మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కాంబినేషన్‌లో టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. దాదాపు 20 సినిమాలతో హిట్ పెయిర్‌గా వీరిద్దరికి మంచి పేరు ఉంది. అయితే తొలుత విజయశాంతి, ఆ తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోయాక వీరిద్దరు కలిసి మరోసారి తెరపై కనిపించలేదు. అయితే ఫిలింనగర్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న వార్త ప్రకారం.. చిరంజీవి చిత్రంలో విజయశాంతి కనిపించనున్నారట. దీంతో సుదీర్ఘ గ్యాప్ తర్వాత వీరిద్దరు ఒకే తెరపై కనువిందు చేయనున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!)
మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రను తెలుగులో విజయశాంతి నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. (‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం)
మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా చేసిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన చిత్రంగా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. కాగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని మార్పులను సూచించినట్లు తెలుస్తోంది. చిరు సూచించిన సూచనలకు తగ్గట్టు సుజీత్ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి మెగాస్టార్‌కు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక మలయాళ చిత్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా హీరో ఎలివేషన్ సీన్స్ సూపర్బ్‌గా ఉంటాయి. ఆదే జోరులో తెలుగులోనూ హీరో ఎలివేషన్ సీన్స్ ఉండేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నారని టాక్ ఆఫ్ ది టౌన్.
Comments
Please login to add a commentAdd a comment