
సైనా నెహ్వాల్
మణికొండ: బ్యాడ్మింటన్ తన ఆత్మలో ఉందని, దాన్ని ఎప్పటికీ వదలిపెట్టనని పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ, అలకాపూర్ టౌన్‌షిప్ రోడ్డు నంబర్–3 వద్ద యోనెక్స్ స్పోర్ట్స్ స్టోర్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశంలో క్రీడాకారుల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులతో పాటు వారికి నచి్చన క్రీడలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడలకు మన దేశంలో రాబోయే రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఫిట్‌గా ఉండేలా చూసుకుని క్రీడల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. రెజ్లర్ వినేష్ పోగట్‌కు మరో పథకం వస్తుందనే ఆశతోనే ఉన్నానన్నారు. కార్యక్రమంలో స్టోర్ యజమానులు అమర్, కిరణ్, వెంకట్‌తో పాటు ఆమె అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment