
సాహోరే సాహో@19
ఇట్స్ అఫీషియల్ నౌ! ప్రభాస్ 19వ సినిమా టైటిల్ ‘సాహో’నే. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్
ఇట్స్ అఫీషియల్ నౌ! ప్రభాస్ 19వ సినిమా టైటిల్ ‘సాహో’నే. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న సినిమాకు ‘సాహో’ టైటిల్ ఖరారు చేసినట్టు ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ‘భళి భళి భళి రాభళి... సాహోరే బాహుబలి’ పాట ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. అందులోని ‘సాహో’ను తాజా సినిమాకు టైటిల్‌గా తీసుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ఇది శుభవార్తే. కానీ, వాళ్లకు చిన్న నిరాశ తప్పలేదు.
ఆదివారం టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారని వాళ్లు ఆశించారు. అటువంటిది ఏదీ జరగలేదు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘బాహుబలి–2’తో పాటు ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి కళ: సాబు సిరిల్, కెమెరా: మది, సంగీతం: శంకర్–ఎహసన్–లాయ్.