
ప్రభాస్
దుబాయ్‌లో షూటింగ్ జరగనుంది. 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నారు. కొన్ని రోజులుగా ‘సాహో’ సినిమా షూటింగ్ గురించి తెలిసిన సమాచారం ఇదే. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ ఎప్పుడు మొదలవుతుంది? ఎంతమంది టెక్నీషియన్స్ ఇందులో పాల్గొంటున్నారు? అన్న విషయాలు బయటకు రాలేదు. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దుబాయ్‌లో జరగబోయే భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.
► ఈనెల 12న ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ స్టార్ట్ చేయనున్నారు. లొకేషన్స్ వెతకడం కోసం గత ఆరు నెలల్లో 8 సార్లు దుబాయ్ వెళ్లారు. వెళ్లిన వారిలో ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్ కూడా ఉన్నారు. విశేషం ఏంటంటే.. ఈ షూట్ ప్రిపరేషన్ కోసం నెలన్నరగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్ దుబాయ్‌లోనే ఉంటున్నారు.
► ఈ యాక్షన్ పార్ట్ ఆర్ట్ డిజైన్ కోసం దాదాపు 300 మంది ఆర్ట్ టీమ్ (పెయింటర్స్, కార్పెంటర్స్, డిజైనర్స్, వెల్డర్స్) వర్క్ చేసింది. దీన్నిబట్టి దుబాయ్‌లో ఎంత భారీ సెట్ వేసి ఉంటారో ఊహించవచ్చు. నిజానికి ప్రీ–ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఈ సెట్‌కి సంబంధించిన చాలా వర్క్ చేశారు. ఆ తర్వాతే అక్కడే సెట్ వేయడం మొదలుపెట్టారు. ఈ సెట్‌కి కావాల్సిన మెటీరియల్‌ను 4 కంటైనర్లలో ఇక్కణ్ణుంచి దుబాయ్‌కి తీసుకువెళ్లారు.
► దుబాయ్‌లో యాక్షన్ ఎపిసోడ్‌లో ఏం షూట్ చేయాలో అని దర్శకుడు సుజిత్, కెమెరామేన్ మది, హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ అందరూ కలిసి ఒక 16 రోజులు డిస్కస్ చేసుకున్నారు.
► న్నీ బేట్స్ టీమ్‌లో లాస్ ఏంజెల్స్, లండన్‌కు చెందిన 120 మంది ఉన్నారు. ఈ టీమ్ అంతా షూట్‌లో పాల్గొంటున్నారు. వీళ్లంతా రోప్స్, క్రాషింగ్, బ్లాస్టింగ్‌లో నిపుణులు. వీళ్లంతా ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం వర్క్ చేయనున్నారు. అదండీ విషయం. ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారంటే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment