
బ్యాడ్మింటన్ ఆడుతుంటే చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ దూరమౌతున్నాయి అంటున్నారు శ్రద్ధా కపూర్. ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ రాకెట్ ఎందుకు పట్టుకున్నారో మీకు తెలుసు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాత్ర పోషిస్తున్నారామె. ఈ పాత్ర కోసం శ్రద్ధ రోజూ గంటల కొద్దీ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం చెబుతూ – ‘‘ప్రాక్టీస్ కోసం ఉదయాన్నే నిద్ర లేస్తున్నాను. దాంతో రోజును పొడిగించుకున్నట్టే. ఉదయం లేవడం భలే ఉంది. ఈ సినిమా పూర్తయినా ఈ ఆటను, ఈ అలవాటుని అస్సలు వదలను’’ అని పేర్కొన్నారు శ్రద్ధా కపూర్. సైనా నెహ్వాల్ బయోపిక్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment