కిడ్నాపర్ల చెరలో... | Shraddha Kapoor's role in 'Saaho' adds weight to the story | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్ల చెరలో...

Published Mon, Dec 25 2017 12:08 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

 Shraddha Kapoor's role in 'Saaho' adds weight to the story  - Sakshi

ఒక పాత డెన్‌. అందులో ఎవరూ లేరు. ఇంతలో అక్కడికి ఓ కార్‌ వచ్చి ఆగింది. అందులో నుంచి హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ని కొందరు రౌడీలు బయటికి లాక్కొని వచ్చారు. చేతులు కట్టేసి ఉన్నాయి. హెల్ప్‌.. హెల్ప్‌ అని అరవడానికి వీల్లేకుండా నోటిని ఓ క్లాత్‌తో కట్టేశారు. ఆ గూండాల నుంచి తప్పించుకోవడానికి శ్రద్ధా విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండాపోయింది. ఆ రౌడీలు తనని డెన్‌లోకి లాక్కొని వెళ్లారు.

మేటర్‌ చదువుతుంటే శ్రద్ధాని ఎవరో కిడ్నాప్‌ చేశారని అర్థమవుతోంది కదూ. ఇంతకీ శ్రద్ధాని ఎవరు కిడ్నాప్‌ చేశారు? అంటే ‘సాహో’ చూడాల్సిందే. ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ జంటగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ని కిడ్నాప్‌ చేసే సన్నివేశాన్ని ప్రస్తుతం హైదరాబాద్‌లో షూట్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement