Kanjeevarams
-
శోభిత ధూళిపాళ, నాగచైతన్య పెళ్లి సందడి : హాట్ టాపిక్‌గా శోభిత పెళ్లి చీర
టాలీవుడ్లో మోస్ట్ ఎవైటింగ్ వెడ్డింగ్ అంటే హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళదే. ఈ లవ్‌బర్డ్స్ వచ్చే నెల(డిసెంబర్ 4, 2024న) మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఇరు కుటుంబాలు జోరుగా చేస్తున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య , శోభితా వివాహ ఆహ్వాన పత్రం కూడా ఆన్లైన్లో వైరల్‌గా మారింది. మరోవైపు శోభితా పెళ్లి చీర, షాపింగ్ వివరాలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తన జీవితంలో అతి ముఖ్యమైన ఈరోజుకోసం శోభిత చాలా ఉత్సాహంగా ప్లాన్ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం ఎలాంటి డిజైనర్ లేకుండానే తెలుగు వారసత్వాన్ని చాటుకునేలా స్వయంగా తానే దుస్తులను ఎంపిక చేసుకుంటోందట శోభితా ధూళిపాళ. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అమ్మతో కలిసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో షాపింగ్‌లో బిజీబిజీగా గడుపుతోంది. తన పెళ్లిలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటోందట. పెళ్లి రోజు కోసం ప్యూర్ గోల్డ్ జరీతో నేసిన కంజీవరం పట్టుచీరలో అందంగా మెరిసిపోనుంది. అలాగే కాబోయే వరుడు నాగ చైతన్య కోసం కూడా మ్యాచింగ్ సెట్‌ను సెలెక్ట్ చేసినట్టు తెలిప్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన తెల్లటి ఖాదీ చీరను కూడా కొనుగోలు చేసిందట.కాగా ఇటీవల నిశ్చితార్థ వేడుకలు పసుపు దంచడం లాంటి కీలకమైన వేడుకల్లో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా శోభితా ధూళిపాళ చీరలో అందంగా కనిపించింది. పెళ్లి పనులు మొదలు పెట్టిన సందర్భంలో బంగారు, ఆకుపచ్చ క్రీమ్ షేడ్స్‌లో, ఆరెంజ్ కలర్ బార్డర్చీరతో కనిపించిన సంగతి తెలిసిందే. -
కంజీవరం-వెండి సీక్విన్ చీరలలో ఊర్మిళ స్టన్నింగ్ లుక్స్..!(ఫొటోలు)
-
కాంజీవరమంటే.. ప్రాణం
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌కు చీరలంటే ప్రాణం. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు ఈ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకుంది కూడా. అయితే ఇపుడామె తన జీవితంలో రెండుసార్లు భారీ ఆస్తిని సొంతం చేసుకున్నానని గర్వంగా ప్రకటిస్తోంది. ఒకటి తన తల్లిదండ్రులు ఇస్తే.... రెండోది తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఇచ్చాడట. ఏమిటబ్బా అంత గొప్ప సంపద అనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా... ఆ రెండూ తనకెంతో ఇష్టమైన చీరలట. వాటిలో ఒకటి.. విద్యాబాలన్‌కు ఆమె అమ్మా నాన్న బహుమతిగా ఇచ్చిన గ్రీన్, పింక్ కాంబినేషన్‌తో ఉన్న కాంచీవరం పట్టుచీర. రెండోది తన శ్రీవారు కానుకగా ఇచ్చిన ఎరుపు రంగు బెనారస్ చీరట. తనకు చీరలంటే చిన్నప్పటినుంచీ ఇష్టమనీ, తల్లి బీరువాలోని చీరలను చూసి మూడేళ్ల వయసపుడే మనసు పారేసుకున్నానంటోంది. బాల్యంలో అమ్మచీరలు కట్టుకొని దిగిన బోలెడన్ని ఫొటోలే దీనికి నిదర్శనమంటోంది. ఆరు గజాల చీరలంటే తనకు చచ్చేంత ఇష్టమని చెబుతోంది. తనదగ్గర దేశవ్యాప్తంగా లభించే కాటన్ చీరల పెద్ద కలక్షనే ఉందిట. జూన్ 19 వరల్డ్ ఎత్నిక్ డే సందర్భంగా క్రాఫ్ట్స్ విల్లా డాట్ కామ్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో విద్యాబాలన్ పాల్గొనబోతోంది. ఈ సందర్భంగా ఆమె తన మనోభావాలను వెలిబుచ్చింది. పరిణీత సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రంచేసిన విద్యాబాలన్.. 'డర్టీ పిక్చర్' సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న 'హమారీ అధూరీ కహానీ' అనే బాలీవుడ్ మూవీలో ఇమ్రాన్ హష్మి, రాజ్‌కుమార్ రావు తదిరులతో కలిసి నటిస్తోంది.