నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌ | Prabhas Comments On Relationship With Anushka | Sakshi
Sakshi News home page

అనుష్కా పెళ్లి చేసుకోవా ప్లీజ్‌!

Published Wed, Aug 21 2019 5:41 PM | Last Updated on Wed, Aug 21 2019 5:55 PM

Prabhas Comments On Relationship With Anushka - Sakshi

‘బాహుబలి’తో జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించిన ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా అంతే భారీగా ప్లాన్‌ చేస్తోంది సినిమా యూనిట్‌. ఈ క్రమంలో వరుస  ఇంటర్వ్యూలతో ప్రభాస్‌ బిజీ అయ్యాడు. ఇందులో భాగంగా సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈటీ టైమ్స్‌తో మాట్లాడిన యంగ్‌ రెబల్‌ స్టార్‌కు హీరోయిన్‌ అనుష్కతో ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా ప్రభాస్‌....‘ నేను లేదా అనుష్క ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటేనే(వేర్వేరు వ్యక్తులను) తప్ప ఈ వదంతులు ఆగేలా లేవు. ఈ విషయం గురించి అనుష్కతో ఓసారి మాట్లాడాల్సిందే. ఇదిగో అనుష్క నువ్వైనా తొందరగా పెళ్లి చేసుకో అని తనకు చెబుతాను. అప్పుడే ఇటువంటి పుకార్లకు తెర పడుతుందేమో’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.

నిజంగా తాము రిలేషన్‌షిప్‌లో ఉంటే ఏ ఇటలీలోనో, ఏదైనా బీచ్‌లోనో సంతోషంగా తిరిగేవాళ్లమే కదా ప్రభాస్‌ అని ప్రశ్నించాడు. అసలు ఇందులో దాచాల్సిన విషయం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికాడు. కాగా అనుష్కతో ప్రభాస్‌ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం లాస్‌ఏంజెల్స్‌లో సాహో ప్రత్యేక షో వేయిస్తున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన ‘సాహో’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement