులు మరింత స్ఫూర్తి పొందుతారని తెలిపారు. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో అన్ని క్రీడల్లోనూ భారత్ మెరుగైన ప్రతిభ చూపిస్తోందన్నారు. హైదరాబాద్ క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకం సాధించిన అనంతరం మరిన్ని చాంపియన్ షిప్‌లపై దృష్టి సారిస్తున్నానని ప్రణీత్ చెప్పారు. గతంలో అనేక మందికి సాధ్యం కానిది తాను సాధించాను కాబట్టి వారికంటే గొప్పగా భావించడం లేదని, రానున్న ఒలంపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా కృషిచేస్తున్నాని సాయి ప్రణీత్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ రోజు (ఆగష్టు 29)న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అవార్డులను అందజేశారు. -
శభాష్ సుమీత్
కెరీర్లో తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ ఆడిన భారత యువ ప్లేయర్ సుమీత్ నాగల్ సంచలన ప్రదర్శన చేశాడు. 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత ఫెడరర్‌పై ఏకంగా తొలి సెట్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఫెడరర్ వెంటనే తేరుకొని ఆ తర్వాతి మూడు సెట్లను సాధించి విజయాన్ని అందుకున్నాడు. మొత్తానికి మ్యాచ్ ఓడినా... తన ఆటతో సుమీత్ మనసులు గెల్చుకున్నాడు. న్యూయార్క్: ఊహించిన ఫలితమే వచ్చినా... భారత యువ ఆటగాడు సుమీత్ నాగల్ పరాజయంలోనూ గౌరవాన్ని పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్, ప్రపంచ 190వ ర్యాంకర్ సుమీత్ నాగల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. ప్రపంచ మూడో ర్యాంకర్, 38 ఏళ్ల రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)తో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుమీత్ 6–4, 1–6, 2–6, 4–6తో ఓడిపోయాడు. ఆర్థర్ యాష్ స్టేడియం సెంటర్ కోర్టులో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్ కళ్లు చెదిరే ఇన్సైడ్ అవుట్ ఫోర్‌హ్యాండ్ షాట్లతో అలరించాడు. మ్యాచ్ సాగుతున్నకొద్దీ ఫెడరర్ దూకుడు పెంచగా... అంతర్జాతీయ అనుభవం అంతగా లేకున్నా సుమీత్ ప్రతీ పాయింట్‌కు తన శక్తినంతా ధారపోసి ఆడాడు. ఫెడరర్‌కు సులువుగా పాయింట్లు ఇవ్వకుండా పోరాడాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్ 12 ఏస్‌లు సంధించి 7 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 57 అనవసర తప్పిదాలు చేసిన స్విస్ దిగ్గజం ఏడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. మరోవైపు సుమీత్ మూడుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 32 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఫెడరర్‌లాంటి దిగ్గజంతో నా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్ ఆడినందుకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఫెడరర్ ఆటను చూశాక ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను’ అని 22 ఏళ్ల సుమీత్ వ్యాఖ్యానించాడు. ‘సుమీత్కు ఉజ్వల భవిష్యత్ ఉంది. ఈ మ్యాచ్‌లో అతను చాలా నిలకడగా ఆడాడు. అంతర్జాతీయస్థాయిలో సక్సెస్ సాధించాలంటే ఈ రకమైన ఆటతీరును కొనసాగించాల్సి ఉంటుంది’ అని ఫెడరర్ అన్నాడు. తొలి రౌండ్లో ఓడిన సుమీత్కు 35 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 58,000 డాలర్ల (రూ. 41 లక్షల 62 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఫెడరర్‌తోపాటు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–1, 6–4తో కార్బెలాస్ బేనా (స్పెయిన్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–1, 6–1తో షరపోవా (రష్యా)పై గెలిచింది. గత రెండు దశాబ్దాల్లో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ మ్యాచ్‌లో ఒక సెట్ గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో సోమ్‌దేవ్, యూకీ బాంబ్రీ, సాకేత్ ఈ ఘనత సాధించారు. ఫెడరర్‌పై మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లో సెట్ గెలిచిన ఏకైక భారతీయ ప్లేయర్ సుమీత్. గతంలో ఫెడరర్‌తో రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ మ్యాచ్‌లు ఆడినా వరుస సెట్లలో ఓడిపోయారు. -
ఆటగాళ్లపై నా నియంత్రణ లేదు: గోపీచంద్
ముంబై: భారత షట్లర్ల టోర్నీ ప్రణాళికలు, ప్రాక్టీస్ వంటి అంశాలు తన అదుపులో ఉండటం లేదని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దురదృష్టవశాత్తు మన దేశంలో ఓ క్రమ పద్ధతి అంటూ ఉండదు. ఇక్కడ చీఫ్ కోచ్ పాత్ర పూర్తిగా అలంకారప్రాయమైంది. కోచ్‌గా నాకు ఏ హక్కులు లేవు. అసలు జాతీయ కోచ్ అనేది అర్థం లేని పదవిగా మారింది. సెలక్షన్స్‌లో కానీ, ప్రణాళికల్లో కానీ భాగస్వామ్యమే ఉండదు. సహాయ కోచ్‌ల్ని ఎంపిక చేసుకోలేం, వారి పారితోషికాల్ని నిర్ణయించలేం. ఇవేవీ లేని జాతీయ కోచ్, అతని బృందం ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఎలా తయారు చేస్తుంది చెప్పంది? బ్యాడ్మింటన్ క్రీడ వ్యక్తిగత ఆటే... కానీ శిక్షణ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగానే తీసుకోవాలని లేదు. చైనా, జపాన్, కొరియా, ఇండోనేసియా, మలేసియా, డెన్మార్క్ దేశాల్లో ఈ శిక్షణ ప్రక్రియ జట్టుగా... కలసికట్టుగా సాగుతుంది. కానీ ఇక్కడలా లేదు. ఇక టోర్నీల విషయానికొస్తే ఒక ప్లేయర్ ఏడాదికి ఎన్ని టోర్నీల్లో ఆడాలనే నియంత్రణ ఉండదు. ప్రతిభాన్వేషణకు సరైన ప్రణాళికలే లేవు. ప్రతిభ ఉంటే ప్రపంచశ్రేణి ఆటగాడిగా తీర్చిదిద్దే కార్యక్రమాలే ఉండవు. ఆటగాళ్లంతా సొంతంగా ఎదగాల్సిందే. ఇది సరికాదు. ఒక స్పష్టమైన విధివిధానమంటూ ఉండాలి. దీనికి ఓ జవాబుదారితనం కావాలి. ఎవరు దేనికి బాధ్యులో అందరికీ తెలిసుండాలి’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని చెప్పారు. -
ఆగస్టు వినోదం
కబడ్డీ కూత, యాషెస్ సిరీస్, కరీబియన్ క్రికెట్‌తో ఆగస్టు ‘మస్తు మజా’ అందించనుంది. పనిలో పనిగా హైదరాబాద్‌లో షటిల్ రాకెట్లు సమరాన్ని చూపించనున్నాయి. గత నెలలో మొదలైన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ఈ ఆగస్టులో ఆరు నగరాల్లో కూతపెడతాయి. యాషెస్ సిరీస్‌తో పాటు, విండీస్‌లో భారత్ పర్యటన క్రికెట్ పంట పండించనుంది. ఏస్‌లతో యూఎస్ ఓపెన్, కార్ల స్పీడ్‌తో హంగేరి గ్రాండ్‌ప్రి ‘రయ్ రయ్’మనిపిస్తుంది. అలా ఈ ఆగస్టు ఆటలతో ‘అటెస్ట్’ అయిపోయింది. క్రికెట్ వెస్టిండీస్‌లో భారత్ పర్యటన తొలి టి20: ఆగస్టు 3 రెండో టి20: ఆగస్టు 4 మూడో టి20: ఆగస్టు 6 తొలి వన్డే: ఆగస్టు 8 రెండో వన్డే: ఆగస్టు 11 మూడో వన్డే: ఆగస్టు 14 తొలి టెస్టు: ఆగస్టు 22–26 రెండో టెస్టు: ఆగస్టు 30–సెప్టెంబరు 3 బ్యాడ్మింటన్ ఆగస్టు 6–11: హైదరాబాద్ ఓపెన్ టోర్నీ ఆగస్టు 19–25: ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ (స్విట్జర్లాండ్) షూటింగ్ ఆగస్టు 15–22: ప్రపంచకప్ షాట్‌గన్ టోర్నీ (ఫిన్లాండ్) ఆగస్టు 28–సెప్టెంబర్ 2: ప్రపంచకప్ రైఫిల్, పిస్టల్ షూటింగ్ టోర్నీ (రియో డి జనీరో) ఫార్ములావన్ ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ప్రి యాషెస్ సిరీస్ తొలి టెస్టు: ఆగస్టు 1–5 బర్మింగ్‌హామ్ రెండో టెస్టు: ఆగస్టు 14–18 లార్డ్స్ మూడో టెస్టు: ఆగస్టు 22–26 లీడ్స్ న్యూజిలాండ్‌లో శ్రీలంక పర్యటన తొలి టెస్టు: ఆగస్టు 14–18 రెండో టెస్టు: ఆగస్టు 22–26 తొలి టి20: ఆగస్టు 31 టెన్నిస్ ఆగస్టు 26–సెప్టెంబర్ 8: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రెజ్లింగ్ ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్ (ఎస్తోనియా) ప్రొ కబడ్డీ లీగ్–7 సీజన్ మ్యాచ్‌లు ఆగస్టు 2–31 చెస్ ఆగస్టు 15–19: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ (బెలారస్) ఆగస్టు 20–సెప్టెంబర్ 2: ప్రపంచ క్యాడెట్ (అండర్–8, 10, 12) చాంపియన్‌షిప్ (చైనా) హాకీ ఆగస్టు 17–21: టోక్యో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ హాకీ టోర్నీ – సాక్షి క్రీడావిభాగం -
చెడు అలవాట్లు దూరం
బ్యాడ్మింటన్ ఆడుతుంటే చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ దూరమౌతున్నాయి అంటున్నారు శ్రద్ధా కపూర్. ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ రాకెట్ ఎందుకు పట్టుకున్నారో మీకు తెలుసు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాత్ర పోషిస్తున్నారామె. ఈ పాత్ర కోసం శ్రద్ధ రోజూ గంటల కొద్దీ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం చెబుతూ – ‘‘ప్రాక్టీస్ కోసం ఉదయాన్నే నిద్ర లేస్తున్నాను. దాంతో రోజును పొడిగించుకున్నట్టే. ఉదయం లేవడం భలే ఉంది. ఈ సినిమా పూర్తయినా ఈ ఆటను, ఈ అలవాటుని అస్సలు వదలను’’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్. సైనా నెహ్వాల్ బయోపిక్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
శ్రీకాంత్‌కు మళ్లీ నిరాశ
టోక్యో: గతేడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్‌తో దుమ్మురేపిన భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్‌కు ఈ ఏడాది మాత్రం కలిసి రావడంలేదు. తాజాగా జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–19, 16–21, 18–21తో ప్రపంచ 33వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. గంటా 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడు గేమ్‌లూ హోరాహోరీగా సాగాయి. అయితే కీలకదశలో లీ డాంగ్ పైచేయి సాధించాడు. శ్రీకాంత్‌పై లీ డాంగ్కిది వరుసగా రెండో విజయం. 2016 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ శ్రీకాంత్‌పై మూడు గేముల్లో లీ డాంగ్ గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–15, 21–14తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై నెగ్గి ఆసియా క్రీడల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ (భారత్) 14–21, 17–21తో గిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్, భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. గావో ఫాంగ్‌జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18–21, 19–21తో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 18–21, 21–16, 12–21తో హీ జిటింగ్–తాన్ కియాంగ్ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 16–21, 16–21తో చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
శ్రీకాంత్, ప్రణయ్ నిష్క్రమణ
ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. ఈ మెగా క్రీడల్లో భారత్‌కు పురుషుల సింగిల్స్‌లో ఒకే ఒక్కసారి 1982 ఏషియాడ్‌లో సయ్యద్ మోదీ కాంస్య పతకాన్ని అందించాడు. ఈసారి జకార్తాలో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్‌లలో ఒకరు ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతారని ఆశించారు. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరూ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టడం గమనార్హం. ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–23, 19–21తో 28వ ర్యాంకర్ వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్) చేతిలో ఓడిపోగా... మరో మ్యాచ్‌లో 11వ ర్యాంకర్ ప్రణయ్ 12–21, 21–15, 15–21తో 18వ ర్యాంకర్ వాంగ్‌చరొన్ కంటాఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశాడు. క్వార్టర్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని జంట మరోవైపు మహిళల డబుల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో సిక్కి– అశ్విని జోడీ 21–17, 16–21, 21–19తో మీ కున్ చౌ–మెంగ్ యెన్‌లీ (మలేసియా) ద్వయంపై గెలిచింది. 1986 తర్వాత భారత తరఫున మహిళల డబుల్స్ జోడీ ఏషియాడ్‌లో క్వార్టర్స్‌కు చేరడం ఇదే ప్రథమం. -
సెప్టెంబర్‌లో స్టార్ట్
ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తున్నారు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్తున్నారట. ఈ వయసులో స్కూల్ ఏంటీ? అంటే.. బుక్స్‌తో కుస్తీ పడే స్కూల్ కాదండీ.. బ్యాడ్మింట¯Œ స్కూల్. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధా యాక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ లేట్ అవుతూ వస్తోంది. ఫైనల్లీ ఈ సెప్టెంబర్‌లో స్టార్ట్ కానుందట. అమోల్ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సైనా నెహ్వాల్‌ని తలపించడం కోసమే ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు శ్రద్ధా. ఈ రెండు నెలలు ఫుల్ ట్రైనింగ్‌లో గడపనున్నారామె. ప్రస్తుతం ప్రభాస్ సరసన శ్రద్ధా ‘సాహో’లో చేస్తోన్న సంగతి తెలిసిందే. -
భారత జట్ల బోణీ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్–ఉబెర్ కప్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు విజయాల బోణీ చేశాయి. ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 5–0తో క్లీన్‌స్వీప్ చేయగా... ఆస్ట్రేలియాతోనే జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4–1తో గెలుపొందింది. పురుషుల విభాగం తొలి మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–19, 21–13 తో ఆంటోని జొయ్పై నెగ్గాడు. డబుల్స్ మ్యాచ్ లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 21–11, 21–15తో మాథ్యూ చావు–సావన్ సెరాసింఘే జోడీని ఓడించింది. మూడో మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 21–9, 21–6తో జాకబ్ స్కెలెర్పై గెలిచాడు. నాలుగో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జోడీ 21–16, 20–22, 21–8తో సిమాన్ వింగ్ హంగ్–రేమండ్ టామ్ ద్వయంపై నెగ్గింది. ఐదో మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21–5, 21–14తో కయి చెన్ తెహ్‌పై గెలిచాడు. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడుతుంది. వైష్ణవి, సైనా విజయం: మహిళల విభాగం తొలి సింగిల్స్‌లో సైనా 21–14, 21–19తో చెన్పై గెలిచి 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో మేఘన– పూర్వీషా రామ్ జం ట 13–21, 16–21తో గ్రోన్యా సోమర్విల్లె–రెనుగా వీరన్ జోడీ చేతిలో ఓడింది. దీంతో 1–1తో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. మూడో మ్యాచ్‌లో వైష్ణవి రెడ్డి 21–17, 21–13తో జెన్నిఫర్ టామ్‌పై గెలుపొంది భారత్‌కు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్‌లో సంయోగిత–ప్రాజక్తా జంట 21–19, 21–11తో లౌసా మా–అన్ లౌసి స్లీపై గెలిచి 3–1తో భారత విజయాన్ని ఖాయం చేసింది. ఐదో మ్యాచ్‌లో అనురా 21–6, 21–7తో జెసిలీపై నెగ్గి భారత్‌ను 4–1తో గెలిపించింది. బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ ఆడుతుంది. -
శ్రీకాంత్ నంబర్ వన్
న్యూఢిల్లీ: భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచాడు. రెండురోజుల క్రితమే అతడికి అగ్రస్థానం ఖరారు కాగా, గురువారం సమాఖ్య విడుదల చేసిన జాబితాతో అధికారికంగా ప్రకటించినట్లైంది. శ్రీకాంత్ ప్రస్తుతం 76,895 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తాజా ర్యాంక్‌తో కంప్యూటరైజ్డ్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ అయిన తొలి భారతీయ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. 2015 లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది. వైఎస్ జగన్ అభినందన టాప్ ర్యాంక్‌కు చేరుకున్న శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. శ్రీకాంత్ ఘనత పట్ల తెలుగువారందరూ ఎంతో గర్వపడుతున్నారని మెచ్చుకున్నారు. అతను ఇలాంటి మరె న్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నంబర్‌వన్ కావడం గౌరవంగా, భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా. ఈ ఘనత గోపి సర్, ఇతర కోచ్‌లు, కుటుంబ సభ్యులు, సహాయక బృందం ఇలా అందరి శ్రమకు ప్రతిఫలం. ప్రస్తుతానికి దృష్టంతా కామన్వెల్త్, ఆసియా క్రీడలు సహా పెద్ద టోర్నీల్లో నెగ్గడమే. నాపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యవాదాలు. – శ్రీకాంత్ -
‘రాకెట్’ దూసుకెళ్లింది...
మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో టీమిండియా 3–1తో సింగపూర్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప గెలుపొంది భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నేటి మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలయ్యే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మలేసియాతో భారత్ తలపడుతుంది. -
విజయం కోసం వంద శాతం కష్టపడ్డా
సెమీఫైనల్లో విజయం కోసం వంద శాతం కష్టపడ్డాను. కానీ తుది ఫలితం నిరాశపరిచింది. క్రీడాకారుల కెరీర్లో గెలుపోటములు సహజమే. మ్యాచ్ అన్నాక ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. మూడు గేమ్‌లు ఆడటం సులువేమీ కాదు. ఇలాంటి మ్యాచ్‌ల్లో రెండు, మూడు పాయింట్లే ఫలితాన్ని శాసిస్తాయి. ఆల్ ఇంగ్లండ్ టోర్నీతో నేనెంతో నేర్చుకున్నాను. ఈ సీజన్‌లోని తదుపరి టోర్నమెంట్లలో మరింత మెరుగ్గా రాణించేందుకు శ్రమిస్తాను. – ఆల్ ఇంగ్లండ్ టోర్నీ సెమీస్‌లో ఓటమిపై సింధు -
తుది మెట్టుపై బోల్తా
న్యూఢిల్లీ: స్వదేశంలో వరుసగా రెండో ఏడాది ఇండియా ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 18–21, 21–11, 20–22తో పరాజయం పాలైంది. 69 నిమిషాలపాటు సాగిన ఈ తుది పోరులో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. తన కెరీర్లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్ ఓడించింది. వీరిద్దరు ముఖాముఖిగా ఐదుసార్లు తలపడగా... సింధు మూడుసార్లు, జాంగ్ రెండుసార్లు గెలిచారు. ఐదు మ్యాచ్‌లు కూడా మూడు గేమ్‌లపాటు జరగడం విశేషం. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్ జాంగ్ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది. క్వార్టర్ ఫైనల్ మినహా మిగతా మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించిన సింధుకు ఫైనల్లో గట్టిపోటీనే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా నెహ్వాల్‌ను... సెమీస్‌లో ఆరో సీడ్ చెయుంగ్ ఎన్గాన్ (హాంకాంగ్)ను ఓడించిన బీవెన్ జాంగ్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. తొలి గేమ్‌లో కీలక దశలో పైచేయి సాధించిన జాంగ్ రెండో గేమ్‌లో మాత్రం సింధు ధాటికి తడబడింది. రెండుసార్లు వరుసగా ఆరు పాయింట్లు చొప్పున కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. చివర్లో సింధు 20–19తో మ్యాచ్ పాయింట్‌ను సంపాదించింది. కానీ ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన జాంగ్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ షి యుకి (చైనా) 21–18, 21–14తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి విజేతగా నిలిచాడు. -
ఔను... నం.1 కావాలనుంది
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ రన్నరప్ పీవీ సింధు అగ్రస్థానంపై కన్నేసింది. వచ్చే సీజన్లో బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ర్యాంకులో నిలవాలనుకుంటున్నట్లు తెలిపింది. ‘నేనిప్పుడు మూడో ర్యాంకులో ఉన్నా. కొత్త సీజన్లో తొలి ర్యాంకుకు చేరాలనుకుంటున్నా. బాగా ఆడితే ఆటోమెటిక్‌గా ర్యాంకూ మెరుగవుతుంది. కాబట్టి దీనిపై మరీ ఎక్కువగా ఆలోచించడం లేదు. కోర్టులో మెరుగైన ప్రదర్శనపైనే దృష్టిసారించా. తద్వారా ర్యాంకు మారుతుందని తెలుసు’ అని సింధు తెలిపింది. ప్రస్తుతం ఆమె ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో చెన్నై స్మాషర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. 22 ఏళ్ల హైదరాబాదీ స్టార్ షట్లర్ ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్ ప్రి, కొరియా ఓపెన్ టైటిల్స్‌ను గెలవడంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్, హాంకాంగ్ ఓపెన్, దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఒక దశలో స్థిరమైన విజయాలతో ఆమె రెండో ర్యాంకుకు ఎగబాకి... రెండు నెలలపాటు టాప్–2లో నిలిచింది. ‘ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో పోటీ పెరిగి సుదీర్ఘ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గతంతో పోల్చుకుంటే గంటన్నర పాటు కోర్టుల్లో చెమటోడ్చాల్సి వస్తోంది’ అని పేర్కొంది. మొత్తంమీద 40 నిమిషాల ఆట పెరిగిందని సింధు చెప్పింది. స్వదేశంలోని ప్రేక్షకుల మధ్య ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటానని, దీన్ని ఒత్తిడిగా భావించనని పేర్కొంది. -
నేటి నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
-
సింధు వర్సెస్ సైనా
గువాహటి: బ్యాడ్మింటన్ అభిమానులను అలరించడానికి ప్రొ బ్యాడ్మింటన్ లీగ్ సీజన్–3 సిద్ధమైంది. నేటి నుంచి 23 రోజుల పాటు గువాహటి, లక్నో, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి. స్థానిక కరమ్‌బీర్ నబీన్ చంద్ర బర్డోలాయ్ ఏసీ ఇండోర్ స్టేడియంలో జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ జట్టు అవధ్ వారియర్స్‌తో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో భాగంగా చెన్నై తరఫున పీవీ సింధు, అవధ్ తరఫున సైనా నెహ్వాల్‌లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నారు. ఇటీవలే జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి సైనా జోరు కనబరిచింది. అయినప్పటికీ ముఖాముఖిలో 2–1తో సింధుదే పైచేయిగా ఉంది. సీజన్–2లో ఆరు జట్లతో జరిగిన పీబీఎల్‌లో ఈసారి మరో రెండు జట్లు జతయ్యాయి. కొత్తగా అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, నార్త్ ఈస్ట్రన్ వారియర్స్ జట్లు లీగ్‌లో చేరాయి. వీటితో పాటు ఢిల్లీ ఏసర్స్ జట్టు పేరు మార్చుకొని ఢిల్లీ డాషర్స్ పేరుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పీబీఎల్‌లో తొలిసారిగా మహిళల నం.1 క్రీడాకారిణి తైజు యింగ్ (తైవాన్) అరంగేట్ర జట్టు అహ్మదాబాద్ స్మాషర్స్ తరఫున బరిలోకి దిగనుంది. పురుషుల విభాగంలోనూ వరల్డ్ నం.1 విక్టర్ అక్సెల్సన్ బెంగళూరు బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈసారి 10 మంది ఒలింపియన్లు లీగ్‌లో పాల్గొననుండటం విశేషం. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఇరు జట్ల మధ్య రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్ మూడు గేమ్‌ల పాటు జరుగుతుంది. ప్రతీ గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. గత సీజన్లో 11 పాయింట్లతో గేమ్‌ను నిర్వహించారు. లీగ్ దశ ముగిశాక పాయింట్లపరంగా టాప్–4 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో కీలకమైన సెమీస్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ పోరుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ.6 కోట్లు. ట్రోఫీతో 8 జట్ల మార్క్యూ ఆటగాళ్లు -
టైటిల్‌పై సింధు, శ్రీకాంత్ ఆశలు
-
ఫైనల్ సవాల్
ఏడాది మొత్తం ప్రదర్శించిన ఆట ఒక ఎత్తు... ప్రతీ మ్యాచ్ ఒక పెద్ద టోర్నీ ఫైనల్‌లాగే సాగే ఈ టోర్నీ ఒక ఎత్తు... సంవత్సరం మొత్తం సాగించిన జోరును మరో టోర్నీలో కొనసాగించి సీజన్‌ను అద్భుతంగా ముగించేందుకు టాప్ షట్లర్లందరికీ ఇది మరో అవకాశం. డజను సూపర్ సిరీస్ టోర్నీలలో పెద్దా, చిన్న ప్రత్యర్థులతో తలపడి తుది పోరుకు అర్హత సాధించినవారు మరో ఐదు రోజుల పాటు సమాన స్థాయి ఆటగాళ్లను ఎదుర్కొని సత్తా చాటేందుకు ఇది తగిన వేదిక. ప్రపంచ బ్యాడ్మింటన్‌కు పెద్దన్నలాంటి సూపర్ సిరీస్ ఫైనల్స్ పోటీల సవాల్‌కు టాప్–8 ఆటగాళ్లంతా సన్నద్ధమయ్యారు. ఈ పోరులో తుది విజయం ఎవరిదో వేచి చూడాలి. దుబాయ్ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: బ్యాడ్మింటన్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. ఇక్కడి హమ్దాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నేటి నుంచి ఐదు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం టాప్–8 స్థానాల్లో ఉన్న ఆటగాళ్లు మాత్రమే ఇందులో పాల్గొంటున్నారు. ఫలితంగా ప్రతీ మ్యాచ్ హోరాహోరీగా, రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఆటగాళ్లను రెండు గ్రూప్‌లలో విభజించారు. ఒక్కో గ్రూప్‌లో తమ ముగ్గురు ప్రత్యర్థులతో షట్లర్లు తలపడతారు. మూడు మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికలో టాప్–2లో నిలిచినవారు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. పాయింట్లు సమమైతే గెలిచిన గేమ్‌లు, ఒక్కో మ్యాచ్‌లో గెలిచిన పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాల తర్వాత ఇక్కడ కూడా విజేతగా నిలవాలని సింధు పట్టుదలగా ఉండగా... ఈ ఏడాది రికార్డు స్థాయిలో నాలుగు సూపర్ సిరీస్ టోర్నీలు గెలిచిన శ్రీకాంత్ కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న చైనా స్టార్ ప్లేయర్ చెన్ లాంగ్ చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో గ్రూప్ ‘ఎ’లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే పోటీ ఉన్నారు. సింధుకు సులువే... సింధు తొలి మ్యాచ్‌లో చైనాకు చెందిన హి బింగ్జియావోతో తలపడుతుంది. ప్రస్తుతం సింధు 3వ ర్యాంక్‌లో, బింగియావో 9వ ర్యాంక్‌లో ఉన్నారు. వీరిద్దరి మధ్య 9 మ్యాచ్‌లు జరగ్గా సింధు 4 గెలిచి, 5 ఓడింది. ఈ ఏడాది ఆరంభంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓడిన సింధు... ఇటీవల కొరియా ఓపెన్‌లో ఇదే ప్రత్యర్థిని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. సింధు రెండు సూపర్ సిరీస్ విజయాలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి ఫామ్‌లో ఉండగా, బింగ్జియావో 2017లో ఒక్క జపాన్ ఓపెన్‌లో మాత్రమే రన్నరప్‌గా నిలవగలిగింది. కాబట్టి పరిస్థితి సింధుకే అనుకూలంగా కనిపిస్తోంది. శ్రీకాంత్‌కు పరీక్ష... కిడాంబి శ్రీకాంత్ మాత్రం తొలి మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్, సూపర్ సిరీస్ ఫైనల్స్ డిఫెండింగ్ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ పోటాపోటీగా సాగే అవకాశం ఉంది. ఇందులో గెలిస్తే గ్రూప్‌లో మిగతా ఇద్దరిని ఓడించడం శ్రీకాంత్‌కు కష్టం కాకపోవచ్చు. ఈ సంవత్సరం రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన విక్టర్ ఒకదాంట్లో రన్నరప్‌గా నిలిచాడు. అదే శ్రీకాంత్ నాలుగు టైటిల్స్‌తో సత్తా చాటాడు. వీరిద్దరి మధ్య రికార్డు 3–3తో సమంగా ఉంది. అయితే 2017లో వరుసగా రెండు సార్లు ఓడిన తర్వాత విక్టర్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్ దెబ్బ తీశాడు. 12 టోర్నీల ద్వారా... ఏడాదిలో జరిగే 12 సూపర్ సిరీస్ టోర్నీల్లో ఆటగాళ్లు చూపిన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఇక్కడ సీడింగ్స్‌ను ఖాయం చేస్తారు. వీటిలో ఐదు సూపర్ సిరీస్ ప్రీమియర్ ఈవెంట్లు, మరో ఏడు సూపర్ సిరీస్ ఈవెంట్లు ఉన్నాయి. సూపర్ సిరీస్ టోర్నీలలో ప్రదర్శన మాత్రమే చూస్తారు కాబట్టి అర్హత సాధించేందుకు వరల్డ్ ర్యాంక్ ఇక్కడ వర్తించదు. ఫైనల్స్ కోసం మరో ర్యాంక్‌ను ఇస్తారు. సన్ వాన్ హో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌లో ఉన్నా... ఇక్కడ అతను నంబర్‌వన్. విక్టర్ అక్సెల్సన్ ర్యాంక్ 8 కాగా... శ్రీకాంత్ దుబాయ్ ర్యాంకింగ్ 2 (వరల్డ్ ర్యాంక్ 4). అయితే ఈ టోర్నీలో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరు ఆటగాళ్లకు లేదా రెండు జోడీలకు మాత్రమే అవకాశం లభిస్తుంది. టోర్నమెంట్ మొత్తం ప్రైజ్‌మనీ బ్యాడ్మింటన్‌లో అత్యధికంగా 10 లక్షల డాలర్లు (రూ. దాదాపు 6 కోట్ల 46 లక్షలు) కావడం విశేషం. సింగిల్స్ విజేతలకు 80 వేల డాలర్ల (రూ. 51 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఏ గ్రూప్‌లో ఎవరంటే... మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: పీవీ సింధు (భారత్), అకానె యామగుచి (జపాన్), సయాకా సాటో (జపాన్), హీ బింగ్జియావో (చైనా). గ్రూప్ ‘బి’: తై జు యింగ్ (చైనీస్ తైపీ), సుంగ్ జీ హున్ (కొరియా), రచనోక్ (థాయ్‌లాండ్), చెన్ యుఫె (చైనా). పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’: సన్ వాన్ హో (కొరియా), లీ చోంగ్ వీ (మలేసియా), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్). గ్రూప్ ‘బి’: కిడాంబి శ్రీకాంత్ (భారత్), అక్సెల్సన్ (డెన్మార్క్), చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ), షి యుకి (చైనా). అత్యుత్తమ ప్రదర్శన సైనా, జ్వాలదే... 2008 నుంచి జరుగుతోన్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన రజత పతకమే. 2011లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా... 2009లో మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు జంట రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు గెలిచారు. రికార్డుస్థాయిలో ఏడుసార్లు ఈ టోర్నీలో పాల్గొన్న సైనా నాలుగుసార్లు సెమీఫైనల్‌కు (2008, 2009, 2012, 2014) చేరుకోగా... రెండుసార్లు లీగ్ దశలో (2013, 2015) నిష్క్రమించింది. గతేడాది సింధు తొలిసారి ఈ టోర్నీకి అర్హత సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ మూడోసారి ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటున్నాడు. 2014లో సెమీస్‌కు చేరిన అతను 2015లో లీగ్ దశలో వెనుదిరిగాడు. గతేడాది శ్రీకాంత్ అర్హత పొందలేకపోయాడు. ►నేటి సాయంత్రం గం. 4.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
చైనా ఓపెన్ సిరీస్ నుంచి సైనా ఔట్
పుజౌ (చైనా) : చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అయిదో సీడ్ క్రీడాకారిణి అకానె యామగుచి (జపాన్) చేతిలో 18-21, 11-21 తేడాతో ఓటమి పాలైంది. తొలిసెట్లో కొంతసేపు పోరాడిన సైనా, రెండో రౌండ్లో పూర్తిగా పట్టు కోల్పోయింది. మరోవైపు పీవీ సింధు ఇవాళ ప్రిక్వార్ట్ ఫైనల్లో హాన్ యుయి (చైనా)తో తలపడనుంది. -
తెలుగు తేజానికి కెరీర్ బెస్ట్ ర్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ : భారత నెంబర్ వన్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ మరో అరుదైన మైలురాయికి చేరుకున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న స్టార్ షట్లర్ శ్రీకాంత్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తూ నాలుగు టైటిళ్లను నెగ్గిన విషయం తెలిసిందే. రెండు ర్యాంకులు మెరుగు పరుచుకున్న తెలుగుతేజం తాజా ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంకు '2'లో నిలిచాడు. డెన్మార్క్ షట్లర్ విక్టర్ అక్సల్సెన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్ నుంచి ప్రణయ్ (11), సాయి ప్రణీత్ (16) స్థానాల్లో ఉన్నారు. సింధు ర్యాంకు పదిలం.. తాజా ర్యాకింగ్స్లో పీవీ సింధు తన ర్యాంకును కాపాడుకుంది. గురువారం విడుదలైన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో సింధు మరోసారి రెండో స్థానంలో నిలిచింది. మాజీ నెంబర్ వన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ 11వ స్థానాన్ని దక్కించుకుంది. -
శ్రీకాంత్‌కు రూ. 5 లక్షల ‘బాయ్’ నజరానా
డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన కిడాంబి శ్రీకాంత్‌కు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల నజరానా ప్రకటించింది. ‘శ్రీకాంత్ సాధిస్తున్న విజయాలకు మేమెంతో గర్విస్తున్నాం. భవిష్యత్‌లో భారత్ నుంచి మరింత మంది ఆటగాళ్లు అంతర్జాతీయస్థాయిలో టైటిల్స్ గెలుస్తారనే నమ్మకంతో ఉన్నాం’ అని ‘బాయ్’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ తెలిపారు. మంగళవారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ప్రణయ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ బరిలో ఉన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్ : వరంగల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్రస్థాయి అండర్–17, 19 జూనియర్ బాడ్మింటన్ పోటీల్లో భాగంగా గురువారం క్రీడాకారులకు క్వాలీ ఫైయింగ్ మ్యాచ్‌లు నిర్వహించారు. ఈ సం ద ర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి మాట్లాడుతూ హన్మకొండ సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో రెండు రోజుల పాటు జరిగే పోటీలను పద్మశ్రీ అవార్డు గ్రహీత పుల్లెల గోపిచంద్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్వాలీ ఫైయింగ్ మ్యాచ్‌లకు పది జిల్లాల నుంచి 115 మంది క్రీడాకారులు హాజరైనట్లు చెప్పారు. ఇందులో అర్హత సాధించిన క్రీడాకారులు మెయిన్ డ్రాకు ఎంపికై పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్రావు, కోశాధికారి నాగకిషన్, జాతీయ అంపైర్ కొమ్ము రాజేందర్, అంపైర్లు కిశోర్, హన్మంతరావు, శ్యాం, శ్రీధర్, మల్లికార్జున్, పీవీఎల్ కుమార్, పీసీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ను కలిసిన సింధు, గోపిచంద్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సింధు, కోచ్ గోపీచంద్ లు కలిశారు. క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్న కేసీఆర్ ను సింధు, గోపిచంద్ లు అభినందించారు. కేసీఆర్ తో భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడలకు కేసీఆర్ మంచి ప్రోత్సాహకం ఇస్తున్నారు. ఏషియన్ గేమ్స్‌లో మరింత ప్రతిభ కనబరచాలని సీఎం కోరారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గెలిచినందుకు అభినందించారు అని తెలిపారు.