రూ. 20 కోట్ల బడ్జెట్‌తో కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా! | Kiran Abbavaram Upcoming Film Update | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: రూ. 20 కోట్ల బడ్జెట్‌తో కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా!

Published Tue, Jul 2 2024 7:29 PM | Last Updated on Tue, Jul 2 2024 7:55 PM

Kiran Abbavaram Upcoming  Film Update

మొన్నటి వరకు వరస సినిమాలతో అలరించిన యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం.. ఇటీవల చిన్న బ్రేక్‌ ఇచ్చాడు. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. మంచి కంటెంట్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకే కిరణ్ అబ్బవరం ఈ బ్రేక్ తీసుకున్నారట.ఏడాది తర్వాత ఆయన తన కొత్త సినిమా వివరాలు చెప్పబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

శ్రీచక్ర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం కానుందని సమాచారం.ఈ సినిమా కి కిరణ్ ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారట.  

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారని అంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement