Shraddakapur
-
ప్రభాస్ సాహో హీరోయిన్ ఎంత సింపుల్ గా ఉందొ చూడండి
-
హిందీ ఆమె
అమలాపాల్ ముఖ్యపాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నారు ఆ చిత్రదర్శకుడు రత్నకుమార్. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. హిందీ రీమేక్‌లో కథానాయికగా శ్రద్ధాకపూర్ నటిస్తారని సమాచారం. మరి ఒరిజినల్ వెర్షన్లో అమలా చేసిన బోల్డ్ సీన్ (నగ్నంగా నటించారు) ను రీమేక్‌లో శ్రద్ధాకపూర్ చేస్తారా? అనేది చూడాలి. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
మా అమ్మాయిని షూటింగ్‌కి పంపను
‘‘పని ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. అయితే ప్రాణాలను పణంగా పెట్టేంత ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేనైతే బయటికి వెళ్లి పని (షూటింగ్) చేయను. మా అమ్మాయి (శ్రద్ధాకపూర్)ని కూడా షూటింగ్ చేయడానికి అనుమతించను’’ అంటున్నారు బాలీవుడ్ బడా విలన్ శక్తీ కపూర్. ‘ఇక సినిమా, టీవీ షూటింగ్స్ చేసుకోవచ్చు’ అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సినీపరిశ్రమవారికి అనుమతి ఇస్తున్నాయి. కొన్ని నియమ నిబంధనలు కూడా విధించాయి. మహారాష్ట్రలో షూటింగులు మొదలయ్యాయి కూడా. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా షూటింగ్స్‌లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు శక్తీ కపూర్. ‘‘భయం (కరోనా) అనేది మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. మనతోపాటే ఉంది. ముందు ముందు మరింత ప్రమాదం పొంచి ఉంది. అందుకే నా పిల్లలను మాత్రం బయటకు పంపను. ఇండస్ట్రీలోని మా గ్రూప్‌లో ఉన్న కొంతమందితో ‘ఆరోగ్యపరమైన సమస్య వచ్చి హాస్పిటల్లో చేరి బిల్లులు కట్టేకన్నా కొంతకాలం వేచి ఉండటం మంచిది’ అని చెప్పాను. ఎందుకంటే బయటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు శక్తీ కపూర్. కరోనా బారినపడినవారి సంఖ్య పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ కొరత ఏర్పడుతోంది. ఇదే విషయం గురించి శక్తీ కపూర్ మాట్లాడుతూ – ‘‘హాస్పిటల్స్‌లో బెడ్స్ లేవు. పైగా హాస్పిటల్లో జాయిన్ అయితే బిల్ బాంబ్లా మోత మోగిపోతుంది. చికిత్స చేయించుకుని హాస్పటల్ బిల్ కట్టలేకపోవడంతో ఒక వ్యక్తిని తాడుతో కట్టేశారని ఈ మధ్య న్యూస్‌లో చూశాను. దీని గురించి ఓ వీడియో చేయబోతున్నాను. ప్రపంచం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మానవీయత అనేది లేదేమో అనిపిస్తోంది’’ అన్నారు. -
కుందేలు దంతాలతో క్యూట్‌గా శ్రద్ధా కపూర్
చిన్ననాటి తీపి గుర్తులను తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు సాహో నటి శ్రద్ధా కపూర్. క్యూట్ స్మైల్‌తో ఉన్న చిన్ననాటి ఫోటోను శ్రద్ధా పోస్ట్ చేయడంతో అభిమానులు లైకులతో ముంచెత్తుతున్నారు. కుందేలులాంటి దంతాలతో ఉన్నప్పటి ఫోటో అంటూ శ్రద్ధా పెట్టిన కామెంట్‌కి సో క్యూట్ అంటూ పలువురు సినీ ప్రముఖులతోపాటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ ఫోటో షేర్ చేసిన ఒక్కరోజులోనే దాదాపు 23 లక్షల మంది లైక్ చేశారు. View this post on Instagram जब मेरे खरगोश जैसे दांत थे।🐰🦷🤓 #BeforeBraces A post shared by Shraddha (@shraddhakapoor) on Apr 20, 2020 at 4:51am PDT -
గుమ్మడికాయ కొట్టారు
‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ‘భాగీ3’. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హీరోయిన్గా శ్రద్ధాకపూర్ కనిపిస్తారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రితేష్, టైగర్ ష్రాఫ్ బ్రదర్స్‌లా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. -
ముద్దంటే ఇబ్బందే!
ప్రభాస్‌కి మొహమాటం ఎక్కువ. ‘రొమాంటిక్ సన్నివేశాలు, ముఖ్యంగా లిప్‌లాక్ సన్నివేశాలకు ఇబ్బందిపడతాను’ అంటున్నారు. ‘సాహో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయం గురించి ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘నాకు చాలా సిగ్గు ఎక్కువ. అందుకే ముద్దు సన్నివేశాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సన్నివేశాల్లో యాక్ట్ చేస్తున్నంతసేపు చాలా కష్టంగా అనిపిస్తుంటుంది’’ అన్నారు. ‘సాహో’ సినిమాలో శ్రద్ధాతో ఓ ముద్దు సన్నివేశం ఉండగా గతంలో ‘బాహుబలి 2’లో అనుష్కతో ఓ చిన్న ముద్దు సన్నివేశంలో నటించారు ప్రభాస్. -
జీవితం భలే మారిపోయింది
‘‘తొలిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేశా. అందరూ ఆయన్ని డార్లింగ్ డార్లింగ్ అంటారు. అలా ఎందుకంటారో ‘సాహో’ సినిమా చేసినప్పుడు తెలిసింది’’ అన్నారు మురళీ శర్మ అన్నారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘సాహో’ నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేసిన మురళీ శర్మ చెప్పిన విశేషాలు. ► ‘సాహో’ తొలిరోజు షూటింగ్ లంచ్‌టైమ్‌లో ‘ఇంటి భోజనం నాకు చాలా ఇష్టం’ అన్నాను. ఆ తర్వాత 60 రోజుల పాటు ప్రభాస్‌గారి ఇంటి నుంచి నాకు భోజనం వచ్చేది. నాకే కాదు.. పదిమందికి సరిపడే పెద్ద క్యారియర్‌లో భోజనం వచ్చేది. గుత్తి వంకాయ కూర ఎంత బాగుంటుందంటే చెప్పడానికి మాటల్లేవ్. నిజంగా ప్రభాస్ మంచి మనిషి.. యూనివర్సల్ డార్లింగ్. ► ‘భాగమతి’ సినిమా టైమ్‌లో సుజీత్ ‘సాహో’ కథ చెప్పాడు. తనది మంచి బ్రెయిన్. కథని అద్భుతంగా రాసుకున్నాడు. వంశీ, ప్రమోద్, విక్కీ చాలా ప్యాషనేట్ నిర్మాతలు. ఎప్పుడూ సెట్లో ఉండి సినిమా ఎలా వస్తోంది? ఏంటి? అని చూసుకునేవారు. యూవీ క్రియేషన్స్ నాకు హోమ్ బ్యానర్‌లాంటిది. ‘అభినేత్రి’ సినిమాకి మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పా. ఇప్పుడు ‘సాహో’కి కూడా. ఓ సినిమాని ఒకేసారి పలు భాషల్లో చేయడం, డబ్బింగ్ చెప్పడం ఓ ప్రయోగం. ఏ భాషలో అయినా భావోద్వేగాలు ఒక్కటే.. భాష మాత్రం వేరు. ► ఏ సక్సెస్‌కి అయినా ప్రిపరేషన్ ముఖ్యం. నా పాత్రకి ముందుగానే నేను ప్రిపేర్ అవుతా. ఇటీవల ‘ఎవరు, రణరంగం’ చిత్రాల్లోనూ మంచి పాత్రలు చేశా. ప్రతి పాత్రనీ ఎంజాయ్ చేస్తా. తండ్రి పాత్ర చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నా జీవితం మారిపోయింది. ► నేను పుట్టి, పెరిగింది ముంబైలో. మా అమ్మగారు తెలుగువారే. ‘అతిథి’ చిత్రంలో నాకు చాన్స్ వచ్చింది. బిగినింగ్‌లోనే మహేశ్‌బాబులాంటి సూపర్‌స్టార్‌తో, అంత పెద్ద సినిమాలో మంచి పాత్ర చేస్తాననుకోలేదు. ‘మా అబ్బాయి కృష్ణగారి అబ్బాయి సినిమాలో చేస్తున్నాడు’ అని మా అమ్మ అందరికీ చెప్పుకున్నారు. తెలుగు, తమిళ్, మరాఠీ, హిందీ భాషలను మేనేజ్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం ‘అల.. వైకుంఠపురములో’, శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నా. మారుతిగారితో ఓ చిత్రం చేశా. సందీప్ కిషన్–నాగేశ్వర్రెడ్డిగారి సినిమా దాదాపు పూర్తి కావస్తోంది. ‘అతిథి’ తర్వాత మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశా. -
విడుదలైన సాహో రొమాంటిక్ పాట!
సాహో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆ సినిమాకు సంబంధించిన ఒక్కోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలను ఒక్కొక్కట్టిగా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఊరిస్తూ వస్తున్న చిత్రబృందం తాజాగా ‘బేబీ వోంట్ యూ టెల్ మీ’ పాటను విడుదల చేసింది. హీరో ప్రభాస్ ‘సాహో నుంచి రొమాంటిక్, మెలోడియస్ పాట విడుదల’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను పోస్ట్ చేశాడు. ఈ పాటకు విడుదలైన ఒక్క గంటలోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ మరో పాటను విడుదల చేసింది. ‘బేబీ వొంట్ యూ టెల్ మీ’ అంటూ సాగనున్న ఈ పాటకు మనోజ్ యాదవ్ లిరిక్స్‌ని అందించాడు. శంకర్ , ఎహాన్స్, లాయ్ త్రయంలు హీందీ వెర్షన్లో ఈ పాటను కంపోస్ చేయగా శంకర్ మహదేవన్, రవి మిష్రా, అలిస్సా మన్డొన్సా ఆలపించారు. అందమైన సాహిత్యంతో కూడిన పాట సన్నివేశాలను అస్ట్రియాలోని పలు అద్భతమైన సుందర ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో ప్రభాస్, శ్రద్ధలు పోలీసుల పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆగష్టు 30న విడుదల చేయనున్నారు. View this post on Instagram New symphony from Saaho with romance and lots more is out now. Hope you all like it! #Saaho #SaahoOnAugust30 @shraddhakapoor @sujeethsign @neilnitinmukesh @apnabhidu @chunkypanday @arunvijayno1 @mandirabedi @maheshmanjrekar @sharma_murli @vennelakish @uvcreationsofficial @bhushankumar @tseries.official @officialsaahomovie A post shared by Prabhas (@actorprabhas) on Aug 25, 2019 at 11:24pm PDT -
లైటింగ్ + షాడో = సాహో
లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను ‘విజువల్ వండర్’ అని సంబోధిస్తుంటారు. దర్శకుడు మెదడులో అనుకున్న కథను సినిమాటోగ్రాఫర్ తన కెమెరాతో స్క్రీన్ పై చూపిస్తాడు. మన కంటే ముందే తన లెన్స్‌తో సినిమా చూసేస్తాడు కెమెరామేన్. ‘సాహో’ లాంటి భారీ సినిమాని తన కెమెరా కన్నుతో ముందే చూసేశారు చిత్ర ఛాయాగ్రాహకుడు మది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’కి మది ప్రత్యేకంగా చెప్పిన ‘మేకింగ్ ఆఫ్ సాహో’ విశేషాలు. ► 350 కోట్ల భారీ బడ్జెట్ సినిమా చేసే చాన్స్ తరచు రాదు. ప్రభాస్‌తో గతంలో ‘మిర్చి’ చేశాను. స్వతహాగా ఆయన హ్యాండ్సమ్గా ఉంటారు. ‘మిర్చి’లో స్టైలిష్‌గా చూపించే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు ‘సాహో’లో మరిన్ని షేడ్స్‌లో ప్రభాస్‌ని చూపించాను. దర్శకుడు సుజీత్ తీసిన ‘రన్ రాజా రన్’కి వర్క్ చేశాను. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నాకు మంచి స్నేహితులు. ‘సాహో’ లాంటి విజువల్ వండర్‌కి పని చేయడం అద్భుతమైన అవకాశం. విజువల్‌గా ఈ సినిమా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ► ఇలాంటి భారీ సినిమాకు హోమ్ వర్క్ లేకుండా డైరెక్ట్‌గా సెట్లో దిగలేం. ‘సాహో’ సినిమాకు ప్రీ–ప్రొడక్షన్ వర్క్, ప్రీ–డిజైన్ వర్క్ చాలా ఎక్కువ చేశాం. అవుట్‌పుట్ ఎలా వస్తుందో? అని ముందే రఫ్‌గా చూసుకున్నాం. కెమెరామేన్, యాక్షన్ డైరెక్టర్, వీఎఫ్ఎక్స్ టీమ్ అందరం కలిసి టీమ్‌గా వర్క్ చేశాం. ► ‘సాహో’ బహుభాషా చిత్రం. ఒక భాషలో ఓ సన్నివేశం తీయగానే అదే సన్నివేశాన్ని యాక్టర్స్ అందరూ వేరే భాషలో నటించాలి. దానికి లైటింగ్ చాలా ముఖ్యం. అందుకే సన్నివేశానికి సంబంధించిన వాతావరణాన్ని మొత్తం లైటింగ్‌తో సృష్టించాం. అప్పుడు కంటిన్యూటీ మొత్తం మా కంట్రోల్లోనే ఉంటుంది. కొన్ని సన్నివేశాలకు లైటింగ్ సృష్టించడానికి రెండు మూడు రోజులు పట్టేది. ► ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పలు షేడ్స్‌లో ఉంటుంది. కథకు తగ్గట్టు క్యారెక్టర్ మారినప్పుడల్లా లైటింగ్ కూడా మార్చాలి. మామూలుగా ఏ సినిమాకైనా 4కెడబ్లు్య (కిలో వాట్స్), 6కెడబ్లు్య లేకపోతే 9కెడబ్లు్య లైటింగ్ వాడతాం. కానీ, ‘సాహో’కి మాత్రం హై ఇంటెన్సిటీ లైటింగ్ వాడాం. 16కెడబ్లు్య నుంచి 18కెడబ్లు్య లైటింగ్ వాడాం. దాన్నిబట్టి ఈ కథ మైలేజ్‌ని ఊహించుకోవచ్చు. చెప్పాలంటే సినిమా మొత్తం లైటింగ్, షాడో ఓరియంటెడ్‌గా ఉంటుంది. కథకు, సినిమాటోగ్రఫీకి వారధిలా లైటింగ్ నిలిచిందని చెప్పొచ్చు. ► ఈ సినిమాకు ఒకటి రెండు కాదు కొత్త కొత్త కెమెరా పరికరాలు చాలా ఉపయోగించాం. సుమారు 7–8 కెమెరా హెడ్స్‌ను వాడాం. ఈవో కార్, స్కార్పియో రిమోట్ హెడ్ కెమెరాలు, స్పెషల్ జీఎఫ్8 కెమెరాలు, 2 జిమ్మీ జిబ్స్, మాక్సిమస్ కెమెరా హెడ్ (అన్నింటి కంటే కొంచెం ఖరీదైన పరికరం ఇది). వెబ్రేషన్స్‌ను అదుపులో ఉంచే జింబల్ హ్యాండ్ కెమెరాలు, చాప్‌మ్యాన్ డాలీ, జీఎఫ్ఎమ్ క్రేన్ ఇవన్నీ ఉపయోగించాం. హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కెన్నీ బేట్స్‌తో సంభాషించి కొన్ని పరికరాలను జర్మనీ నుంచి తీసుకువచ్చాం. సన్నివేశానికి అనుగుణంగా, క్వాలిటీకి రాజీపడకుండా కెమెరాలు వాడాం. ► అబుదాబిలో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలకు ప్రతిరోజు సెట్లో 14 కెమెరాలు వరకూ ఉండేవి. మెయిన్ కెమెరాలు 7, ఇతర కెమెరాలు 7. సుమారు 25 రోజులు ఆ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించాం. నా టీమ్ మొత్తం 60 మంది. అబుదాబి షెడ్యూల్లో దాదాపు 80మంది కెమెరా డిపార్ట్‌మెంట్‌కే వర్క్ చేశారు. ఫోకస్ పుల్లర్స్, లైటింగ్ డిపార్ట్మెంట్, క్రేన్స్ ఇలా ఒక్కో విభాగం చూసుకున్నారు. అందులో 20 శాతం ఫారిన్ వాళ్లు కూడా పని చేశారు. ఫారిన్ వాళ్లతో పని చేసే సమయంలో ఓ ఇబ్బంది ఉంది. అదేంటంటే కమ్యూనికేషన్. ఒక్కో డిపార్ట్మెంట్కు టెక్నికల్ పదాలు ఒక్కోలా ఉంటాయి. యాక్షన్ వాళ్ల టెక్నికల్ పదాలు ఒకలా ఉంటాయి. కెమెరా వాళ్లవి ఒకలా ఉంటాయి. వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పడం కూడా చిన్న చాలెంజే (నవ్వుతూ). ► ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నలిగిపోయినవన్నీ ఒరిజినల్ ట్రక్కులు, కార్లు. ముందు డమ్మీలతో ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఒరిజినల్ కార్స్, ట్రక్స్‌ని బద్దలు కొట్టారు. సినిమాలో ఎంత మోతాదులో యాక్షన్ ఉందో.. అంతే ప్రాముఖ్యత లవ్‌స్టోరీకి కూడా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలకు ఒక మూడ్ ఉంటుంది. ప్రేమ సన్నివేశాలు ఒక మూడ్. ఈ వ్యత్యాసాన్ని స్క్రీన్ మీద చూపించడం చాలా ఎంజాయ్ చేశాను. ప్రభాస్, శ్రద్ధాకపూర్ ► అబుదాబి ఫైట్ ఎపిసోడ్ కాకుండా గన్‌ఫైట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. డమ్మీ బులెట్స్‌తో షూట్ చేసినప్పటికీ ఈ ఎఫెక్ట్ కొత్తగా ఉంటుంది. కెమెరా మూమెంట్స్ అన్నీ గన్ పాయింట్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. అటు కెమెరాకి ఇటు మాకు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ఫైట్ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► భారీ యాక్షన్ సినిమా చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనివార్యం. కానీ మే మాత్రం ఎవరి లైఫ్‌నీ రిస్క్ చేయదలచుకోలేదు. యాక్షన్ సన్నివేశాల్లో కారు 150 కి.మీ. ల వేగంతో వెళ్తుందంటే అంత స్పీడ్‌తో కెమెరా ఫాలో కానక్కర్లేదు. మనకు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఉపయోగించుకున్నాం. అలా టెక్నాలజీ హెల్ప్‌తో ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. 225 రోజులు వర్కింగ్ డేస్ ఉన్నప్పటికీ ఒక్క కెమెరా పరికరానికి డ్యామేజ్ జరగలేదు. అదే పెద్ద విశేషం. పెద్ద పెద్ద ట్రక్కులను, కార్లను మాత్రమే డ్యామేజ్ చేశాం (నవ్వుతూ). టోటల్‌గా ‘సాహో’ మాకో మంచి అనుభూతి. రేపు ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి అవుతుంది. ► అబుదాబి వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ ఎండ 45 డిగ్రీలు పైనే. అబుదాబి షెడ్యూల్లో చాలామంది వడదెబ్బకు గురయ్యారు. మాలో కొంతమందికి చర్మం ఊడొస్తుండేది. అనూహ్యంగా ఇసుక తుఫానులు కూడా వస్తుండేవి. అలాంటి సమయాల్లో మమ్మల్ని మేం కాపాడుకుంటూనే మా ఖరీదైన కెమెరాలను కూడా జాగ్రత్త చేసేవాళ్లం. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా కష్టపడతాం. అవుట్‌పుట్ చూశాక ఆ కష్టాలన్నీ మర్చిపోతాం. ► ఈ సినిమా చిత్రీకరణకు 230 రోజులు పట్టింది. అది కూడా 8 రోజులు టెస్ట్ షూట్, 50 రోజుల లైటింగ్ అరేంజ్‌మెంట్‌ను మినహాయించి. ► ‘సాహో’ కోసం సుమారు 60 సెట్లను ఏర్పాటు చేశారు. ఈ సెట్లన్నీ హైదరాబాద్, పూణే, ముంబై, అబుదాబి, యూరోప్‌లో వేశారు. ► 350 కోట్ల బడ్జెట్లో కెమెరా డిపార్ట్మెంట్కు కేటాయించిన బడ్జెట్ సుమారు 25 కోట్లు (కెమెరామేన్ల రెమ్యూనరేషన్లు మినహాయించి). – గౌతమ్ మల్లాది -
పంద్రాగస్టుకు ట్రైలర్?
‘సాహో’ ప్రమోషన్స్ మస్త్ స్పీడ్ మీద ఉన్నాయి. రోజుల వ్యవధిలో కొత్త పోస్టర్స్‌ను విడుదల చేస్తూ ‘సాహో’ సందడి మొదలుపెట్టింది చిత్రబృందం. తాజాగా ‘సాహో’ చిత్రానికి సంబంధించి మరో కొత్త యాక్షన్ పోస్టర్‌ను విడుదల చేశారు ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. గతంలో ‘షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 1’, ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’లతో పాటు టీజర్‌ను కూడా ‘సాహో’ చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పంద్రాగస్టుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. జాకీష్రాఫ్, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రకాష్ బెల్వాది తదితరులు నటించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానుంది. -
స్టెప్పుల సాహో
ఫారిన్ ప్రదేశాలలో అద్భుతమైన పాటలను అదిరిపోయే స్టెప్పులతో పూర్తి చేశారు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’. వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల యూరప్‌లో ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్లో రెండు పాటలను చిత్రీకరించారు. ఒక పాటను ఆస్ట్రియాలో, మరో పాటను కురేషియాలో చిత్రీకరించినట్లు చిత్రబృందం వెల్లడించింది. కురేషియాలో చిత్రీకరించిన పాటలో సుమారు యాభైమంది కురేషియన్ మోడల్స్‌తో ప్రభాస్ కాలు కదిపారు. అలాగే ఓ పాటలో ప్రభాస్‌తో హిందీబ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులేశారని సమాచారం. ఈ సినిమాకు జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాహో చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
మరో రీమేక్‌లో?
తెలుగులో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయడం కామన్. టాలీవుడ్ హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో షాహిద్ కపూర్ ఇటీవల భారీ హిట్ అందుకున్నారు. షాహిద్ గత చిత్రాల అత్యధిక వసూళ్లను సైతం ‘కబీర్‌సింగ్’ తొలి వారంలోనే దాటనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు తెలుగు చిత్రం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని బాలీవుడ్ టాక్. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులకూ అలరిస్తుందని ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ అనుకున్నారట. అందుకే ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారనే మాట వినిపిస్తోంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే హిందీ రీమేక్ చేయనున్నారట. -
మా ప్రపంచంలోకి రండి
సాహో ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించడానికి మేం రెడీ అయ్యాం అంటోంది చిత్రబృందం. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 13న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సినిమాలోని శ్రద్ధా కపూర్ లుక్‌ను విడుదల చేశారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, ఎవలిన్ శర్మ, లాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. -
ఇట్స్ సాహో టైమ్
‘స్ట్రీట్‌డ్యాన్సర్ త్రీడీ’, ‘చీఛోరే’, ‘భాగీ 3’, ‘సాహో’ ఇలా వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్. ఒక్కో సినిమా కోసం ఒక్కో లొకేషన్‌కి వెళ్తున్నారీ భామ. ప్రస్తుతం ‘సాహో’ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చారామె. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తు న్నారని తెలిసింది. నైట్ షూట్ జరుగుతోంది. ఇలా ప్రస్తుతం శ్రద్ధాకు ‘సాహో’ టైమ్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో శ్రద్ధా ల్యాండ్ అవడానికి ముందు ‘స్ట్రీట్‌డ్యాన్సర్ త్రీడీ’ చిత్రం కోసం దుబాయ్ వెళ్లొచ్చారు శ్రద్ధా. ఇందులో వరుణ్ ధావన్ హీరో. ఈ సంగతు లన్నీ పక్కనపెడితే.... సౌత్ కొరియన్ మూవీ ‘మిస్‌గ్రానీ’ బాలీవుడ్ రీమేక్‌లో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించబోతున్నారని తాజా బాలీవుడ్ ఖబర్. -
సర్ప్రైజ్ వచ్చేసింది
‘డార్లింగ్స్ రేపు మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఉంది’ అని సోమవారం అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ అన్నారు. అంతే... ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ‘సాహో’ కొత్త పోస్టర్ అని, టీజర్ రిలీజ్ అని, మేకింగ్ వీడియో అని రకరకాలుగా ఊహించుకున్నారు. కొందరి ఊహను ప్రభాస్ నిజం చేస్తూ మంగళవారం తన తాజా చిత్రం ‘సాహో’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ డేట్‌ను కూడా కన్ఫార్మ్ చేశారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మంగళవారం విడుదలైన ‘సాహో’ కొత్త పోస్టర్లో సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్స్‌తో ప్రభాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ వీడియోలకి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన ప్రభాస్ కొత్త పోస్టర్‌కు అంతే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు అన్నారు. -
క్యా బాత్ హై
‘బాహుబలి ’ సినిమా విడుదలైన రెండేళ్లకు ‘బాహుబలి 2’ వచ్చింది. ‘బాహుబలి 2’ చిత్రం విడుదలై రెండేళ్లు దాటింది. తమ అభిమాన హీరో కొత్తచిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి’తో ప్రభాస్‌కి ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ‘సాహో’ సినిమాకి ఆయన స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పి, ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నారు. ఇందుకోసం సోనీ అనే టీచర్ని పెట్టుకుని నెలపాటు హిందీ భాష నేర్చుకున్నారట ప్రభాస్. హిందీ తొలుత కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత నుంచి అలవాటైపోయిందట. ఇక ఆయన డబ్బింగ్ చెప్పటమే మిగిలి ఉంది. కాగా ‘సాహో’కి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని ఇటీవల ముంబయిలో చిత్రీకరించారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15న ‘సాహో’ ని ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్ వంటి బాలీవుడ్ నటులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శంకర్–ఇషాన్–లాయ్, కెమెరా: మధి. -
నానీగారి నమ్మకం చూసి భయమేసేది
‘‘మనందరం సక్సెస్ అయన ఒక్క వ్యక్తినే గుర్తు పెట్టుకుంటాం. ఎంతో టాలెంట్ ఉన్నా వివిధ కారణాల వల్ల సక్సెస్ కాలేకపోయిన వాళ్ల కథ చెప్పాలనిపించింది. ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ కంటే తొంభైతొమ్మిది మంది ఫెయిల్యూర్ కథే మా ‘జెర్సీ’’ అని గౌతమ్ తిన్ననూరి అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాద్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శింపబడుతోంది అని చిత్రబృందం పేర్కొంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘మళ్ళీ రావా’ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలా? వేరే ఏదైనా జానర్లో సినిమా చేద్దామా? అనుకున్నాను. క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లే ఓ షోలో ‘‘సచిన్ టెండూల్కర్‌లా టాలెంట్ ఉన్న క్రికెటర్స్ ఇండియాలో చాలామందే ఉన్నారు. సచిన్ మాత్రమే అంత గొప్పవాడు ఎందుకయ్యాడంటే అతని యాటిట్యూడ్ వల్లే’’ అని మాట్లాడారు. 99 మంది ఫెయిల్యూర్స్ అనే పాయింట్ నాకు స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్రం కోసం స్పెషల్‌గా రీసెర్చ్ అంటూ ఏమీ చేయలేదు. ► నానీగారు మొదటి నుంచి ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన 22 సినిమాలు చేశారు. ఆయనకో అవగాహన ఉంది. కానీ నాకిది రెండో సినిమా. గొప్ప సినిమా చే స్తున్నాం అనే ఫీలింగ్ కాకుండా కంటెంట్ పరంగా తృప్తినిచ్చింది. మిక్సింగ్ థియేటర్లో వర్క్ పూర్తయ్యాక కొన్నిసార్లు ఇది నేను రాసుకొన్న కథేనా? మేము తీసిందేనా? అనేంతగా వర్క్ శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చింది. అలాగే నానీగారి నమ్మకం చూసి ఒక్కోసారి భయం వేసేది. ► ఇందులో నానీగారు, విశ్వంత్ తప్ప క్రికెట్ మ్యాచ్ సీన్స్‌లో కనిపించిన మిగతా వాళ్లంతా క్రికెట్ ప్లేయర్లే. వాళ్లందరికీ యాక్టింగ్‌లో కోచింగ్ ఇచ్చాం. రెగ్యులర్ సీన్ తీయడం, గ్రౌండ్లో మ్యాచ్ షూట్ చేయడం డిఫరెంట్. ఒక్క నిమిషం విజువల్స్ రావడానికి కనీసం ఒకటిన్నర రోజు పట్టేది. స్టోరీ బోర్డ్ ముందే రెడీ చేసుకోవటం వల్ల షూటింగ్ ఈజీ అయ్యింది. సాధారణంగా డే–నైట్ మ్యాచ్‌లో వైట్ బాల్‌తో ఆడతారు. సినిమా మొత్తం హీరోను వైట్ డ్రెస్‌లోనే చూపించాలన్న ఉద్దేశంతో రెడ్ బాల్ ఉపయోగించి. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. ► ‘మజిలీ’ దర్శకుడు శివనిర్వాణ, నేను క్లోజ్. మా ఇద్దరి సినిమాలు క్రికెట్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అని మాట్లాడుకున్నాం. ఇద్దరి కథలకు చాలా తేడా ఉంది. ► శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా యాక్ట్ చేసింది. నాని కొడుకుగా నటించిన రోనిత్‌ని ఓ ఫోటోషూట్‌లో చూసి అప్రోచ్ అయ్యాం. తను బాగా ఎనర్జిటిక్. నానీ గారు ఒకవేళ ఈ కథ చెయ్యకపోతే వేరే ఎవరన్నా తమిళ హీరోకి చెప్పేవాడినేమో. నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఏం ఆలోచించలేదు. -
ఇట్స్ రొమాంటిక్ టైమ్!
‘సాహో’ చిత్రం అనగానే అందరికీ యాక్షన్ అంశాలే గుర్తుకొస్తాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్, ఫస్ట్ లుక్లతో పాటు ‘షేడ్స్ ఆఫ్ సాహో, షేడ్స్ ఆఫ్ సాహో 2’ వీడియోస్‌లో కూడా యాక్షన్ అంశాలే ఎక్కువగా కనిపించాయి. అయితే... ‘సాహో’లో మంచి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల వీరిద్దరిపై ఓ పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. అయితే.. ప్రభాస్, శ్రద్ధాకపూర్ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఇది ‘సాహో’ చిత్రంలోనిదేనని అనుకుంటున్నారు. పైన ఉన్న ఫొటో అదే. ఈ ఏడాది పంద్రాగస్టుకు ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి శంకర్–ఎహసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రల పరిచయం ప్రభాస్ వాయిస్ ఓవర్‌తో ఆరంభం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. -
సాహో జ్ఞాపకాలు
ఒక్కో సినిమాకు ఏడాది వరకూ సమయాన్ని కేటాయిస్తుంటారు స్టార్స్. ఆ ప్రయాణంలో ఆ సినిమా స్పెషల్‌గా మారుతుంటుంది. కొందరు ఆ సినిమాలో ఏదో వస్తువును ఆ ప్రయాణానికి గుర్తుగా దాచుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ కూడా సాహో జ్ఞాపకాలను ఓ కారు, బైక్‌లో చూసుకోనున్నారట. ప్రభాస్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి చేసే యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్నో స్పోర్ట్స్ బైక్‌లు, కార్లు ఈ చిత్రానికి ఉపయోగించిన సంగతి తెలిసిందే. చాలా శాతం వరకూ యాక్షన్ సన్నివేశాలను డూప్ సహాయం లేకుండా ప్రభాసే చేస్తున్నారు. ఈ సినిమాలో వాడిన ఓ బైకు, కారును ‘సాహో’ గుర్తుగా తన దగ్గర పెట్టుకోనున్నారట ప్రభాస్. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, తమిళ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ ఎహాసన్ లాయ్. -
జపాన్‌లో సాహో
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కి చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హిందీ వెర్షన్‌ను బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో రిలీజ్ అయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సినిమాను జపనీస్‌లో కూడా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు నిర్మాతలు. ఆల్రెడీ జపాన్‌లోని ఓ లోకల్ డిస్ట్రిబ్యూటర్‌కు ‘సాహో’ రైట్స్‌ను కూడా ఇచ్చేశారని తెలిసింది. ‘బాహుబలి’ చిత్రం కూడా జపాన్‌లో విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక... ‘సాహో’ చిత్రం షూటింగ్ విశేషాలకు వస్తే.... ఈ చిత్రంలో ఆస్ట్రేలియన్–బ్రిటిష్ పాప్ సింగర్, నటి కైలీ మినాగ్ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు పదేళ్ల క్రితం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బ్లూ’ సినిమాలోని ‘చిగ్గీ.. విగ్గీ’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించారు కైలీ. ‘సాహో’ చిత్రంలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. జాకీష్రాఫ్, మందిరాబేడీ, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్–ఎహాసన్–లాయ్ సంగీతం అందిస్తున్నారు. -
మిసెస్ అవుతారా?
ప్రస్తుతం మిస్‌గా ఉన్న బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ 2020లో మిసెస్‌గా మారనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఆమె ఏడడుగులు వేసే ఆలోచనలో ఉన్నారని ముంబై సమాచారం. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు 33 ఏళ్ల శ్రద్ధాకపూర్. పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం అని కుటుంబ సభ్యులు భావించడంతో శ్రద్ధ కూడా వాళ్ల అభిప్రాయంతో ఏకీభవించారట. కొంతకాలంగా ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ఆమె డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె పబ్లిక్‌గా అంగీకరించకపోయినా ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్ అని బాలీవుడ్ టాక్. ఇప్పుడు ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకువెళ్లాలని, 2020లో పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారట. బాలీవుడ్లో హీరోయిన్ల షాదీ పరంపరలో శ్రద్ధాకపూర్ కూడా జాయిన్ అవ్వనున్నారు. మరి మిసెస్ అయ్యాక సినిమాలను మిస్ అవుతారా? ఊరుకోండి. -
ప్రయాణం అద్భుతంగా సాగింది
ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జైట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, ఎవలీన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేశారు. ‘‘ఇలాంటి వండర్ఫుల్ టీమ్‌లో భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణాన్ని ఓ మంచి జ్ఞాపకంగా చేసినందుకు ప్రభాస్, సుజీత్, యూవీ క్రియేషన్స్ సంస్థ, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. ఆగస్ట్ 15 నుంచి థియేటర్స్‌లో అద్భుతమైన అనుభూతిని పొందడానికి రెడీగా ఉండండి’’ అని అరుణ్ విజయ్ పేర్కొన్నారు. -
మేలో పూర్తి
‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘సాహో’. సుమారు 300 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ సైన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. మూడు పాటలు, ఓ యాక్షన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ మినహా, మిగతా షూటింగ్ మొత్తం మే నెలలోపు పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా ప్లాన్ చేయనున్నారట. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిర బేడీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శంకర్ ఎహాసన్ లాయ్, కెమెరా: మది. -
ఉద్ఘర్ష మంచి అనుభూతిని కలిగిస్తుంది
కన్నడ పరిశ్రమలో వినూత్న సినిమాలతో పేరు పొందారు దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘ఉద్ఘర్ష’. అనూప్ సింగ్ ఠాకూర్, తాన్యా హోప్, ధన్సిక, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. దేవరాజ్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మర్డర్ మిస్టరీ ట్రైలర్ లాంచ్ బెంగళూర్‌లో జరిగింది. ‘కిచ్చ’ సుదీప్ వాయిస్ ఓవర్ అందించిన ఈ ట్రైలర్‌ను కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్, నటి ప్రేమ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనూప్ సింగ్ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో మోస్ట్ చాలెంజింగ్ పాత్ర ఇది. సినిమా చేయడంలో కొంచెం ఆలస్యం అయింది. అయినా ఎక్కడా నా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా చూసుకున్నారు దర్శకుడు దేశాయ్. ఆయన సినిమాలో పని చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. గొప్ప థ్రిల్లర్‌ను చూశారన్న అనుభూతిని పొందుతారు’’ అన్నారు. ‘‘సునీల్‌గారి సినిమా అనగానే ఓకే అన్నాను. సునీల్కుమార్గారితో ఆల్రెడీ ‘రే’ అనే సినిమా చేశాను. ఇందులో నా క్యారెక్టర్ ఏంటో చెప్పకూడదు. సస్పెన్స్. కానీ కచ్చితంగా షాక్ అవుతారు’’ అన్నారు హర్షిక పొన్నాడ ‘‘కన్నడ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పాడు ఠాకూర్. తనని అభినందించి తీరాలి’’ అన్నారు దర్శన్. ‘‘వాయిస్ ఓవర్ అందించిన సుదీప్‌కు థ్యాంక్స్. టీమ్ అందరూ కష్టపడ్డాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సునీల్‌కుమార్ దేశాయ్. -
బూమ్...!
పెద్ద క్రైమ్ జరిగింది. దోషులను పట్టుకునేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం పక్కా స్కెచ్ వేసింది. ఈ స్కెచ్ ఏంటి? దోషులు ఎలా పట్టుపడ్డారు? అనే అంశాలను వెండితెరపై చూడాల్సిందే. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ ఈ సినిమాతో సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆదివారం ఆమె బర్త్‌డే సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకుముందు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో 1’ వీడియోను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజా వీడియో చివర్లో ప్రభాస్ బూమ్ అని స్టైలిష్‌గా పలకడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక‘షేడ్స్ ఆఫ్ సాహో 2’ ప్రభాస్, శ్రద్ధా కపూర్ మరింత స్టైలిష్‌గా కనిపించారు. విజువల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని ‘షేడ్స్ ఆఫ్ సాహో’ వీడియోలను చూస్తోంటే అర్థం అవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ప్రభాస్ క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయట. దొంగ, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ప్రభాస్ కనిపిస్తారని అంచనా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మలయాళం నటుడు లాల్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, ఎవెలిన్శర్మ, అరుణ్‌విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహెసన్ లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు. ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.