సైనాలానే ఉందే! | Parineeti Chopra look from Saina Nehwal biopic is viral | Sakshi
Sakshi News home page

సైనాలానే ఉందే!

Published Sat, Nov 7 2020 12:36 AM | Last Updated on Sat, Nov 7 2020 12:36 AM

Parineeti Chopra look from Saina Nehwal biopic is viral - Sakshi

‘సైనా’లో పరిణీతి

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో పరిణీతీ చోప్రా లుక్‌ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసిన సైనా నెహ్వాల్‌ ‘అచ్చు నాలానే ఉందే’ అని కామెంట్‌ చేశారు. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం పరిణీతి బ్యాడ్మింటన్‌ సాధన చేశారు. బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపారు పరిణీతి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్‌కు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement