
దేనితో స్టార్ట్ చేయాలి? నోరూరిస్తున్న చికెన్‌తోనా? తినమంటున్న గుడ్డుతోనా లేక నన్నొదలకు శ్రద్ధా.. శ్రద్ధాగా తిను అంటున్న పాలకూరతోనా? ఇలా పెద్ద కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. ఇక్కడున్న ఫొటో చూశారుగా? లంచ్ కోసం ఎన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయో! ఇదేదో పార్టీటైమ్ అనుకునేరు. కాదండి బాబు. ‘సాహో’ సినిమా షూటింగ్‌లో శ్రద్ధాకపూర్‌కు లభిస్తున్న స్పెషల్ ట్రీట్‌మెంట్. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్ లాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
ఈ షూట్‌లో పాల్గొంటున్నారు శ్రద్ధాకపూర్. మంగళవారం లంచ్ బ్రేక్‌లో తన కోసం సిద్ధంగా ఉంచిన వంటకాల ఫొటోను షేర్ చేశారు. ‘అయ్యో... శ్రద్ధా ఎంత పెద్ద కష్టం వచ్చింది’ అని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ‘సాహో’ లొకేషన్‌లో తనకు ఏర్పాటు చేస్తున్న భారీ లంచ్ తాలూకు ఫొటోను షేర్ చేశారు శ్రద్ధా. మొత్తం మీద ఈ బాలీవుడ్ బ్యూటీని తెలుగు ఆతిథ్యం ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది. దాదాపు 250కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వచ్చే ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ చేయనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment