యువ గాయకుడి ఆత్మహత్య!
యువ గాయకుడు (23) సుజిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన సుజిత్ తండ్రి ప్రభుత్వోద్యోగి అని, గత 40 ఏళ్లుగా వాళ్లు ఇక్కడే ఉంటున్నారని తెలిసింది. ఆర్కెస్ట్రాలో సభ్యుడైన సుజిత్ అందరితోనూ బాగా కలిసి మెలిసి ఉంటాడని, అయితే ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదని కాలనీ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.
ఎల్బీనగర్ సమీపంలోని మీర్‌పేట ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే సుజిత్ ఆత్మహత్య చేసుకోడానికి కారణాలేంటన్నవి మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.