
హోమ్ నుంచి స్టారై్ట షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు హీరోయిన్ అనుష్క. ‘భాగమతి’ లొకేషన్‌కి అయితే కాదు. అంటే.. హీరోయిన్‌గా ఏదైనా కొత్త సినిమా స్టార్ట్ చేశారా? అంటే అదీ కాదు. పోనీ ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారా? అంటే.. కానే కాదు. మరి ఏ సినిమా షూటింగ్‌కి వెళ్లారు స్వీటీ (అనుష్క) అంటే.. ‘సాహో’ సెట్స్‌కి. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సాహో’. నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్‌విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిందని సమాచారం.
ఈ లొకేషన్‌కి వెళ్లి, స్వీటీ స్వీట్ షాకిచ్చారు. అందరితో సరదాగా కబుర్లు చెప్పారు. ఇన్‌సెట్‌లో పిక్ చూస్తున్నారుగా. ఈ ఫొటోను యాక్టర్ మురళీ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా ‘సోహో’ సెట్‌లోకి ‘భాగమతి’ ఎంట్రీ ఇచ్చారు. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క లీడ్ రోల్‌లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ‘భాగమతి’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment