బనశంకరి: పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో సిట్ విచారణ సాగేకొద్దీ కొత్త పాత్రలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ముఖ్య నిందితుడు అమూల్ కాలేకు మాస్టర్ అయిన సుజిత్ అనే వ్యక్తి హిందూ సంఘాల సమావేశాల్లో పాల్గొంటున్న సుమారు 10 వేల మంది యువకుల ఫోన్ నంబర్లు సేకరించినట్లు సిట్ విచారణలో తేలింది. ఈ నంబర్లతో అతడు యువకులను పరిచయం చేసుకునేవాడు. కరడుగట్టిన హిందూ మతాభిమానులను సుజిత్ కలసి.. హిందూ వ్యతిరేకులను అంతమొందించాలనేవాడు. దాదా అనే మరో వ్యక్తి వెళ్లి యువకులను ఎంపిక చేసేవాడు. ఎంపికైన వారికి మహారాష్ట్ర, గోవా, బెళగావిలోని నిర్జన ప్రదేశాల్లో ఎయిర్‌గన్ ద్వారా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చేవాడు. షార్ప్‌షూటర్లుగా శిక్షణ పొందిన 100 మంది యువకులను అమూల్‌కాలేకు దాదా పరిచయం చేశాడు. ఈ యువకుల్లో గౌరీని హత్యచేసిన వాగ్మారే కూడా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment