
బాండ్... జేమ్స్ బాండ్
ప్రభాస్ ఇటువంటి డైలాగులు చెబితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకంటే... సుజీత్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్ సై్టల్‌లో ఉంటుందట! ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను ఏప్రిల్ 23న, టీజర్‌ను ఏప్రిల్ 28న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘బాహుబలి–2’ రిలీజయ్యే థియేటర్లలో టీజర్‌ను ప్రదర్శించనున్నారు. ‘‘ప్రభాస్ క్యారెక్టర్, సినిమా సై్టలిష్‌గా ఉంటాయి.
అలాగే, ప్రేక్షకులందర్నీ ఆకట్టుకునే ఎమోషన్స్, డ్రామా సినిమాలో ఉన్నాయి. మే నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు సుజీత్. ఇంకా చిత్రీకరణ ప్రారంభించకుండా టీజర్‌ను ఎలా విడుదల చేస్తున్నారని దర్శకుణ్ణి అడిగితే... ‘‘కేవలం టీజర్ కోసమే ఒక్క రోజు షూటింగ్ చేశాం. ప్రస్తుతం టీజర్‌కు సంబంధించిన వర్క్ ముంబైలో జరుగుతోంది’’ అన్నారు.
ఈ సినిమాకు ‘సాహో’ టైటిల్ ఖరారు చేశారట. ఇంత బడ్జెట్‌లోనే సినిమా తీయాలనే బౌండరీలేవీ నిర్మాతలు పెట్టుకోలేదట! అబుదాబిలో తీయబోయే యాక్షన్ సీక్వెన్స్‌కి 35 కోట్లు ఖర్చు అవుతుందట. సినిమానూ అంతే స్థాయిలో భారీగా నిర్మిస్తారట. యూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మించనున్న ఈ చిత్రానికి స్టంట్స్: కెన్నీ బాట్స్, కెమేరా: మది, సంగీతం: శంకర్–ఎహసన్–లాయ్.