ప్రభాస్ కోసం బాలీవుడ్ సంగీత త్రయం..? | Shankar Ehsaan Loy are the music directors of Prabhas film | Sakshi
Sakshi News home page

ప్రభాస్ కోసం బాలీవుడ్ సంగీత త్రయం..?

Dec 21 2016 3:19 PM | Updated on Sep 4 2017 11:17 PM

ప్రభాస్ కోసం బాలీవుడ్ సంగీత త్రయం..?

ప్రభాస్ కోసం బాలీవుడ్ సంగీత త్రయం..?

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ ఒక్క సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమా కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగా ఓ యాక్షన్ కథను భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహించనున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం జాతీయ స్థాయి టెక్నికల్ టీంను సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకులుగా బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్లను తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మ్యూజీషియన్స్ గతంలో కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే తెలుగు సినిమాకు సంగీతం అందించారు. అయితే ప్రభాస్ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా భారీగా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్న చిత్రయూనిట్, బాలీవుడ్ టెక్నిషియన్స్ అయితేనే కరెక్ట్ అని భావిస్తోంది. త్వరలో ఈ చిత్ర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement