Sujith
-
రూ. 20 కోట్ల బడ్జెట్‌తో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా!
మొన్నటి వరకు వరస సినిమాలతో అలరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇటీవల చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట.ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. -
‘ఓజీ’ గ్లింప్స్ వచ్చేసింది
‘సాహో’ తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని తాజాగా విడుదల చేశారు మేకర్స్. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి బలాన్ని చేకూర్చింది. కానీ కొన్ని చోట్ల విక్రమ్ సినిమాకు అనిరుధ్ అందిచిన బీజీఎం గుర్తుకువస్తుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఓజీ గ్లింప్స్‌ని చూసేయండి -
ఆగస్ట్ 4న ‘ప్రియమైన ప్రియ’
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘ప్రియమైన ప్రియ’. గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై ఏజే సుజిత్, ఏ బాబు నిర్మాస్తున్న ఈ చిత్రానికి ఏజే సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 4న ఈ చిత్రం విడుదల కాబోతుంది. తమిళ్ లో ప్రియముడన్ ప్రియ , తెలుగులో ప్రియమైన ప్రియ గా రూపోందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు. దర్శకుడు ఏజే సుజిత్ మాట్లాడుతూ .. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపోందించిన "ప్రియమైన ప్రియ "చిత్రాన్ని ఆగష్ట్ 4 న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము.. మంచి స్క్రీన్ ప్లే , హీరో హీరోయిన్స్ పర్పామెన్స్ , శ్రీకాంత్ దేవా సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని , మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని అన్నారు.సినిమా నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందించిన ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఙప్తి చేశారు. -
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
చిరంజీవి చిత్రంలో విజయశాంతి?
మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కాంబినేషన్లో టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. దాదాపు 20 సినిమాలతో హిట్ పెయిర్‌గా వీరిద్దరికి మంచి పేరు ఉంది. అయితే తొలుత విజయశాంతి, ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయాక వీరిద్దరు కలిసి మరోసారి తెరపై కనిపించలేదు. అయితే ఫిలింనగర్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం.. చిరంజీవి చిత్రంలో విజయశాంతి కనిపించనున్నారట. దీంతో సుదీర్ఘ గ్యాప్ తర్వాత వీరిద్దరు ఒకే తెరపై కనువిందు చేయనున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!) మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రను తెలుగులో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. (‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం) మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. కాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని మార్పులను సూచించినట్లు తెలుస్తోంది. చిరు సూచించిన సూచనలకు తగ్గట్టు సుజీత్ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి మెగాస్టార్‌కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మలయాళ చిత్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హీరో ఎలివేషన్ సీన్స్ సూపర్బ్‌గా ఉంటాయి. ఆదే జోరులో తెలుగులోనూ హీరో ఎలివేషన్ సీన్స్ ఉండేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నారని టాక్ ఆఫ్ ది టౌన్. -
చిరు చిత్రంలో సల్మాన్?.. ఇదిగో క్లారిటీ
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోరు పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఆచార్య తర్వాత చేయాల్సిన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు మెగాస్టార్. వరుసగా సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆచార్య తర్వాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ‘సాహో’ ఫేం సుజిత్‌కు చిరు అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్ కథలో భారీ మార్పులు చేస్తున్నారట దర్శకుడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లో మోహన్ లాల్ నమ్మిన బంటుగా ఉండే ఒక పాత్రను పృథ్వీరాజ్ పోషించారు. ఈ క్రమంలోనే తెలుగు వర్షన్లో పృథ్వీరాజ్ పోషించిన ఆ పాత్రను సల్మాన్ ఖాన్ చేత చేయించాలని చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చిరంజీవి స్పందించారు. లూసిఫర్ రీమేక్ కు సంబంధించి కథలో మార్పులు జరుగుతున్నాయని చెప్పిన చిరు.. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ఇంకా జరగలేదని చెప్పారు. మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తున్నారని.. బాలీవుడ్ హీరో సల్మాన్ నటిస్తున్నడని వస్తున్న వార్తలు అన్నీ అబద్దాలే తేల్చేశాడు చిరంజీవి. కథ మొత్తం పూర్తయిన తర్వాత ఇందులో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ ఇస్తామని మెగాస్టార్ స్పష్టం చేశారు. చదవండి: ప్రభాస్-అశ్విన్ చిత్రం: విలన్ అతడేనా? ‘అది వాషింగ్ మెషీన్ కాదు యశ్’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డైరెక్టర్ ఎవరు?
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా సుకుమార్, హరీష్ శంకర్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యువ దర్శకుడు సుజిత్ పేరు వినిపిస్తోంది. ‘లూసీఫర్’ తెలుగు స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా సుజిత్‌కు చిరంజీవి చెప్పారట. ఇంతకు ముందు శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలకు సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
మదిలో.. గదిలో.. ‘అల్లు’కున్న అభిమానం..
సాక్షి, బంజారాహిల్స్: ఒంటి నిండా 13చోట్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫొటోలతో.. 19 చోట్ల అల్లు అర్జున్ పేర్లతో పచ్చబొట్లు.. ఇక గదినిండా సుమారు 50వేల వరకు అల్లు అర్జున్ ఫొటోలు.. అభిమానానికి కొలమానం లేదన్నట్లుగా ఆ యువకుడు తన అభిమాన హీరో అల్లు అర్జున్ ఫొటోలతో ఇల్లంతా నింపేశాడు. తలుపులు, కిటికీలు, గోడలు, సీలింగ్, ఫ్యాన్లు ఇలా దేన్నీ వదల్లేదు. ఇంట్లోకి అడుగు పెడితే ఇల్లంతా ఫొటోలే కనిపిస్తాయి. తాను బన్నీకి వీరాభిమానని చెప్పుకుంటాడు సుజిత్. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌లో కూడా ప్రతినిధిగా ఉన్నాడు. తాను ఎంత అభిమానినో చాటుకుంటూ ట్విటర్లో ఆ ఫొటోలను కూడా షేర్ చేసుకున్నాడు. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఎటు చూసినా బన్నీ కనిపించాలనే ఇలా ఫొటోలతో, టాటూలతో అలంకరించుకున్నట్లు ఈ యువకుడు వెల్లడించాడు. -
సుజిత్ మరణవార్తతో కన్నీటి సంద్రం..
రెండేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండిపోయాయి. నిరుపయోగంగా ఉన్న బోరు బావి ఆ బాలుడిని నిర్ధాక్షిణ్యంగా మింగేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. బోరుబావి నుంచి సుజిత్‌ను ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీయాలని ఐదురోజుల పాటూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఆ బాలుడి మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున బయటకు తీశారు. సుజిత్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన తమిళనాడు ప్రజలు బాలుడి మరణవార్తతో తల్లడిల్లిపోయారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నడుకాట్టుపట్టికి చెందిన ఆరోగ్యరాజ్ (40), కళామేరి (35) దంపతులకు పునిత్ రోషన్ (5) సుజిత్ విల్సన్ (02) అనే ఇద్దరు కుమారులున్నారు. తమ ఇంటికి సమీపంలోని పెదనాన్న ఇంటికి తన అన్నతో కలిసి నడిచివెళుతూ ఈనెల 25వ తేదీన సుజిత్ బోరుబావిలోకి జారి పడిపోయాడు. మదురైకి చెందిన పదిమందితో కూడిన ప్రయివేటు బృందం బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైంది. 26 అడుగుల లోతుల్లో ఉండిన బాలుడు ఇంకా మరింత లోతులోకి వెళ్లకుండా ఎయిర్‌లాక్ విధానంలో ప్రకృతి వైపరీత్యాల నివారణ బృందం బాలుడి చేతులను కట్టివేసి పైకి లాగే ప్రయత్నం చేసింది. అయితే అంతలోనే బాలుడు జారిపోయాడు. బాలుడికి శ్వాససంబంధమైన సమస్య తలెత్తకుండా బోరుబావిలోకి ఆక్సిజన్ సరఫరా చేశారు. బోరుబావికి సమాంతరంగా భారీ సొరంగాన్ని తవ్వడం ద్వారా బాలుడిని బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బాలుడు పడిపోయిన నాటి నుంచి అవిశ్రాంతంగా రక్షణ చర్యలు కొనసాగాయి. సొరంగం పనులు వేగవంతం చేసేందుకు సోమవారం భారీ రిగ్గును తెప్పించారు. అయితే సుమారు 50 అడుగుల లోతులో బలమైన సున్నపురాయి అడ్డుతగలడంతో పనులు నిలిచిపోయాయి. అ తరువాత సహాయక బృందంలోని ఒక యువకుడు సొరంగంలోకి వెళ్లి బండరాయిని క్రేన్‌కు కట్టగా బయటకులాగడంతో అడ్డుతొలగింది. దీంతో సోమవారం రాత్రి మరలా సొరంగం పనులు ప్రారంభమైనాయి. ఇంతలో బోరుబావి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించా. బాలుడు సుజిత్ మరణించినట్లు రెవెన్యూ కార్యదర్శి రాధాకృష్ణన్ మంగళవారం తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో ఆధునిక యంత్రంసాయంతో బోరుబావి నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి ప్రాణాలను హరించివేసిన బోరుబావిని వెంటనే కాంక్రీటుతో మూసివేశారు. మిన్నంటిన రోదనలు.. సుజిత్ మరణించినట్లు ప్రకటన వెలువడగానే ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని బయటకు తీసిన సమయంలో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు గుండెలవిసేలా రోదించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడు ప్రజలంతా సుజిత్ మరణవార్తతో కదిలిపోయారు. సుజిత్లా మరొకరు ప్రాణాలు కోల్పోకుండా ఇప్పటికైన జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపారు. ఐదురోజులుగా సహాయక చర్యలకు అంకితమైన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ సహా ప్రభుత్వ సిబ్బంది, కృషి చేసిన ఇతర బృందాలు కన్నీటి పర్యంతమయ్యారు. బోరుబావి నుంచి సుజిత్ ఏడుపులు ఇంకా వినిపిస్తున్నాయని మంత్రి విజయభాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోస్టుమార్టం ముగిసిన అనంతరం సుజిత్‌కు అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. సుజిత్ చిత్రపటం వద్ద సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నివాళి సీఎం సహా ప్రముఖుల సంతాపం.. సుజిత్ మృతికి సీఎం ఎడపాడి పళనిస్వామి సహా పలువురు సంతాపం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం మనప్పారై చేరుకున్న సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రులు సుజిత్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్ మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని ఎడపాడి పేర్కొంటూ బాలుడి కుటుంబానికి ప్రభుత్వం తరçఫున రూ.10 లక్షలు, అన్నాడీఎంకే తరఫున రూ.10లక్షలు సహాయం ప్రకటించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా నివాళులర్పించారు.అలాగే డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ సైతం సుజిత్ సమాధి వద్ద నివాళులర్పించి పార్టీ తరపున రూ.10 లక్షలు సహాయం ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం సంతాపం ప్రకటించారు. బోరుబావి వద్ద చిన్నారుల నివాళి స్టాలిన్ విమర్శ–సీఎం ఆగ్రహం: ఇదిలా ఉండగా, రక్షింపు చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ మెతకవైఖరి వల్లే సుజిత్ ప్రాణాలు కోల్పోయాడని డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ ఆక్షేపించారు. సుజిత్‌కి ఏర్పడిన కష్టం మరెవ్వరికీ రాకూడదని అన్నారు. మంత్రులు, అధికారులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో చూపిన శ్రద్ధ సహాయక చర్యల్లో చూపలేదని ఎద్దేవా చేశారు. బాలుడు 36 అడుగుల లోతులో ఉన్నపుడే సైనిక సహాయం కోరాల్సిందని అన్నారు. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఘాటుగా స్పందించిన సీఎం సుజిత్‌ను రక్షించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమిటో ప్రజలకు, ప్రపంచానికి తెలుసని, బాలుడి దారుణ మరణంలో సైతం రాజకీయలబ్ధికి పాకులాడవద్దని సీఎం ఎడపాడి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు హితవుపలికారు. బోరుబావి ప్రమాద సంఘటనల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ఉదహరించారు. సుజిత్‌ను రక్షించే పనుల్లో అందరూ రేయింబవళ్లూ శ్రమించారు. ఆర్మీని రంగంలోకి దించి ఉండవచ్చుకదాని స్టాలిన్ అంటున్నారు, మరి డీఎంకే హయాంలో జరిగిన ప్రమాద సమయాల్లో ఆర్మీని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ముక్కొంబు ఆనకట్ట కూలిపోయినపుడు కూడా ఇలానే స్టాలిన్ విమర్శించారు. అయితే ముక్కొంబు పునరుద్ధరణ పనులను ఆర్మీనే ప్రశంసించిన సంగతి స్టాలిన్‌కు తెలియదా..? అని నిలదీశారు. తమిళనాడులో అందుబాటులో ఉన్న అన్నిరకాల సాంకేతిక నైపుణ్యాన్ని సుజిత్ రక్షింపు చర్యలకు వాడుకున్నామని సీఎం అన్నారు. ప్రాణాలుపోతేగానీ చట్టాలు గుర్తుకురావా..?– మద్రాసు హైకోర్టు ఆగ్రహం ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతేగానీ చట్టాలు గుర్తుకు రావా..? అని మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుజిత్ ప్రమాదం నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం సహాయకుడు పొన్రాజ్ ప్రజా ప్రయోజనవ్యాజం (పిల్)ను దాఖలు చేయగా, న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయి ఈ పిల్‌ను మంగళవారం అత్యవసర కేసుగా స్వీకరించి విచారణ చేపట్టారు. ప్రతిసారీ ఏదో ఒక విపరీతం జరిగితేగానీ ప్రభుత్వంలో కదలికరాదా..? అని నిలదీశారు. నడిరోడ్డుపై బ్యానర్ కారణంగా ఇటీవల శుభశ్రీ అనే ఇంజినీరు దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. నేడు వినియోగంలో లేని బోరుబావి రెండేళ్ల బాలుడిని బలితీసుకుంది. శుభశ్రీ ఘటనతో బ్యానర్లపై నిషేధం వి«ధించారు, సుజిత్ ప్రమాదం తరువాత బోరుబావుల చట్టంపై దృష్టిపెట్టారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, సుజిత్ మరణంపై న్యాయవిచారణ జరపాలని సుప్రీంకోర్టులో జీఎస్ మణి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. సహాయక యంత్రం కనుగొంటే రూ.5 లక్షలు బహుమతి బోరుబావుల్లో పడిపోయిన చిన్నారులను సురక్షితంగా బయటకు తీసే అత్యాధునిక యంత్రాలను కనుగొన్న వారికి రూ.5 లక్షలు బహుమతిగా అందజేస్తామని రాష్ట్ర ఐటీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంతోష్‌బాబు ఫేస్బుక్లో పోస్టింగ్ పెట్టారు. -
వసివాడిన పసివాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: చిన్న నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. తమిళనాడులో ఐదురోజుల క్రితం బోరుబావిలో పడిపోయిన సుజిత్ (2)ను అధికారులు రక్షించలేకపోయారు. బాలుడి మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో మంగళవారం వెలికితీశారు. తిరుచ్చిరాపల్లి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన ఆరోగ్యరాజ్ (40), కళామేరి (35) దంపతుల సుజిత్ విల్సన్ ఈనెల 25న ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. రక్షించేందుకు చేసే ప్రయత్నాల్లో 88 అడుగుల లోతులోకి జారిపోయాడు. బోరు బావికి సమాంతరంగా తవ్వుతున్న సమయంలో సొరంగ మార్గం నుంచి దుర్వాసన రావడాన్ని అధికారులు గుర్తించారు. సుజిత్ మరణించినట్లు రెవెన్యూ కార్యదర్శి రాధాకృష్ణన్ ప్రకటించారు. అనంతరం బోరుబావిని కాంక్రీటుతో మూసివేశారు. ఈ వార్తతో తమిళనాడు ప్రజలు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ముఖ్యమంత్రి ఎడపాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, పలువురు మంత్రులు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్లు తిరుచ్చికి చేరుకుని సుజిత్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్ కుటుంబానికి సీఎం ఎడపాడి, స్టాలిన్ వేర్వేరుగా రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు. అనంతరం బాలుడి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
బోరుబావిలోనే బాలుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు సుజిత్‌ను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 72 గంటలుగా బోరుబావిలోనే ఉన్న బాలుడు.. ప్రస్తుతం 100 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వేందుకు ఆదివారం నుంచి ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఇందుకోసం జర్మన్ నుంచి తెచ్చిన అత్యాధునిక హెవీ డ్రిల్లింగ్ మెషీన్‌ను ఉపయోగిస్తున్నట్లు రెవెన్యూ విభాగంకమిషనర్ రాధాకృష్ణన్ తెలిపారు. కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు బాలుడిపై కొంత మట్టి పడినట్లు ఉందని మరో ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్ (40), కళామేరీ (35) దంపతుల కుమారుడు సుజిత్ శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ‘సుజిత్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలపై సీఎంతో మాట్లాడాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
లవ్ ఎంటర్టైనర్గా ‘#బాయ్స్’
శ్రీపిక్చర్స్ బ్యానర్‌పై నేహాశర్మ నిర్మాతగా కొత్త చిత్రం ‘#బాయ్స్’ ఈరోజు ప్రారంభమైంది. ‘రథం’ ఫేమ్ గీతానంద్, శ్రీహాన్, రోనిత్ రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ స్వరూప్, మేల్కొటి, ఉత్తేజ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. దయానంద్ దర్శకుడు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టి, డైరెక్టర్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘రథం’ డైరెక్టర్ రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సుప్రియ, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా పూజా కార్యక్రమాల్లో పాల్గొని యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా... దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ - ‘ఇది దర్శకుడిగా నా తొలిచిత్రం. న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్. మంచి టీమ్ కుదిరింది. కథ నచ్చగానే నిర్మాతలు వెంటనే సినిమాను చేయడానికి అంగీకరించారు. వారికి నా థ్యాంక్స్’ అన్నారు. నిర్మాత నేహాశర్మ మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా మా బాయ్స్ సినిమాను రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం. టాకీ పార్ట్ అంతా హైదరాబాద్‌లో ఉంటుంది. గోవాలో పాటలను చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 4 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’ అన్నారు. -
అంత కష్టపడకురా అంటున్నారు
ప్రభాస్ ఫుల్ బిజీ...రెండేళ్లుగా ‘సాహో’ సినిమాతో బిజీ.ఇప్పుడు ‘సాహో’ ప్రమోషన్స్‌తో బిజీ.బెంగళూరు, ముంబై, చెన్నై.. అంటూ ‘సాహో’ కోసం జర్నీలు చేస్తూ బిజీ.కొడుకు ఇంత బిజీగా ఉంటే ఏ తల్లికైనా ఆనందమే.కానీ కొడుకు ఎంత స్టార్ అయినా, ‘ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్’ అయినా తల్లికి కొడుకే.మరి ఈ బిజీ సన్‌కి తల్లితో కలిసి భోజనం చేసే తీరిక ఉందా? కొడుకుకి ఇంత పేరు వచ్చినందుకు ఆ తల్లి ఫీలింగ్ ఏంటి? తనయుడు చేసిన సినిమాలన్నీ బాగున్నాయనే ఆ తల్లికి అనిపిస్తుందా? విమర్శను నిక్కచ్చిగా చెబుతారా? ఇలాంటి విశేషాలతో పాటు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోప్రభాస్ చాలా విషయాలు చెప్పారు. ♦ మీరు చాలా మొహమాటస్తులు. ‘బాహుబలి’ నుంచి కొద్దిగా అవుట్ స్పోకెన్ అయ్యారు. ఈ మార్పుని మీరు గమనించా...? ప్రభాస్: (మధ్యలోనే అందుకుంటూ) బాగా మాట్లాడేస్తున్నాను కదా? ఎంటర్టైన్ చేసేస్తున్నాను కదా? ఇలా మాట్లాడటం నాకే అడ్వాంటేజ్. బాగా మాట్లాడితే బాగా రాస్తారు. ఇంతకు ముందు ఇంటర్వ్యూ అంటే ‘అమ్మో రేపటి నుంచి ఇంటర్వ్యూలు’ అని చిన్న టెన్షన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. ♦ ‘బాహుబలి’ రూపంలో మీ కెరీర్లో ఓ అద్భుతం జరిగింది. ఈ అద్భుతం తర్వాత మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ప్రభాస్:భయంకరమైన లక్ ఉంటే కానీ ‘బాహుబలి’ లాంటి సినిమాలు రావు. అది నాకు జరిగింది. ఒక అద్భుతం జరిగిపోయింది. అయితే ఇప్పట్లో మళ్లీ అంత ఒత్తిడి పెట్టుకోవాలనుకోలేదు. కానీ వెంటనే ‘సాహో’లాంటి సినిమా చేయాల్సి వచ్చింది. అన్నీ పక్కన పెట్టేసి ఇంకొక్కసారి కష్టపడదాం అని రెండేళ్లు శ్రమించాం. ‘బాహుబలి’కి ముందే నా ఫ్రెండ్స్ (యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్)తో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయాను. ‘బాహుబలి’ వర్కౌట్ అవ్వకపోయినా నెక్ట్స్ వీళ్లతోనే అనుకున్నా. నా ఫ్రెండ్స్ నా కంటే పిచ్చోళ్లు. విపరీతంగా ఖర్చు పెట్టి ‘సాహో’ తీశారు. ♦ జీవితంలో అనుకోని ‘అద్భుతం’ జరిగినప్పుడు మన ఆలోచనా విధానం కూడా మారిపోతుంది. అలాంటి మార్పు ఏదైనా మీలో వచ్చిందా? ప్రభాస్:అలా ఏం మారలేదు. మే బీ నాకు తెలియదేమో? అది డెస్టినీ అవ్వచ్చు. అయితే అంతకుముందు ‘లక్’ అనే విషయాన్ని నేను ఎక్కువగా నమ్మేవాణ్ణి కాదు. ఒక టైమ్ తర్వాత ఉంటే ఉంటాయి. మన పని మనదే అనుకునేవాణ్ణి. కానీ ‘బాహుబలి’ తర్వాత కొంచెం నమ్ముతున్నాను. ♦ జీవితాన్ని చూసే కోణం కూడా మారిందా? ప్రభాస్:కచ్చితంగా మారుతుంది. ఇంకా కష్టపడాలి, ఇంకా తెలివిగా ఉండాలి, ప్రతిదానికి పక్కా ప్లానింగ్ ఉండాలనే మైండ్ సెట్ వచ్చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు. దానికి మించి ఏదో ఉంది అనే విషయాన్ని నమ్ముతున్నాను. ఆ ఏదో అనేది ‘ఏదో పవర్’ అని నా ఉద్దేశం. ♦ ‘బాహుబలి’ గురించి ప్రస్తావించినప్పుడల్లా ‘అద్భుతం’ అని అంటున్నాం. కానీ కెరీర్ పరంగా చూస్తే ‘రిస్క్’. ఆ తర్వాత 350 కోట్లతో ‘సాహో’ అనే మరో రిస్క్ చేశారు. రిస్క్ తీసుకుందాం అనే స్వభావం ఏర్పడిందా? ప్రభాస్:ఆ స్వభావం ఉండబట్టే ‘బాహుబలి’ చేయగలిగాను. అయితే ‘బాహుబలి’ అప్పుడు నిర్మాత శోభుగారిని చూస్తే టెన్షన్ అనిపించేది. యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు రోజుకి పాతిక లక్షలు ఖర్చు పెట్టేవారు. అయినా ఆయన నవ్వుతూ కనబడుతుండేవారు. ‘టెన్షన్ పడడా? రోబోనా’ అనుకునేవాణ్ణి. ‘బాహుబలి’ తర్వాత శోభుగారి ఇంటికి ఫోన్ చేసి ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌తో ‘మళ్లీ ఇంత పెద్ద సినిమాలు చేయనీకండి’ అని చెప్పాను. కట్ చేస్తే.. నేనే పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశాను. నా ఫ్రెండ్స్‌ని ఇన్వాల్వ్ చేశా. నాకెంత స్ట్రెస్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ చేయడానికి ఫస్ట్ రీజన్ అలాంటి ప్రాజెక్ట్ చేసే అవకాశం మళ్లీ వస్తుందా? లేదా? అని. ఇప్పుడు ‘బాహుబలి’ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? కనీసం ప్రయత్నిద్దాం అని ‘సాహో’ చేశాను. అలా ఆరేడేళ్లు ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలకే వెచ్చించాను. ♦ ‘ప్రభాస్ సినిమా అంటే ఇంత భారీ బడ్జెట్, ఇంత రేంజ్ ఉండాలి’ అనే స్పేస్‌లో ఇరుక్కుపోయాం అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? ప్రభాస్:అలా ఏం లేదు. ‘ఛత్రపతి’తో నాకు యాక్షన్ హీరో ఇమేజ్ వచ్చింది. కానీ వెంటనే ‘డార్లింగ్’ అనే సాఫ్ట్ సినిమా చేశాను. అందులో పెద్దగా ఫైట్స్ కూడా ఉండవు. అమ్మాయి, అబ్బాయి ప్రేమకథ. అదీ ఆడింది. ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో బంధాలకు, బిజినెస్‌కు మధ్య డిఫరెన్స్ తెలియని ఒక క్యారెక్టర్. క్లైమాక్స్‌లో హీరో సారీ చెబుతాడు. ఫ్యాన్స్‌కి నచ్చలేదు. కానీ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు. మెల్లిగా అందరికీ నచ్చింది. స్టోరీని కనెక్ట్ చేయగలిగితే ఏ సినిమా అయినా వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ కథ ఉంటే నన్ను పెట్టి రెండు కోట్ల సినిమా తీసినా కూడా ఆడుతుంది. ♦ ‘బాహుబలి, సాహో’ ప్యాన్ ఇండియా సినిమాలు. మీ నుంచి వచ్చే ప్రతీ సినిమా అన్ని భాషల వాళ్లు చూడాలనుకుంటారు. కానీ ప్రతి సినిమాకి అది కుదరకపోవచ్చు. దాన్ని ఎలా అధిగమిస్తారు? ప్రభాస్:ప్యాన్ ఇండియా సినిమానే చే యాలని రూల్‌గా ఏమీ పెట్టుకోలేదు. ‘బాహుబలి’ తర్వాత ఇది ఇంపార్టెంట్ టైమేమో అనిపించింది. ఒకవేళ ‘సాహో’ వర్కౌట్ అయినా నెక్ట్స్ ప్యాన్ ఇండియా సినిమానే చేస్తానని పెట్టుకోలేదు. తెలుగు సినిమానే చేస్తాను. వేరే భాషలో గెస్ట్ పాత్ర చేయొచ్చు. అంతే తప్ప ఇకనుంచి చేసే ప్రతి సినిమా అన్ని భాషలనీ దృష్టిలో పెట్టుకుని చేయాలని రూల్ అయితే పెట్టుకోలేదు. ♦ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రాజకీయాల మీద ఆసక్తి లేదన్నారు. పొలిటికల్ మూవీ ఆఫర్ వస్తే? ప్రభాస్:పాలిటిక్స్ వేరు పొలిటికల్ ఫిల్మ్ వేరు. కథ బావుంటే చేయొచ్చు. యాక్షన్ సినిమా చేస్తూ బోలెడు మందిని చంపేస్తున్నాను. బయట చేస్తున్నానా? (నవ్వుతూ). అలాగే సినిమాలో పొలిటీషియన్‌గా చేస్తే.. నిజంగా రాజకీయాల్లోకి వస్తానని కాదు కదా. ♦ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లినా ‘ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్’ అని పిలుస్తున్నారు. ఆ పిలుపుకి అలవాటు పడ్డారా? ప్రభాస్:నిజంగా నేను ప్యాన్ ఇండియన్ సూపర్‌స్టార్ అని ఫీల్ అయ్యుంటే నా ఫ్రెండ్స్‌తో ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చుపెట్టించేవాణ్ణి? 50 కోట్లతో తీయిస్తే చాలు. అప్పుడు అందరూ అంటున్నట్లు ప్యాన్ ఇండియన్ స్టార్‌ని కాబట్టి సినిమాలు ఆడేస్తాయి. అవన్నీ నేను నమ్మను. క్వాలిటీ ముఖ్యం. ‘బాహుబలి’తో తెచ్చుకున్న ఆడియన్స్‌ను సంతృప్తిపరచాలి. సరదా సమాధానాలు ♦ ‘సాహో’కి బడ్జెట్ పెరుగుతుంటూ వెళ్లినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ♦ నిద్ర పట్టేది కాదు. ♦ మీరు బయట చాలా కూల్. సినిమాల్లో ఫుల్ వయొలెంట్. ఈ మార్పు ఎలా? ♦ డబ్బులు తీసుకుంటున్నాను కదా. ♦ అందరి ప్రెషర్ మీరే తీసుకుంటున్నారు. మీ ప్రెషర్ని పంచుకునే వాళ్లు మీ లైఫ్‌లోకి ఎప్పుడు వస్తారు? ♦ ప్రెషర్ తీసుకునే వాళ్లు వస్తారో? ప్రెషర్ పెట్టేవాళ్లు వస్తారో? ♦ ట్రైలర్ చూసి మీ పెద్దనాన్నగారు (కృష్ణంరాజు) ఎలా ఫీల్ అయ్యారు? ♦ అందరూ నా గురించి చెప్పడం విని తబ్బిబ్బిపోయి.. ఇంకా లావైపోతున్నారు. ♦ మీ పాపులారిటీ దేశాలు దాటే కొద్దీ మీరింకా ‘డౌన్ టు ఎర్త్’గా మారిపోతున్నారు... ♦ మంచిదే కదా. అది నాకంటే మీకే ఎక్కువ తెలుస్తుంది. ఇలా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని మాత్రం రాజమౌళి నుంచే నేర్చుకున్నాను. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించినా తను ఒకేలా ఉన్నాడు. ఆయన పక్కనే ఉండి గమనించాను. మనం ఎప్పుడైనా పెద్ద హిట్ సాధిస్తే ఈయనలా ఉండగలగాలి అనుకున్నాను. ♦ మళ్లీ రాజమౌళితో సినిమా ఎప్పుడు? ప్రభాస్:ఏమో తెలియదు. ‘బాహుబలి’ అప్పుడు 7–8 వెర్షన్స్లు, చాలా ఐడియాలు చెప్పాడు. ‘బాబుని పైకి లేపి తల్లి చనిపోవడం, కట్టప్పే బాహుబలిని చంపడం, కొడుకుని తల్లే చంపమని చెప్పడం’ ఇవన్నీ చెబుతున్నప్పుడే నాకు గూస్బంప్స్ వచ్చాయి. రాజమౌళి ఇలాంటి సినిమాని చంపేస్తాడు అనుకున్నాను (నవ్వుతూ). నిజంగానే చంపేశాడు. అయితే కొడుకుని తల్లే చంపేయమని చెప్పడం సీన్ విన్నప్పుడు మాత్రం ఒళ్లు గగుర్పొడిచింది. వామ్మో... అనుకున్నాను. ♦ అమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి... మీ సక్సెస్‌ని మీ అమ్మగారు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఆ ఫీలింగ్‌ని ఆమె మీతో షేర్ చేసుకుంటారా? ప్రభాస్:అమ్మ, సిస్టర్ చాలా హ్యాపీ. నా సిస్టర్ అయితే గాల్లో తేలిపోతుంది. వాళ్లకు ఎవరైనా నా గురించి మాట్లాడితే చాలు.. సంతోషపడతారు. నా కెరీర్ ఈ రేంజ్‌కి వచ్చినందుకు ఆనందపడుతున్నారు. అమ్మ ఎక్కువ బయటపడరు. బయటపడితే నేనెక్కడ మారిపోతానో అని భయం అనుకుంటా (నవ్వుతూ). ♦ మరి ‘రిస్కులు తీసుకోవద్దు’ అని అమ్మ జాగ్రత్తలు చెబుతుంటారా? ప్రభాస్:బేసిక్‌గా నేను బద్ధకస్తుడ్ని. కాలేజీ రోజుల్లో.. లేటుగా లేవడం, కాలేజ్‌కి వెళ్లకపోవడం చేస్తుండేవాణ్ణి. ‘బద్ధకం వదిలించుకో.. పని చెయ్యి.. పని చెయ్యి’ అని చెబుతూనే ఉండేవారు. ఇప్పుడేమో విపరీతంగా కష్టపడుతుంటే ‘అంత కష్టపడకురా..’ అంటున్నారు (నవ్వుతూ). ‘షూటింగ్లో బాగా ఎండగా ఉందా?’ అని అడుగుతారు. ‘అమ్మా.. ప్రపంచం మొత్తం ఎండలో కష్టపడుతున్నారు. నేను ఒక్కడినేనా’ అంటాను. అప్పుడేమో పని చెయ్యమని.. ఇప్పుడేమో ఇలా కష్టపడి చేస్తుంటే బాధ.. అమ్మలు అంతే (నవ్వేస్తూ). ‘సాహో’ హైలైట్స్ ♦ ‘సాహో’ ఫ్యూచర్ ఫిల్మ్ కాదు. ప్రజెంట్ టైమ్‌లో జరిగేదే. లార్జర్ దేన్ లైఫ్ అపీల్ కోసం కొన్ని గ్రాండియర్ ఎలిమెంట్స్ యాడ్ చేశాం. ‘బాహుబలి’కి పెరిగిన బరువుని ఈ సినిమా కోసం తగ్గించడానికి వెజిటేరియన్‌గా మారాను. ♦ సుజీత్ మీద ఫస్ట్ నుంచి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ‘రన్ రాజా రన్’ తర్వాత నాతో నీ నెక్స్› సినిమా చేస్తావా? అని అడిగాను. కథ తీసుకువస్తాను అన్నాడు. అబ్బ ఏం కాన్ఫిడెన్స్రా అనుకున్నాను. ♦ యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఎడిట్ చేయించాం. ♦ ‘సాహో’లో నాది డ్యూయెల్ రోల్ కాకపోవచ్చు. అలాంటి క్యూరియాసిటీ ఉండాలనే ట్రైలర్‌ను అలా కట్ చేశాం. ♦ 150 కోట్లతో ‘సాహో’ చేయాలనుకున్నాం. అది 350 కోట్లు అయింది. ♦ ప్రాగ్, ప్యారిస్, జర్మనీ దేశాల నుంచి కావాల్సిన పరికరాలను తీసుకొచ్చాం. ♦ రిస్కీ యాక్షన్ సీన్స్ తీసినప్పుడు ఒక్క దెబ్బ కూడా తగలేదు. చాలా జాగ్రత్తగా చేయించారు. ఒకప్పుడు యాక్షన్ సీన్స్ అన్నీ నేనే చేయాలనుకునేవాణ్ణి. ఇప్పుడు అవసరమైనవే చేస్తున్నాను. ♦ సీక్వెల్‌కి స్కోప్ ఉన్న కథ ‘సాహో’. అన్నీ కుదిరితే చేస్తాం. అయితే ఇప్పుడప్పుడే కాదు. ♦ ఏ సినిమాకైనా కథే మాస్టర్. ఆ తర్వాత డైరెక్టర్. ♦ యాక్షన్ సినిమా అంటున్నాం కానీ సినిమాలో యాక్షన్ యాక్షన్ యాక్షనే ఉండదు. లవ్ స్టోరీ ఉంది. యాక్షన్‌లో కూడా కార్ చేజ్లు, ఎడారి దుమ్ములో ఓ ఫైట్, హీరోహీరోయిన్ రొమాంటిక్ సాంగ్‌తో ఓ ఫైట్.. ఇలా అందరూ ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశాం. ♦ తెలుగు సినిమా మంచి ఫేజ్‌లో ఉంది. కంటెంట్ ఉన్న సినిమాలు ఆడుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి, జెర్సీ..’.. ఇలా ఈ మధ్య చాలా సినిమాలు ఆడాయి. అందరూ భిన్నంగా ప్రయత్నిస్తున్నారు. ♦ నెక్ట్స్ రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నాను. ఈ సినిమాని గోపీకృష్ణ, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ♦ ప్రమోషన్స్ కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారు. అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అయింది? ప్రభాస్:నెల రోజులు అయినట్టుంది. కలిసి మాట్లాడుతున్నాను. కానీ ఈ క్వొశ్చన్ విన్నాక అమ్మతో కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో ఆలోచిస్తున్నా. మేం కలిసి భోజనం చేసి నెల దాటి పోయింది. ♦ మీ సినిమాలను మీ అమ్మ విమర్శిస్తుంటారా? ప్రభాస్:అమ్మో! సూపర్ క్రిటిక్. మామూలుగా కాదు. ‘బాహుబలి’లో ఓ సీన్లో నీ హెయిర్ చాలా చిన్నగా ఉందిరా అన్నారు. అమ్మా.. నా కిరీటం ఉంది. కీరిటానికి చైయిన్ కూడా ఉంది. అంత యాక్షన్ సన్నివేశాల్లో కూడా జుట్టు ఎలా గమనించావు నువ్వు? ‘అమ్మ.. మదరో’ అనుకున్నాను. ఇక్కడ మేకప్ కొంచెం బాగాలేదు. కళ్లు కొంచెం డార్క్‌గా ఉన్నాయి. క్రాఫ్ బాలేదు అని చెబుతుంటారు. డైట్ అంటూ సరిగ్గా తినకపోతే తిను తిను అంటారు. మళ్లీ కొంచెం పొట్ట వచ్చినట్టుందిరా అంటారు. తినకపోతే తినమని... తింటే లావు అయ్యావని. నాకు ఇవన్నీ చాలా ఎంజాయబుల్‌గా ఉంటాయి. ♦ ఇటీవల ముంబైలో చిరంజీవిగారిని కలిశారు. ఒకరి సినిమా గురించి ఒకరు మాట్లాడుకున్నారా? ప్రభాస్:మేం ఒకే హోటల్లో ఉన్నాం. గౌరవంగా వెళ్లి కలిశాను. మా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆయన ఫోన్ చేశారు. ఆయన తన సొంత సినిమాలా మాట్లాడారు. చిరంజీవిగారు∙మాట్లాడిన విధానం నాకు భలే సంతోషంగా అనిపించింది. సినిమాను అంతలా ప్రేమించకపోతే ఇనేళ్లు ఇండస్ట్రీలో ఉండలేరు. ♦ యాక్టర్స్‌కి చిరంజీవి ఆదర్శం అంటారు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’కు డోర్ ఓపెన్ చేసింది ‘బాహుబలి’ అని ఆయన అన్నారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ప్రభాస్:అది నాకు తెలియదు. అదంతా రాజమౌళి. ‘బాహుబలి’ రాజమౌళి ఫిల్మ్. అది మీరు రాజమౌళినే అడగాలి. ♦ ‘బాహుబలి’ టీమ్‌కి రాజమౌళియే స్ఫూర్తి నింపారని అన్నారు. మరి ‘సాహో’ టీమ్‌కి ఆ స్థానంలో మీరు ఉండాల్సిన పరిస్థితి. ఆ అనుభవం ఎలా అనిపించింది? ప్రభాస్:మా ‘సాహో’ టీమ్‌కి కూడా ‘బాహుబలి’యే స్ఫూర్తి. యూవీ వంశీ, ప్రమోద్ మంచి ప్యాషనేట్. నేను యూవీకి, యూవీకి నేను, మాకు డైరెక్టర్ సుజీత్.. మాకన్నా సుజీత్ వయసులో చిన్నవాడు. కానీ ‘ఏం కాదు అన్నా’ అని ధైర్యం చెప్పాడు. అతని వయసు ఏంటి? మాకు చెప్పడం ఏంటీ? అనుకున్నాం (నవ్వుతూ). బట్ ‘సాహో’ టీమ వర్క్. ♦ యాక్టర్‌గా మీ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు? ప్రభాస్:‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమాకు ఇంకేదో చూపించారు. నెక్ట్స్ నా సినిమాలకు ఆడియన్స్ వచ్చినప్పుడు మేం ఏదో చూపించాలని ప్రయత్నం చేశామని చెప్పడానికి నానా తంటాలు పడ్డాం. ‘సాహో’ చేశాం. నెక్ట్స్ ఎలాంటి సినిమాలంటే... చూడాలి. ♦ బ్యాంకాంక్‌లో మేడమ్ తుస్సాడ్స్‌లో మీ మైనపు విగ్రహం పెట్టడం ఎలా అనిపించింది? ప్రభాస్:‘బాహుబలి’ వల్ల చాలా విషయాలు జరిగాయి. జపాన్ వెళ్లినప్పుడు అక్కడ రానాని ఫ్యాన్స్ పట్టుకుని ఏడవడం అవి అన్నీ వింటుంటే...‘బాహుబలి’ రూపంలో ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది. అందులో మేడమ్ తుస్సాడ్స్ ఒకటి. ♦ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుచుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఓ అమ్మాయి ఏకంగా మీ బుగ్గ గిల్లి పారిపోవడం? ప్రభాస్:అది నేను ఊహించలేదు. ఎందుకంటే మేల్ ఫ్యాన్స్ కొంచెం గట్టిగా పట్టుకుని లాగడం అనుభవమే. అయితే ఒక అమ్మాయి నుంచి ఈ సంఘటనను నేను ఊహించలేదు. అప్పటికే నేను 18గంటలు ట్రావెలింగ్‌లో ఉన్నాను. అప్పుడే ఫ్లయిట్ దిగాను. ఫొటో అడిగింది. సరే కదా అని కళ్లజోడు పెట్టుకుని ఫొటో ఇచ్చాను. ఆ అమ్మాయి బాగా హైపరైపోయి నా బుగ్గ గిల్లింది. కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యా. కానీ ఇదంతా ప్రేమలో భాగమే కదా అనిపించింది (నవ్వుతూ). ♦ మీరు కనిపించినప్పుడు పెద్ద స్థాయిలో మీ చుట్టూ ఫ్యాన్స్ గుమిగూడతారు. ఫోటోల కోసం పోటీ పడుతుంటారు. అయినా మీరు సహనం కోల్పోకుండా ఎంతో ఓర్పుగా ఉంటారు... ప్రభాస్:అది ఫస్ట్ నుంచే డిసైడైపోయాను. నేనైతే అభిమానులను కొట్టలేను. తొయ్యలేను. నాకు రక్షణగా ఉన్నవారు అలా చేయడానికి ప్రయత్నించినా నాకు ఏదోలా ఉంటుంది. ఒక్క ఫ్యాన్ వస్తే చాలు అనుకున్నప్పుడు... ఇంత మంది ఫ్యాన్స్ ఉండటం అంటే హ్యాపీనే కదా. ఎలాగూ నేను బయట కనిపించేది తక్కువ. కనిపించినప్పుడు అభిమానం చూపిస్తారు. అది నాకు ఇష్టమే. ♦ ‘బాహుబలి 2’ విడుదలప్పుడు కన్నా... ‘సాహో’ విడుదలకు ఏమైనా ఎక్కువ టెన్షన్ పడుతున్నారా? ప్రభాస్:‘బాహుబలి 2’ అప్పుడు పెద్దగా టెన్షన్ లేదు. ఎందుకుంటే అప్పటికే ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైపోయింది. యాభై శాతం సక్సెస్ వచ్చింది. ఇండియా అంతా యాక్సెప్ట్ చేశారు. ‘బాహుబలి 2’ లో కూడా మంచి కంటెంట్ ఉంది. మినిమమ్ గ్యారంటీ అనుకున్నాం. కానీ ‘బాహుబలి 1’ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు ముంబై వెళ్లాం. తమిళనాడు వెళ్లాం. కేరళ వెళ్లాం.. మాట్లాడాం. ‘బాహుబలి’లో అది చేశాం.. ఇది చేశాం అని చెప్పాం. రేపు ఈ సినిమా చూసి.. ఇదేం సినిమారా అంటారేమోనని భయం. మళ్లీ బడ్జెట్ ఒకటి. ఆపేయాలా.. ఆగిపోవాలా? ఏమైనా తేడా జరిగితే.. ఇలాంటి ఆలోచనలతో ‘బాహుబలి 2’ అప్పుడు భయంకరమైన ప్రెజర్. ‘సాహో’ రిలీజ్ అప్పుడు ఇంకో రకమైన ప్రెజర్. ♦ హిందీలో కరణ్ జోహార్ ఓ సినిమా చేయమంటే మీరు చేయనన్నారనే వార్తలు వచ్చాయి.. ప్రభాస్:అదేం లేదు. నేను, కరణ్ జోహార్ ఇప్పటికీ మాట్లాడుకుంటాం. భవిష్యత్‌లో కరణ్‌తో సినిమా ఉండొచ్చు. ఏమో.. ఇప్పుడే చెప్పలేను. ♦ నెగటివ్ కామెంట్స్‌ని ఎలా తీసుకుంటారు? ప్రభాస్:నేను ఎక్కువగా సోషల్ మీడియాను ఫాలో అవ్వను. కానీ సక్సెస్‌లో అవి కూడా భాగం అనుకుంటాను. సక్సెస్ రోడ్ స్ట్రైయిట్‌గా ఉండదు కదా. చాలా దార్లు తొక్కి వచ్చాం. కొన్నిసార్లు నా తప్పులు ఉంటాయి. మరికొన్ని సార్లు పరిస్థితుల ప్రభావం కావొచ్చు. నెగటివ్, పాజిటివ్ సక్సెస్‌లో భాగమే. ♦ ఫైనల్లీ దాదాపు 2 కోట్లు (ఫస్ట్ సినిమా ‘ఈశ్వర్’ బడ్జెట్) నుంచి 350 కోట్ల (‘సాహో’ బడ్జెట్) వరకు చేరుకున్న మీ ప్రయాణం గురించి? ప్రభాస్:‘ఈశ్వర్’కి కోటీపాతిక లక్షలు అయింది. ఆ సినిమా అంతా రోడ్డు మీదే చేశాం. పెద్ద స్టార్స్ కూడా లేరు. అక్కణ్ణుంచి కెరీర్ ఇంతదాకా వచ్చింది. ఇది నా ఒక్కడివల్ల కాదు. నాతో సినిమాలు చేసిన అందరికీ దక్కుతుంది. – సినిమా డెస్క్ -
పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది
‘‘ఇలాంటి భారీ సినిమాకి అవకాశం రావడం గ్రేట్. పాటల్లోని పదాలు సందర్భానికి తగ్గట్టుగా ఉంటాయి. కమర్షియాల్టీ కోసం పాట రాయలేదు. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పాటల రచయిత కృష్ణకాంత్ అన్నారు. ‘ఏ చోట నువ్వున్నా.. ఊపిరిలా నేనుంటా, వెంటాడే ఏకాంతం.. లేనట్టే నీకింక, వెన్నంటే నీవుంటే.. నాకేమైనా బావుంటా, దూరాల దారుల్లో.. నీ వెంట నేనుంటా....’ అంటూ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌తో యూరప్‌లోని అందమైన మంచుకొండల్లో ఆడిపాడారు ప్రభాస్. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదలవుతోంది. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా గురు రాంధ్వా స్వరాలు సమకూర్చిన ‘ఏచోట నువ్వున్నా...’ అనే పూర్తి నిడివిగల వీడియో పాటను హైదరాబాద్‌లో విడుదల చేసి, ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుజిత్ మాట్లాడారు... ► నా తొలి సినిమా ‘రన్ రాజా రన్’ వచ్చి గురువారంతో ఐదేళ్లు అయింది. నా రెండో సినిమా ‘సాహో’. తొలి, ద్వితీయ సినిమాకి చాలా టైమ్ పట్టింది. ఈ సమయంలో వేరే సినిమా చేసి ఉండొచ్చు కదా? అని అడుగుతున్నారు. భవిష్యత్ అనేది మన చేతుల్లో ఉండదు. ప్రభాస్‌గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయనంటే చాలా ఇష్టం. అందుకే ఇన్ని రోజులు వేచి చూశానేమో. ఇన్నేళ్ల నిరీక్షణలో నేను చాలా నేర్చుకున్నా. ఒక్క ‘సాహో’కే పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది. ► ‘బాహుబలి’కంటే ముందే ‘సాహో’ కథ చెప్పాను. అయితే ‘బాహుబలి’ విడుదల తర్వాత ప్రభాస్‌గారి స్టార్డమ్, మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ కథలో మార్పులు చేయలేదు. యాక్షన్ సీక్వెన్స్ మరింత బెటర్‌గా ఉండేలా చూసుకున్నా. ‘బాహుబలి’ని దాటాలనుకోలేదు. దాని ప్రభావం నాపై లేదు. మా సినిమాని ‘బాహుబలి’తో పోల్చకూడదు. ► నా రెండో సినిమానే ప్రభాస్‌గారితో చేయడం సంతోషం. ఆయనతో పని చేస్తున్నప్పుడు ఓ స్టార్ హీరోతో చేస్తున్నాననే భావన కలగలేదు. అంత సరదాగా షూటింగ్ జరిగింది. ఈ నెల 15న సినిమా విడుదల చేయాల్సి ఉంది. అయితే హైస్టాండర్డ్ వీఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యమైంది. వినాయక చవితి పండగ సమయంలో ఈ 30న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ► ఫారిన్లో షూటింగ్ పర్మిషన్స్ కోసం కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అయితే చిత్రీకరణ సాఫీగా సాగింది. షూటింగ్ ఆలస్యం అయిందని అందరూ అంటున్నారు. బడ్జెట్ తగ్గించాలనుకుని ముందుగానే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశాం. అందుకే కొంచెం ఆలస్యం అయింది. షూటింగ్ స్టార్ట్ చేశాక ఎక్కడా ఆలస్యం కాలేదు. ‘బాహుబలి 2’ చిత్రంతోపాటు ‘సాహో’ టీజర్ రిలీజ్ చేశాం. అయితే అప్పటికి షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు. ఆ తర్వాతే మొదలైంది. ► ‘సాహో’లో లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. మూడు నాలుగు పాటలుంటాయి. అవి కథను ఎక్కడా డిస్టర్బ్ చేయవు. ముందుగా ఒకే సంగీత దర్శకుడితోనే పాటలన్నీ చేయించాలనుకున్నాం. అయితే ఒక్కో పాటకు ఒక్కరు చేయాల్సి వచ్చింది.. దానివల్ల బెస్ట్ వర్క్ వచ్చింది. నేపథ్యసంగీతం ఇద్దరు ముగ్గురు చేస్తే బాగుండదు కానీ, ఒక్కో పాటను ఒక్కరు చేయడం వల్ల నష్టం ఏమీ లేదు. ► ‘బాహుబలి’ తర్వాత ఇమేజ్‌కి తగ్గ సినిమా చేయాలని ప్రభాస్‌గారు కానీ, నేను కానీ అనుకోలేదు. యాక్షన్ ఎపిసోడ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనో, బాలీవుడ్ సినిమాతో మ్యాచ్ చేయాలనో తీయలేదు. ప్రేక్షకులకు కొత్తగా ఏం చూపిద్దాం అనుకుని స్టార్ట్ చేశాం. మేం అనుకున్న దాన్ని రీచ్ అయ్యాం. దర్శకులు రాజమౌళి, శంకర్గార్లతో నన్ను పోల్చకూడదు. శంకర్‌గారి సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. ‘సాహో’ సినిమాలో ఆయన రేంజ్లో ఓ పాట ఉండేలా ట్రే చేశా. -
దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్!
బాహుబలితో రికార్డులన్నీ కొల్లగొట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌లు నిర్మించారు. ఇప్పటికే చిత్ర యునిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్లతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సాహోను చిత్ర నిర్మాతలు భారీగానే నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సినీ వర్గాలతో పాటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సాహో’క్లైమాక్స్‌ను చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా భారీగా తీసేందుకు సుజిత్ అండ్ గ్యాంగ్ రెడీ అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందమంది అంతర్జాతీయ ఫైటర్స్‌తో క్లైమాక్స్ సీన్లు చిత్రీకరిస్తున్నారట. ఈ ఫైట్ కోసం భారీ సెట్‌ను కూడా రూపొందించారట. కేవలం క్లైమాక్స్ సీన్ కోసమే నిర్మాతలు ఏకంగా 70 కోట్ల బడ్టెట్‌ను వెచ్చిస్తున్నారట. పెంగ్ జాంగ్ ఈ ఫైట్‌ని కంపోజ్ చేశారు. చలనచిత్ర చరిత్రలోనే క్లైమాక్స్ కోసం ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్న సాహో అంటూ చిత్ర యునిట్ ప్రకటించింది. ముందుగా ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ భారీ ఫైట్, గ్రాఫిక్స్ కారణంగా చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటించారు. -
ప్రయాణం అద్భుతంగా సాగింది
ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జైట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. శ్రద్ధాకపూర్ కథానాయిక. జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, అరుణ్ విజయ్, ఎవలీన్ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో అరుణ్ విజయ్ తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేశారు. ‘‘ఇలాంటి వండర్ఫుల్ టీమ్‌లో భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణాన్ని ఓ మంచి జ్ఞాపకంగా చేసినందుకు ప్రభాస్, సుజీత్, యూవీ క్రియేషన్స్ సంస్థ, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ థ్యాంక్స్. ఆగస్ట్ 15 నుంచి థియేటర్స్‌లో అద్భుతమైన అనుభూతిని పొందడానికి రెడీగా ఉండండి’’ అని అరుణ్ విజయ్ పేర్కొన్నారు. -
యాక్టింగ్‌కు గుడ్ బై
... అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. అదేంటీ అనుకుంటున్నారా? ఆమె ఇక నటించను అని చెప్పింది ఈ ఏడాదిలో మాత్రమే. కొత్త ఏడాది స్టార్ట్ కావడానికి ఇక రెండు రోజులే ఉన్నాయి కదా. అందుకే సరదాగా అలా అన్నారన్నమాట. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ సినిమా షూట్లో ఆమె దాదాపు 15 గంటలు పాల్గొన్నారు. ‘‘సాహో’ సినిమా సెట్లో ఒక రోజులో 15గంటలు పాల్గొన్నాను. 2018కి ఇక షూటింగ్ ముగిసింది. ఈ ఏడాది ఇక నటించను’’ అని పేర్కొన్నారు శ్రద్ధాకపూర్. నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ఎవెలిన్ శర్మ, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ కూడా వచ్చే ఏడాది క్రిస్మస్కు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇవి కాకుండా హిందీ చిత్రాలు ‘ఛిచోరే, సైనా’తో బిజీగా ఉన్నారామె. -
ఉతుకుడే ఉతుకుడు!
విలన్స్‌ను ఉతికారేశారు ప్రభాస్. ఆ ఉతుకుడు ఏ రేంజ్లో ఉంది? అనేది వెండితెరపై చూడాల్సిందే. ఈ యాక్షన్‌ను హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ బాబ్ బ్రోన్ డిజైన్ చేశారట. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా తాజా యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘మరో యాక్షన్ ఎపిసోడ్‌ను కంప్లీట్ చేశాం. యాక్షన్ డైరెక్టర్స్ బాబ్ బ్రోన్, పెన్జాంగ్లు అమేజింగ్‌గా వర్క్ చేశారు’’ అని డైరెక్టర్ సుజిత్ పేర్కొన్నారు. ఈ యాక్షన్ షెడ్యూల్లో శ్రద్ధా కూడా పాల్గొన్నారు. సో.. ఈ సినిమాలో ఆమె కూడా కొన్ని ఫైట్స్‌ను చేసి ఉంటారని ఊహించవచ్చు. ఆ మధ్య అబుదాబిలో ఓ సూపర్ చేజింగ్ ఫైట్‌ని షూట్ చేసింది ‘సాహో’ టీమ్. హైదరాబాద్‌లో తీసిన ఈ తాజా యాక్షన్ సీన్స్ కూడా హై ఓల్టేజ్‌లో ఉంటాయట. త్వరలో రొమేనియాలో కూడా ఓ చేజింగ్ ఫైట్‌ను ప్లాన్ చేశారట. దీన్ని బట్టి ఈ సినిమాలో యాక్షన్‌కు పెద్దపీట వేసినట్లు అర్థం అవుతోంది. నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, ‘వెన్నెల’ కిశోర్, మురళీ శర్మ, ఎవెలిన్ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ ట్రైలింగ్వల్ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఇది తెలుగువారి విందు.. హహహ్హ ఏది ముందు?
దేనితో స్టార్ట్ చేయాలి? నోరూరిస్తున్న చికెన్తోనా? తినమంటున్న గుడ్డుతోనా లేక నన్నొదలకు శ్రద్ధా.. శ్రద్ధాగా తిను అంటున్న పాలకూరతోనా? ఇలా పెద్ద కన్ఫ్యూజన్లో పడిపోయారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. ఇక్కడున్న ఫొటో చూశారుగా? లంచ్ కోసం ఎన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయో! ఇదేదో పార్టీటైమ్ అనుకునేరు. కాదండి బాబు. ‘సాహో’ సినిమా షూటింగ్లో శ్రద్ధాకపూర్‌కు లభిస్తున్న స్పెషల్ ట్రీట్మెంట్. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్ లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ షూట్లో పాల్గొంటున్నారు శ్రద్ధాకపూర్. మంగళవారం లంచ్ బ్రేక్‌లో తన కోసం సిద్ధంగా ఉంచిన వంటకాల ఫొటోను షేర్ చేశారు. ‘అయ్యో... శ్రద్ధా ఎంత పెద్ద కష్టం వచ్చింది’ అని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ‘సాహో’ లొకేషన్లో తనకు ఏర్పాటు చేస్తున్న భారీ లంచ్ తాలూకు ఫొటోను షేర్ చేశారు శ్రద్ధా. మొత్తం మీద ఈ బాలీవుడ్ బ్యూటీని తెలుగు ఆతిథ్యం ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది. దాదాపు 250కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వచ్చే ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ చేయనున్నారని టాక్. -
సాహో రే డార్లింగ్
‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ ఇమేజ్ ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, ఎవెలిన్ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు నటిస్తున్నారు. మంగళవారం ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో’లో ఛాప్టర్ 1గా అబుదాబీలో జరిగిన ఈ చిత్రం చేజింగ్ సీన్ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లేటెస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ నయా లుక్, వీడియోను చూసి ‘సాహో రే డార్లింగ్’ అని çసంబరపడిపోతున్నారు. ‘‘ప్రభాస్ గత బర్త్ డేకి ‘సాహో’ లుక్‌ను రిలీజ్ చేశాం. ఆ తర్వాత షూటింగ్‌తో అంతా బిజీగా ఉన్నాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ‘సాహో’ అప్డేట్స్ ఇవ్వమని సోషల్ మీడియాలో అడిగారు. అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశాం. మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. శంకర్–ఎహసాన్–లాయ్ సంగీతం, కెమెరామేన్ మధి విజువల్స్ ఈ సినిమాకు హైలైట్’’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుందని టాక్. ఈ సంగతి అలా ఉంచితే.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్గా ఇటలీలో పూర్తయింది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. -
హైదరాబాద్‌లో ‘సాహో’ హీరోయిన్
బాహుబలి తరువాత ప్రభాస్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. తన తరువాతి సినిమా సాహోను భారీ బడ్టెట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె దుబాయ్‌లో భారీ షెడ్యుల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యుల్‌లో యాక్షన్, ఛేజింగ్ సీన్స్‌ను చిత్రీకరించారు. తాజాగా మరో షెడ్యుల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తోన్న శ్రద్ధా కపూర్ తాజా షెడ్యుల్‌లో పాల్గొన్నారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాల్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
10 వేల మందికి ఫోన్‌కాల్స్
బనశంకరి: పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో సిట్ విచారణ సాగేకొద్దీ కొత్త పాత్రలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ముఖ్య నిందితుడు అమూల్ కాలేకు మాస్టర్ అయిన సుజిత్ అనే వ్యక్తి హిందూ సంఘాల సమావేశాల్లో పాల్గొంటున్న సుమారు 10 వేల మంది యువకుల ఫోన్ నంబర్లు సేకరించినట్లు సిట్ విచారణలో తేలింది. ఈ నంబర్లతో అతడు యువకులను పరిచయం చేసుకునేవాడు. కరడుగట్టిన హిందూ మతాభిమానులను సుజిత్ కలసి.. హిందూ వ్యతిరేకులను అంతమొందించాలనేవాడు. దాదా అనే మరో వ్యక్తి వెళ్లి యువకులను ఎంపిక చేసేవాడు. ఎంపికైన వారికి మహారాష్ట్ర, గోవా, బెళగావిలోని నిర్జన ప్రదేశాల్లో ఎయిర్‌గన్ ద్వారా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చేవాడు. షార్ప్షూటర్లుగా శిక్షణ పొందిన 100 మంది యువకులను అమూల్‌కాలేకు దాదా పరిచయం చేశాడు. ఈ యువకుల్లో గౌరీని హత్యచేసిన వాగ్మారే కూడా ఉన్నాడు. -
ఏండే.. పెద్ద చాలెంజ్ అండె!
‘ఏండే.. ఓ పాట పాడండె’. ‘ఎన్నాంగ.. ఒరు పాట్టు పాడుంగ’. ‘జీ.. ఏక్ గానా గావో’...తెలుగు, తమిళ్, హిందీ భాషలు తెలిసినవాళ్లకు చెప్పినదే చెబుతున్నామని అర్థమయ్యే ఉంటుంది. ‘బుజ్జిగాడ్ మేడిన్ చెన్నై’లో ప్రభాస్ ‘ఏండే.. ఓ పాట పాడండె’ అని త్రిషతో కామెడీ చేసిన విషయం కూడా గుర్తుకు రాకమానదు. మరి.. తమిళ్, హిందీలో ఈ డైలాగ్ ఎందుకు రాసినట్లూ అనుకుంటున్నారా? మరేం లేదు.. ఇప్పుడు ప్రభాస్ తెలుగులో ఒక డైలాగ్ చెప్పగానే, వెంటనే హిందీలో, ఆ వెంటనే తమిళంలో చెబుతున్నారు. మరి.. ఒకే సినిమాని మూడు భాషల్లో చేసినప్పుడు అలానే కదా చెప్పాలి. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ‘సాహో’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ‘‘ఒక లాంగ్వేజ్‌లో డైలాగ్ కరెక్ట్ కుదరగానే, డైరెక్టర్ టేక్ ఓకే అంటారు. అలాగని రిలాక్స్ అవ్వడానికి లేదు. వెంటనే ఇంకో భాషలో అదే మాడ్యులేషన్‌తో, అదే ఎక్స్ప్రెషన్తో డైలాగ్ చెప్పాలి. ఇది ఓకే అయిందంటే వెంటనే ఇంకో భాష. ఎంతైనా మూడు భాషల్లో సినిమా అంటే ఈజీ కాదు. ఒక్కోసారి ఎక్కువ టేక్స్ తీసుకోవాల్సి వస్తుంది. నటీనటులకు మాత్రమే కాదు టెక్నీషియన్స్‌కి కూడా ఇది కష్టమే. పెద్ద చాలెంజ్’’ అని పేర్కొన్నారు ప్రభాస్. ఏండే.. నిజంగా చాలెంజే కదండె. ఎన్నాంగా.. రుంబ చాలెంజ్ ఇల్లీంగ.. జీ... బహుత్ బడా చాలెంజ్ హై నా! -
రేస్ బైక్.. భలే కిక్
రయ్.. రయ్‌మంటూ బండి ఎక్స్‌లేటర్ విపరీతంగా రైజ్ చేస్తున్నారు ప్రభాస్. స్పీడోమీటర్‌లో స్పీడ్ లిమిట్ కూడా పట్టించుకోవట్లేదట. విశాలమైన దుబాయ్ రోడ్స్ పై రేసులో దూసుకెళ్లడానికా? కాదు. మరి ఎందుకీ స్పీడు? అంటే.. విలన్స్‌ని క్యాచ్ చేయాలంటే ఆ మాత్రం స్పీడు కావాల్సిందే కదా. ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన భారీ చేజ్ సీక్వెన్స్‌ను దుబాయ్‌లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చేజ్ సీక్వెన్స్‌లో రేస్ బైక్‌పై ఉన్న ప్రభాస్ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ ఇరవై నిమిషాల చేజ్ సీన్స్ కోసం చిత్రబృందం సుమారు 20కోట్లు ఖర్చుపెడుతోందట. ఈ సీన్స్‌ను దాదాపు యాభై రోజులు షూట్ చేయనున్నారు. ఈ రేస్ బైక్‌తో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్ అభిమానులకు ఫీస్ట్‌లా, కిక్ ఇచ్చేలా ఉండేలా ప్లాన్ చేశారట చిత్రదర్శకుడు సుజిత్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సినిమాకు సంగీతం: శంకర్–ఎహసాన్–లాయ్, కెమెరా: మది. -
ఇట్స్ వెయిటింగ్ టైమ్
రావడంలేదు.. ఈ ఏడాది ప్రభాస్ సిల్వర్ స్క్రీన్‌కి రావడంలేదు. టూ పార్ట్స్‌గా వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ కోసం ప్రభాస్ ఫైవ్ ఇయర్స్ టైమ్ కేటాయించి.. ఐదేళ్లలో రెండుసార్లు మాత్రమే సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘సాహో’ టీజర్‌ను ‘బాహుబలి 2’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందు విడుదల చేశారు. ‘ఇన్ థియేటర్స్ 2018’ అని టీజర్ ఎండ్ అవుతుంది. అలాగే ఆ టీజర్లో ‘ఇట్స్ షో టైమ్’ అని ప్రభాస్ డైలాగ్ చెబుతారు. ఈ ఏడాది వెండితెరపై ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ను చూడొచ్చనుకున్నారు సినీ ప్రేమికులు. కానీ ‘సాహో’ చిత్రం ఈ ఏడాది విడుదల కావడం లేదని దాదాపు కన్ఫార్మ్ అయినట్టే. సో.. ‘ఇట్స్ వెయిటింగ్ టైమ్’ అన్నమాట. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను టీ సీరీస్ అధినేత, నిర్మాత భూషణ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. ‘సాహో’ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చేది నెక్ట్స్ ఇయరే అని బీ టౌన్ స్ట్రాంగ్ టాక్. ‘సాహో’కి బోలెడంత సీజీ వర్క్ ఉంటుందని టీజర్ ఎండ్ షాట్స్ చూస్తే అర్థం అవుతుంది. సో.. ఈ ఏడాది ప్రభాస్ థియేటర్స్‌లోకి రావడం కష్టమే. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ అబుదాబీలో జరుగుతోంది. ‘‘అబుదాబిలో జరుగుతున్న ‘సాహో’ షూటింగ్లో పాల్గొన్నాను’’ అని పేర్కొన్నారు నీల్ నితిన్ ముఖేష్.