రేస్‌ బైక్‌..  భలే కిక్‌ | aaho: Prabhas in action mode | Sakshi
Sakshi News home page

రేస్‌ బైక్‌..  భలే కిక్‌

Published Wed, May 2 2018 1:08 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

aaho: Prabhas in action mode - Sakshi

రయ్‌.. రయ్‌మంటూ బండి ఎక్స్‌లేటర్‌ విపరీతంగా రైజ్‌ చేస్తున్నారు ప్రభాస్‌. స్పీడోమీటర్‌లో స్పీడ్‌ లిమిట్‌ కూడా పట్టించుకోవట్లేదట. విశాలమైన దుబాయ్‌ రోడ్స్‌ పై రేసులో దూసుకెళ్లడానికా? కాదు. మరి ఎందుకీ స్పీడు? అంటే.. విలన్స్‌ని క్యాచ్‌ చేయాలంటే ఆ మాత్రం స్పీడు కావాల్సిందే కదా. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందుతోన్న భారీ యాక్షన్‌ చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ,  ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన భారీ చేజ్‌ సీక్వెన్స్‌ను దుబాయ్‌లో హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ కెన్నీ బేట్స్‌ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు.

ఈ చేజ్‌ సీక్వెన్స్‌లో రేస్‌ బైక్‌పై ఉన్న ప్రభాస్‌ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ ఇరవై నిమిషాల చేజ్‌ సీన్స్‌ కోసం చిత్రబృందం సుమారు 20కోట్లు ఖర్చుపెడుతోందట. ఈ సీన్స్‌ను దాదాపు యాభై రోజులు షూట్‌ చేయనున్నారు. ఈ రేస్‌ బైక్‌తో ప్రభాస్‌ చేసే యాక్షన్‌ సీక్వెన్స్‌ అభిమానులకు ఫీస్ట్‌లా, కిక్‌ ఇచ్చేలా ఉండేలా ప్లాన్‌ చేశారట చిత్రదర్శకుడు సుజిత్‌. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ సినిమాకు సంగీతం: శంకర్‌–ఎహసాన్‌–లాయ్, కెమెరా: మది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement