సెప్టెంబర్‌లో స్టార్ట్‌ | Shraddha Kapoor has 2 Months to Complete Her Training for Saina Nehwal’s Biopic | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో స్టార్ట్‌

Published Mon, Jun 25 2018 1:51 AM | Last Updated on Mon, Jun 25 2018 1:51 AM

Shraddha Kapoor has 2 Months to Complete Her Training for Saina Nehwal’s Biopic - Sakshi

శ్రద్ధా కపూర్‌

ఉదయం ఐదు గంటలకే నిద్ర లేస్తున్నారు బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌. రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్తున్నారట. ఈ వయసులో స్కూల్‌ ఏంటీ? అంటే.. బుక్స్‌తో కుస్తీ పడే స్కూల్‌ కాదండీ.. బ్యాడ్‌మింట¯Œ స్కూల్‌. బ్యాడ్‌మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో శ్రద్ధా యాక్ట్‌ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్‌ అవ్వాల్సింది.

కానీ లేట్‌ అవుతూ వస్తోంది. ఫైనల్లీ ఈ సెప్టెంబర్‌లో స్టార్ట్‌ కానుందట. అమోల్‌ గుప్తా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో సైనా నెహ్వాల్‌ని తలపించడం కోసమే ఎర్లీ మార్నింగ్‌ ట్రైనింగ్‌ స్టార్ట్‌ చేశారు శ్రద్ధా. ఈ రెండు నెలలు ఫుల్‌ ట్రైనింగ్‌లో గడపనున్నారామె. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన శ్రద్ధా ‘సాహో’లో చేస్తోన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement