భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందులో మరోసారి తన ఎటైర్‌తో అందర్నీ ఆకర్షించింది. సింధు కోర్టులో మెరుపు షాట్లతో అబ్బుర పర్చడంమాత్రమే కాదు, తనదైన శైలి ఫ్యాషన్‌తో అందమైన చీర కట్టుతో ఆకట్టుకుంది. ‘మీ అండ్ మైన్’ అంటూ ఇన్‌స్టాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులను ఆమె లుక్‌కి ఫిదా అవుతూ కామెంట్స్‌పెట్టారు.
ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన పీవీ సింధు క్లాసిక్ ఇండియన్ కాంజీవరం చీరలో అద్భుతంగా కనిపించింది. అందమైన బిగ్ జరీ బోర్డ్ పట్టుచీరలో నవ్వుతూ యువరాణిలా కనిపించింది. చీర అంతా తెల్లటి ఎంబ్రాయిడరీ అందంగా కనిపిస్తోంది. దీనికి జతగా మల్టీ లేయర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులతో తన లుక్ ను మరింత ఎలివేట్ చేసుకుంది. మృదువైన కర్ల్స్‌లో స్టైల్ చేసి అలా వదిలేసింది.
ఇదీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్
వెంకట దత్త సాయి విషయానికొస్తే, అతను తెల్లటి కుర్తా-పైజామా సెట్‌లో ఎప్పటిలాగానే మెరిసిపోయాడు. తన లుక్‌ను మరింతగా పెంచుతూ,పీచ్-హ్యూడ్ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించాడు. ఇంకా గోల్డెన్ ఎంబ్రాయిడరీ, బటన్స్ జాకెట్‌కు ట్రెండీ స్టైల్‌ను జోడించాయి.
కాగా రెండుసార్లు ఒలింపియన్ అయిన సింధు గత సంవత్సరం డిసెంబర్‌లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రతీది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెహిందీ, సంగీత్ వేడుకల్లో అందంగాముస్తాబై, ఫ్యాషన్ ప్రియులు కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. సమయానికి తగ్గట్టుఅద్భుతమైన సాంప్రదాయ దుస్తులతో ఈ జంట అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. మ్యాచింగ్ డైమండ్ ఆభరణాలతో పీవీ సింధు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది.
ఇదీ చదవండి: తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్ స్టోరీ
Comments
Please login to add a commentAdd a comment