
సాక్షి, బంజారాహిల్స్: ఒంటి నిండా 13చోట్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫొటోలతో.. 19 చోట్ల అల్లు అర్జున్ పేర్లతో పచ్చబొట్లు.. ఇక గదినిండా సుమారు 50వేల వరకు అల్లు అర్జున్ ఫొటోలు.. అభిమానానికి కొలమానం లేదన్నట్లుగా ఆ యువకుడు తన అభిమాన హీరో అల్లు అర్జున్ ఫొటోలతో ఇల్లంతా నింపేశాడు. తలుపులు, కిటికీలు, గోడలు, సీలింగ్, ఫ్యాన్లు ఇలా దేన్నీ వదల్లేదు. ఇంట్లోకి అడుగు పెడితే ఇల్లంతా ఫొటోలే కనిపిస్తాయి.
తాను బన్నీకి వీరాభిమానని చెప్పుకుంటాడు సుజిత్. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్‌లో కూడా ప్రతినిధిగా ఉన్నాడు. తాను ఎంత అభిమానినో చాటుకుంటూ ట్విటర్‌లో ఆ ఫొటోలను కూడా షేర్ చేసుకున్నాడు. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఎటు చూసినా బన్నీ కనిపించాలనే ఇలా ఫొటోలతో, టాటూలతో అలంకరించుకున్నట్లు ఈ యువకుడు వెల్లడించాడు.