Saina Nehwal Biopic
-
ఓటీటీలోనే 'సైనా' బయోపిక్?
కరోనా పుణ్యమా అని ఓటీటీలకు డిమాండ్ బాగానే పెరిగింది. ప్రస్తుతం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ రేటు మాత్రమే ఉండటంతో మేకర్స్ డిజిటల్ వైపు చూస్తున్నారు. తాజాగా బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తీసిన బయోపిక్ కూడా ఓటీటీలోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా నటించగా, అమోల్ గుప్తా దర్శకత్వం వహించారు. గతేడాది వేసవిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, లాక్డౌన్ కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. (‘పుష్ప’ షూటింగ్లో విషాదం : షాక్‌లో అభిమానులు ) ప్రస్తుతం థియేటర్లలో ఆక్యుపెన్సీ రేటు కారణంగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికే నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది కాగా సైనా పాత్రలో మొదట శ్రద్ధా కపూర్ నటించినా కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆ అవకాశం పరిణితీకి దక్కింది. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం పరిణీతి బ్యాడ్మింటన్ సాధన చేశారు. బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపారు పరిణీతి. (సన్నాఫ్ ఇండియా ఫస్ట్‌లుక్ విడుదల) -
సైనాలానే ఉందే!
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సైనా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి పరిణీతీ చోప్రా టైటిల్ రోల్ చేస్తున్నారు. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో పరిణీతీ చోప్రా లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటో చూసిన సైనా నెహ్వాల్ ‘అచ్చు నాలానే ఉందే’ అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో సైనా పాత్ర కోసం పరిణీతి బ్యాడ్మింటన్ సాధన చేశారు. బ్యాడ్మింటన్‌లో మెళకువలన్నీ నేర్చకోవడంతోపాటు సైనా, ఆమె కుటుంబంతో సమయం గడిపారు పరిణీతి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్స్‌కు రానుంది. -
పీవీ సింధూ బయోపిక్‌లో దీపిక పదుకొనే!?
సాక్షి, హదరాబాద్: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ స్టార్స్ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌లకు సంబంధించిన బయోపిక్‌లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్ బయోపిక్కు ‘శభాష్ మిత్తూ’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్‌లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్‌లకు సంబంధించిన వివరాలతో గల్లీ గ్రౌండ్ టూ బయోపిక్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దొరై, బ్యాడ్మింటన్ స్టార్స్ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్‌ల బయోపిక్‌లు నిర్మించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్లపై తమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్‌లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు. సింధూగా దీపిక? సింధూ బయోపిక్‌లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్‌కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్ లేని కారణంగా బయోపిక్ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చారు సోనుసూద్.! మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్ ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌ల ఆటకు యావత్ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్ పుల్లెల గోపిచంద్ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్‌గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్‌ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్‌పై ‘వయోకామ్–18’, సైనా నెహ్వాల్‌పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్’ సంస్థలు ముందుకు రాగా..కోచ్ పుల్లెల గోపిచంద్పై నిర్మించేందుకు టాలివుడ్‌కు చెందిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ముందుకొచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత షూటింగ్ జరిగి నిలిచిపోయాయి. లాక్డౌన్ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్ టైంకి ఈ మూడు బయోపిక్‌లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్ ‘సాక్షి’తో చెప్పారు. శ్రద్థా టు పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కూడా సైనా బయోపిక్‌లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రొఫెషన్ టూ పర్సనల్ లైఫ్ మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్‌లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. పుల్లెల గోపీచంద్ చిన్న పాటి గ్రౌండ్ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్‌లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్ ఆటనే కాదు పర్సనల్ లైఫ్‌ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్‌ల ద్వారా తెలపనున్నారు. తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్బాబులే యాప్ట్ ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిత్తూ’లో హీరోయిన్ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్లాగానే ఉంది. సైనా నెహ్వాల్‌తో కలసి నెట్ ప్రాక్టీస్ చేసిన బాలీవుడ్ నటి పరిణీతిచోప్రా సేమ్ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్ పాత్రలో మన టాలివుడ్ హీరో సుధీర్‌బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్‌బాబులను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. ఆమె చెప్పిన వన్వర్డ్ ఆన్సర్‌తో ఫిదా అయ్యా మహిళల ప్రపంచ కప్‌కు ముందు జరిగిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్‌ను మీరు మేల్ క్రికెటర్‌ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్‌తో ఫిదా అయ్యాను. శభాష్ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్ నటి తనలా చేయడం గొప్ప అనుభూతి గ్రౌండ్లో సైనా నెహ్వాల్ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. – పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి గోపి.. నా ఇన్స్పిరేషన్ గోపి (గోపీచంద్) నా ఇన్స్పిరేషన్.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం. అతని బయోపిక్ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్‌బాబు, సినీ హీరో కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్‌బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్‌లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్‌ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది. – పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్. చాలా హ్యాపీగా ఉన్నా నా మీద బయోపిక్ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్ అన్నీ ఇచ్చాను. షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది. – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కష్టానికి గుర్తింపు బయోపిక్ చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ రావడం ఆదర్శమనిపిస్తుంది ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్ కెరీర్‌గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. – మిథాలీరాజ్ దొరై, ఇండియన్ క్రికెటర్ -
మా జాగ్రత్తలు ఫలించలేదు
‘సైనా’ చిత్రానికి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అమోల్ గుప్తా ‘సైనా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలి సిందే. తొలుత ఈ సినిమాలో సైనా పాత్రకు శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేశారు. చిత్రీకరణ కూడా ప్రారంభించారు. శ్రద్ధాకు ఆరోగ్యం బాగోలేకపోవడం, ప్రాక్టీస్ సమయంలో గాయపడటం, డేట్స్ క్లాష్ అవ్వడం.. ఇలా పలు కారణాలతో ‘సైనా’ చిత్రం నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకున్నారు. ఆ తర్వాత సైనా నెహ్వాల్ పాత్ర చేయడానికి పరిణీతి చోప్రా పచ్చజెండా ఊపారు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. చిత్రీకరణ మొదట్లోనే పరిణీతి చోప్రా గాయపడటం చిత్రబృందాన్ని కలవరపెడుతోంది. ‘‘బ్యాడ్మింటన్ సాధనలో భాగంగా గాయపడకూడదని నేనూ, చిత్ర బృందం చాలా జాగ్రత్తలు వహించాం. కానీ, మా జాగ్రత్తలు ఫలించలేదు. నేను గాయపడ్డాను. కోలుకొని త్వరలో చిత్రీకరణలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. -
వాళ్లే నా సోల్‌మేట్స్: హీరోయిన్
‘వాళ్లే నా ఆత్మబంధువులు. నా స్నేహితులు. నా పిల్లలు. నా సర్వస్వం’ అంటూ బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా తన సోదరులపై ఉన్న ప్రేమ చాటుకున్నారు. తన కంటే చిన్నవాళ్లే అయినా వారెంతో పరిణతితో ఆలోచిస్తూ తనకు సలహాలు, సూచనలు ఇస్తుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ భాయ్ దూజ్ వేడుక(భగినీ హస్త భోజనం)లో తన తమ్ముళ్లు సహజ్, శివాంగ్‌తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముళ్లతో కలిసి దిగిన ఫొటోను పరిణీతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నాలాగా ఉండమని చెబుతాను.. బాయ్ దూజ్ సందర్భంగా పరిణీతి మాట్లాడుతూ.. ‘నాకంటే చిన్నవాళ్లు అయినంత మాత్రాన నేను వాళ్లను గారాబం చేయను. నిజం చెప్పాలంటే వాళ్లే నాపై ఎక్కువ ప్రేమ కురిపిస్తారు. నాకు వాళ్లంటే ఎంతో ఇష్టం. నా జీవితం గురించిన మొత్తం విషయాలు వాళ్లకు తెలుసు. మా మధ్య దాపరికాలు ఉండవు. నాకు ప్రతీ విషయంలోనూ సలహాలు ఇస్తారు. నాకంటే గొప్పగా ఆలోచిస్తారు. ఒకవేళ నేను వాళ్లకు ఏదైనా చెప్పాల్సి వస్తే నాలాగే సంతోషంగా ఉండమని చెబుతాను. ఎన్ని బాధలు ఉన్నా.. కఠిన పరిస్థితులు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానాన్ని ఎంజాయ్ చేయమని మాత్రమే సలహా ఇస్తాను అని పేర్కొన్నారు. అదే విధంగా వేసవి కాలం సెలవుల్లో కెన్యాలో ఉండే తమ బామ్మ వాళ్ల ఇంటికి వెళ్లడం తమకు ఉన్న మధుర ఙ్ఞాపకాలు అని.. అక్కడ పార్కుల్లో తిరుగుతూ అందరం తెగ సందడి చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కాగా సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో ఒత్తిడి తట్టుకోలేక తాను డిప్రెషన్‌కు గురైనట్టు పరిణీతి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు. View this post on Instagram The loves of my life! #HappyRakhi ❤️❤️❤️ @thisissahajchopra @shivangchopra99 A post shared by Parineeti Chopra (@parineetichopra) on Aug 26, 2018 at 5:59am PDT -
ట్రైనింగ్ స్టార్ట్
బ్యాడ్మింటన్ గ్రౌండ్లోకి దిగి చెమటోడుతున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. ఇదంతా ‘సైనా’ బయోపిక్ కోసమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘సైనా’ అనే చిత్రం సంగతి తెలిసిందే. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పరిణీతీ చోప్రా ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. ‘‘ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి వర్కౌట్ చేస్తున్నాను. రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతకుముందు సైనా ఆడిన మ్యాచ్‌లను చూశాను. సిల్వర్ స్క్రీన్‌పై సైనాలా ఆడేందుకు అవి నాకు చాలా ఉపయోగడతాయి. మంచి టీమ్ దొరికింది. సైనా పాత్రకు పూర్తి న్యాయం చేసేలా కష్టపడతాను’’ అని పేర్కొన్నారు పరిణీతీ చోప్రా. ఈ సినిమాను 2020లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ముందుగా సైనా బయోపిక్ కోసం శ్రద్ధాకపూర్‌ను తీసుకున్నారు. కానీ శ్రద్ధా డేట్స్ క్లాష్ అవ్వడంతో ఆమె తప్పుకున్నారు. -
శ్రద్ధా కపూర్ ఔట్.. పరిణితీ ఇన్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’.. విభిన్న చిత్రాల దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్, సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైనా బయోపిక్ కోసం కొంత కాలం గ్రౌండ్ వర్క్ చేసిన శ్రద్ధాకపూర్... బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. లుక్స్ పరంగా కూడా సైనా నెహ్వాల్‌కు దగ్గరగా ఉండే శ్రద్ధాకపూర్... స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందనే క్యూరియాసిటీ కూడా జనాల్లో పెరిగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం సైనా బయోపిక్ నుంచి శ్రద్ధ తప్పుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో శ్రద్ధకు డెంగ్యూ జ్వరం సోకండంతో గతేడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఉన్న శ్రద్దకు ‘సైనా’చిత్రానికి డేట్స్ కుదరటం లేదు. దీంతో తన కారణంగా ఈ సినిమా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నుంచి శ్రద్ద తప్పుకున్నారు. అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ 2020లో విడుదల చేయాలనుకుంటున్న చిత్ర బృందం.. శ్రద్ద స్థానంలో మరో హీరోయిన్ పరిణీతి చోప్రాను తీసుకున్నారు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్స్ 3D’, ‘భాగి 3’ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. -
చెడు అలవాట్లు దూరం
బ్యాడ్మింటన్ ఆడుతుంటే చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ దూరమౌతున్నాయి అంటున్నారు శ్రద్ధా కపూర్. ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ రాకెట్ ఎందుకు పట్టుకున్నారో మీకు తెలుసు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాత్ర పోషిస్తున్నారామె. ఈ పాత్ర కోసం శ్రద్ధ రోజూ గంటల కొద్దీ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం చెబుతూ – ‘‘ప్రాక్టీస్ కోసం ఉదయాన్నే నిద్ర లేస్తున్నాను. దాంతో రోజును పొడిగించుకున్నట్టే. ఉదయం లేవడం భలే ఉంది. ఈ సినిమా పూర్తయినా ఈ ఆటను, ఈ అలవాటుని అస్సలు వదలను’’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్. సైనా నెహ్వాల్ బయోపిక్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
గెలుపు కోసం...
బరిలో దిగిన ఇద్దరు ఆటగాళ్లూ ప్రతిభావంతులైనప్పుడు గేమ్ భలే మజాగా ఉంటుంది. ఇలాంటి గేమ్‌లో పాయింట్ గెలుచుకోవడానికి ఇద్దరూ చెమటోడ్చాల్సిందే. అదే చేస్తున్నట్లున్నారు కథానాయిక శ్రద్ధాకపూర్. ఆ విషయం ఇక్కడున్న ఫొటోను చూస్తూంటే అర్థం అవుతుంది. ప్రముఖ హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా హిందీలో ‘సైనా’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. -
‘సైనా’ షూటింగ్ షురూ!
ప్రస్తుతం వెండితెరపై బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. నార్త్, సౌత్ తేడాలేకుండా పలు భాషల్లో బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. తెలుగులో స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, తమిళ్లో జయలలిత జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్‌లు రెడీ అవుతున్నాయి. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై తీయబోతోన్న సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ‘సైనా’ గా రాబోతోన్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ లీడ్ రోల్‌ను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మించనుండగా, అమోల్ గుప్తే దర్శకత్వం వహించనున్నాడు. IT'S OFFICIAL... Shraddha Kapoor as Saina Nehwal... #SainaNehwalBiopic starts filming from 22 Sept 2018... Directed by Amole Gupte... Produced by Bhushan Kumar. pic.twitter.com/Vw4wmgF38R — taran adarsh (@taran_adarsh) 24 September 2018 -
సెప్టెంబర్‌లో స్టార్ట్
ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తున్నారు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్తున్నారట. ఈ వయసులో స్కూల్ ఏంటీ? అంటే.. బుక్స్‌తో కుస్తీ పడే స్కూల్ కాదండీ.. బ్యాడ్మింట¯Œ స్కూల్. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధా యాక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. కానీ లేట్ అవుతూ వస్తోంది. ఫైనల్లీ ఈ సెప్టెంబర్‌లో స్టార్ట్ కానుందట. అమోల్ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సైనా నెహ్వాల్‌ని తలపించడం కోసమే ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు శ్రద్ధా. ఈ రెండు నెలలు ఫుల్ ట్రైనింగ్‌లో గడపనున్నారామె. ప్రస్తుతం ప్రభాస్ సరసన శ్రద్ధా ‘సాహో’లో చేస్తోన్న సంగతి తెలిసిందే. -
శ్రద్ధా ఫెయిల్.. ఆ చిత్రం ఆగిపోయింది!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కు గత కొంత కాలంగా సక్సెస్ రేటు లేకుండా పోయింది. ఓకే జానుతోపాటు భారీ అంచనాల నడుమ విడుదలైన హసీనా పార్కర్ కూడా ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో ఆమె కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రద్ధా ప్రభాస్ సాహో షూటింగ్లో పాల్గొంటూనే.. మరోపక్క సైనా నెహ్వాల్ బయోపిక్కు సన్నద్ధమవుతోంది. అయితే అనూహ్యంగా సైనా బయోపిక్ రద్దైనట్లుగా బాలీవుడ్ మీడియాలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. బ్యాడ్మింటన్ నేపథ్యం కావటంతో గత కొన్ని రోజులుగా సైనా, గోపీచంద్‌ల సమక్షంలో శ్రద్ధా ఆటను సాధన చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆమె ఆటలో పరిపూర్ణత సాధించలేకపోవటంతో ఈ బయోపిక్ యత్నాన్ని దర్శకుడు అమోల్ గుప్తే విరమించుకున్నాడని ప్రముఖ మీడియా సంస్థ మింట్ కథనం ప్రచురించింది. అయితే ఆ వార్తలను చిత్ర యూనిట్ ఖండించినట్లు మరో కథనం వెలువడింది. శ్రద్ధా సాధన కోసం మరింత సమయం తీసుకోవాలని భావిస్తోందని.. అమోల్ కూడా అందుకు అంగీకరించటంతో కాస్త ఆలస్యంగా చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతుందని ఆ కథనం పేర్కొంది. ఇక మరో కథనం అయితే ఏకంగా శ్రద్ధాను తప్పించి.. ఆ స్థానంలో బ్యాడ్మింటన్ ఆటలో ప్రావీణ్యం ఉన్న దీపిక పదుకునేను తీసుకోవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వార్తను ప్రచురించింది. ఏది ఏమైనా మేకర్లు, చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తేనే ఈ పుకార్లపై స్పష్టత వచ్చేది. -
32క్లాసెస్‌కు వెళ్లా!
సెంటర్ లైన్, బ్యాక్ బౌండరీ లైన్, లాంగ్ సర్వీస్ లైన్... బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రతిరోజూ ఈ లైన్స్ గురించే తెలుసుకుంటున్నారట. ఆ లైన్స్‌తో ఈ బ్యూటీకి సంబంధం ఏంటనేగా మీ డౌట్. మరేం లేదు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ‘‘ఉదయాన్నే ఐదు గంటలకు లేచి, బ్యాడ్మింటన్ క్లాసెస్‌కు వెళుతున్నా. ఇప్పటివరకు 32 క్లాసెస్‌కు ఎటెండ్ అయ్యాను. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆట ప్రాక్టీస్ చేస్తాను. సైనా ది, నాది సేమ్ హైట్. తన పాత్రకు న్యాయం చేయగలుగుతానని నా నమ్మకం’’ అన్నారామె. ‘సాహో’ చిత్రం ద్వారా శ్రద్ధా తెలుగు తెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే.