అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..? | Prabhas Wants To Show Special Screening Of Saaho For Anushka Shetty | Sakshi
Sakshi News home page

అనుష్క కోసం సాహో స్పెషల్‌ షో..?

Published Fri, Aug 9 2019 3:42 PM | Last Updated on Fri, Aug 9 2019 4:55 PM

Prabhas Wants To Show Special Screening Of Saaho For Anushka Shetty - Sakshi

‘ప్రభాస్‌-అనుష్క’ ఈ జంట తెరపై  కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే. ఇప్పటికే మూడు సినిమాల్లో కలిసి నటించిన వీరు బాహుబలి సినిమాతో టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. ఆన్‌ స్క్రీన్‌పై వీళ్ల జంట అంత బాగుంటుంది మరి. అయితే నిజ జీవితంలోనూ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు గత కొద్దికాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను వీరిద్దరూ కొట్టి పారేశారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం అని మాత్రమే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన మరో వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగస్టు 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ దాని కంటే ముందే ప్రభాస్‌, అనుష్క కోసం ప్రత్యేకంగా ఓ షో వేయనున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ విషయం గురించి ఇటీవలే ఓ ఆంగ్ల పత్రిక తెలియజేసింది. విభిన్న భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రంతో ప్రభాస్‌ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ట్రైలర్‌, టీజర్‌ పోస్టర్లతో జాతీయ వ్యాప్తంగా హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా ఆగస్టు 30న విడుదలకు సిద్ధంగా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement