
వాట్ నెక్ట్స్..!?
‘మిర్చి’తోనే యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రమోద్, వంశీ.. ఇద్దరూ ప్రభాస్ స్నేహితులే. ‘మిర్చి’ తర్వాత ప్రభాస్ హీరోగా మరో సినిమా తీయాలని ఈ స్నేహితులిద్దరూ ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ‘బాహుబలి’ షూటింగ్ పూర్తయిన తర్వాతే ప్రభాస్ ఓకే అంటారని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది.
కానీ, వాట్ నెక్ట్స్? ‘బాహుబలి’ తర్వాత ఎలాంటి సినిమాలో నటించబోతున్నారు? అంటే ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వనున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించనుందనే సంగతి తెలిసిందే. సుజీత్ స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేశారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. సో.. ప్రభాస్ నటించనున్న ఫస్ట్ థ్రిల్లర్ మూవీ ఇదే అవుతుందని చెప్పొచ్చు. ఇది కాకుండా.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.