చిరు చిత్రంలో సల్మాన్‌?.. ఇదిగో క్లారిటీ | Chiranjeevi Give Clarity On Salman Khan Act In Lucifer Remake | Sakshi
Sakshi News home page

లూసీఫర్‌ రిమేక్‌లో సల్మాన్‌.. క్లారిటీ ఇచ్చిన చిరు

Published Thu, May 7 2020 2:37 PM | Last Updated on Thu, May 7 2020 4:05 PM

Chiranjeevi Give Clarity On Salman Khan Act In Lucifer Remake - Sakshi

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో జోరు పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అయితే ఆచార్య తర్వాత చేయాల్సిన సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు మెగాస్టార్‌. వరుసగా సినిమాలతో పాటు ఓ వెబ్‌ సిరీస్‌కు కూడా ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఆచార్య తర్వాత మలయాళ సూపర్‌ హిట్‌ ‘లూసిఫర్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఇక ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ‘సాహో’ ఫేం సుజిత్‌కు చిరు అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు లూసిఫర్‌ కథలో భారీ మార్పులు చేస్తున్నారట దర్శకుడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ లో మోహన్ లాల్ నమ్మిన బంటుగా ఉండే ఒక పాత్రను పృథ్వీరాజ్ పోషించారు. ఈ క్రమంలోనే తెలుగు వర్షన్‌లో పృథ్వీరాజ్ పోషించిన ఆ పాత్రను సల్మాన్ ఖాన్ చేత చేయించాలని చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోందనే వార్తలు వచ్చాయి. 

అయితే ఈ వార్తలపై చిరంజీవి స్పందించారు. లూసిఫర్ రీమేక్‌ కు సంబంధించి కథలో మార్పులు జరుగుతున్నాయని చెప్పిన చిరు.. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ఇంకా జరగలేదని చెప్పారు. మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తున్నారని.. బాలీవుడ్‌ హీరో సల్మాన్ నటిస్తున్నడని వస్తున్న వార్తలు అన్నీ అబద్దాలే తేల్చేశాడు చిరంజీవి. కథ మొత్తం పూర్తయిన తర్వాత ఇందులో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ ఇస్తామని మెగాస్టార్ స్పష్టం చేశారు. 

చదవండి:
ప్రభాస్‌-అశ్విన్‌ చిత్రం: విలన్‌ అతడేనా?
‘అది వాషింగ్‌ మెషీన్‌ కాదు యశ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement