![Chiranjeevi Asked Saaho Sujith To Work On Lucifer Telugu Remake - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/11/luci3.jpg.webp?itok=s81JuQTA)
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించనున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా సుకుమార్, హరీష్ శంకర్ ఇలా కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా యువ దర్శకుడు సుజిత్ పేరు వినిపిస్తోంది. ‘లూసీఫర్’ తెలుగు స్క్రిప్ట్‌ను రెడీ చేయాల్సిందిగా సుజిత్‌కు చిరంజీవి చెప్పారట. ఇంతకు ముందు శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ప్రభాస్ ‘సాహో’ చిత్రాలకు సుజిత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment