Elegant
-
బ్లాక్ డ్రెస్ ఔట్ఫిట్లో ఫోజులు ఇస్తున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
అందాల శ్రీమతికి అందమైన లెహెంగా (ఫోటోలు)
-
తక్కువ ఖర్చుతో ఇండోర్ గార్డెనింగ్: ఈ విషయాలు తెలుసుకోండి!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత కాలంలో మన కలలకు ప్రతిరూపమైన స్వీట్హోంను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంటిని అందంగా, ఆరోగ్యంగా తీర్చుకోవడం కూడా ఒక కళ అవసరం కూడా. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాతి నుంచి ఇంట్లో స్వచ్చమైన గాలి కోసం మొక్కలను పెంచడం పెరిగి పోయింది. దీంతో దుర్వాసనకు దూరంగా ఉండటంతో పాటు అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత ఏంటంటే.. వీటికయ్యే వ్యయం చాలా తక్కువ. నిర్వహణ కూడా తేలికే. పైగా అందంగా, అద్భుతమైన డిజైన్లతో అలంకారప్రాయంగానూ ఉంటాయి. (హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జూమ్, ఏకంగా 130 శాతం జంప్) ఇండోర్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్ మొక్కే. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. దీని నిర్వహణ అత్యంత సులువు. చాలా తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్కను ఉంచినప్పటికీ.. స్వచ్చమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. (యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!) మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్‌లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను చాలా సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది. గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి. కాలుష్య కారకాలను తొలగించడం, కార్బన్ మోనాక్సైడ్, ఆమ్మోనియా ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరెథైలీన్లను పీల్చుకోవటంలో, ఇండోర్‌లోని గాలిని శుభ్రం చేయడంలో పీస్ లిల్లీలు అద్భుతంగా పనిచేస్తాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది పుష్పించే మొక్క కాదు. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వస్తుంది. ఇది పెరగాలంటే నేల, తేమ అవసరం. దీనికి తరుచుగా నీళ్లు పోస్తుండాలి. ఆకులు పడిపోతున్నాయంటే దీనికి నీటి అవసరం ఉందన్న విషయం మీరు గ్రహించాలి. ఈ మొక్కలు ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు అనేక రకాలుగా వస్తాయి. చైనీస్ ఎవర్గ్రీన్ లేదా ఆగ్లోనెమాస్ బహుముఖ ప్రయోజనాలు ఉండే మొక్కలు. వీటి నిర్వహణ సులువ. అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. వీటిని ఇంటీరియర్ డిజైనింగ్‌లో అలంకారప్రాయంగాను వినియోగించుకోవచ్చు. అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో పాటు హానికారక రసాయనాలను పీల్చుకుంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కలు పెరుగుతాయి. -
వెదురే.. అదిరే..
సాక్షి, హైదరాబాద్: శుభ్రం చేయడమెంతో తేలిక. దీర్ఘకాలపు మన్నిక.. ఎలాంటి మరకలైనా తుడవగానే మాయం. నిర్వహణలో కన్పించని సమస్యలు. పైగా ఇంటికే సరికొత్త అందం. ఇలాంటి అనేకానేక ప్రత్యేకతల కారణంగా వెదురు గచ్చు(బ్యాంబూ ఫ్లోరింగ్)కి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో.. పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూట్టానికి చక్కగా కన్పించడం.. తదితర కారణాల వల్ల వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. రెండు రకాలు.. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తిరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. మొత్తం మూడు వర్ణాల్లో ఈ కలప లభిస్తుంది. ఆరేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండటం కోసం గచ్చుకి ఆరు లేయర్ల పాలియురేథేన్ కోటింగ్ వేస్తారు. ధర ఎంత? ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో ఇంటిని అలంకరించాలంటే... చదరపు అడుగుకి రూ. 200-350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ వంద చదరపు అడుగుల గదికి సుమారు రూ. 20,000 అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కోసం చదరపు అడుగుకి రూ. 300 దాకా అవుతుంది. వెదురు కలపను ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ. 15 దాకా తీసుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీ ఇంట్లో ప్రస్తుతం ఎలాంటి గచ్చు ఉన్నా.. దానిపై బ్యాంబూ ఫ్లోరింగ్‌ను సులువుగా వేసుకోవచ్చు. పైగా ఒక్కరోజులో పని పూర్తవుతుంది. -
బ్యాంబూ ఫ్లోరింగ్‌తో అదిరే అందం
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ ప్రియుల దృష్టి వెదురు గచ్చు మీద పడింది. ఇతర రకాల కలప కంటే దృఢంగా ఉండటం.. చూడ్డానికి చక్కగా కన్పించడం.. తదితర కారణాల వల్ల వెదురు గచ్చుకి గిరాకీ అధికమవుతోంది. వెదురు గచ్చులో ఎలిగెంట్, ఎలైట్ అనే రెండు రకాలు లభిస్తాయి. వీటి తయారీ ప్రక్రియల్లో చాలా తేడా ఉంటుంది. కత్తరించిన చిన్నచిన్న బ్యాంబూని అతికించేది ఎలిగెంట్ అయితే.. దీనికి భిన్నంగా బ్యాంబూ ఫైబర్‌తో చేసేది ఎలైట్ రకం. ఇదెంతో దృఢంగా ఉంటుంది. ధర ఎంత?: ప్రస్తుతం ఈ తరహా కలపను చైనా నుంచి దిగుమతి చేస్తున్నారు. దీనితో ఇంటిని అలంకరించాలంటే... చదరపు అడుగుకి రూ. 200-350 దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఓ వంద చదరపు అడుగుల గదికి సుమారు రూ. 20,000 అవుతుందన్నమాట. మార్కెట్లో లభించే ఇతర కలపతో తయారైన ఫ్లోరింగ్ కోసం చదరపు అడుగికి రూ. 300 దాకా అవుతుంది. వెదురు కలపను ఇంట్లో వేయడానికి విడిగా చార్జీలుంటాయి. చదరపు అడుగుకి రూ. 15 దాకా తీసుకుంటారు.