
పరిణీతీ చోప్రా
బ్యాడ్మింటన్ గ్రౌండ్‌లోకి దిగి చెమటోడుతున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. ఇదంతా ‘సైనా’ బయోపిక్ కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ‘సైనా’ అనే చిత్రం సంగతి తెలిసిందే. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పరిణీతీ చోప్రా ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ‘‘ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి వర్కౌట్ చేస్తున్నాను. రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా.
ఇంతకుముందు సైనా ఆడిన మ్యాచ్‌లను చూశాను. సిల్వర్ స్క్రీన్‌పై సైనాలా ఆడేందుకు అవి నాకు చాలా ఉపయోగడతాయి. మంచి టీమ్ దొరికింది. సైనా పాత్రకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడతాను’’ అని పేర్కొన్నారు పరిణీతీ చోప్రా. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ముందుగా సైనా బయోపిక్ కోసం శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నారు. కానీ శ్రద్ధా డేట్స్ క్లాష్ అవ్వడంతో ఆమె తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment