Hindu activists
-
హిందూ కార్యకర్త పూజారికి బెయిల్
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్‌కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్‌పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు. -
‘అంత తొందరెందుకు’.. ఢిల్లీ హైకోర్టులో ‘ఆదిపురుష్’కు స్వల్ప ఊరట
‘ఆపురుష్’ చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆదిపురుష్’ సినిమాఫై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన ‘పిల్’ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ చిత్రంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశించింది. (చదవండి: ఆదిపురుష్' 5 రోజుల కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు?) ఆదిపురుష్ చిత్రంలో వివాదాస్పదమైన అంశాలెన్నో ఉన్నాయని, నేపాల్ వంటి దేశాలు కూడా ఈ సినిమాను నిషేధించాయని హిందూ సేన లాయర్ పేర్కొన్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను, తొలగిస్తానని, డైలాగులను మారుస్తామని చిత్ర దర్శకుడు ఓంరౌత్ ప్రకటించినప్పటికీ అలాంటి చర్యలేవీ ఇప్పటివరకు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని, ఈ మేరకు అత్యవసరంగా విచారణ జరపాలని హిందూ సేన లాయర్ కోరగా..హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఎలాంటి అత్యవసరం లేదని, జూన్ 30న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 16న విడుదలై.. ప్రేక్షకుల నుంచి మిశ్రస స్పందనను సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. అంతకు మించిన నిరసనలను ఎదుర్కొంటుంది. హిందూ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవలు అపారం
జైపూర్: దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అయితే, ఇది పోటీకి సంబంధించిన విషయం కాదని అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ సమీపంలోని జామ్డోలీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన కేశవ్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సేవ సంగమ్ సదస్సును మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ సేవ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన దేశంలో మేధావులు క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యాసంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే హిందూ మత గురువులు, ఆచార్యులు, సన్యాసులు అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. సేవ అంటే సేవ మాత్రమేనని, ఇది పోటీ కాదని వివరించారు. నిస్వార్థంగా ప్రజలకు అందించే సేవలను కొలవలేమని వ్యాఖ్యానించారు. సేవ అనేది సహజ మానవత్వ వ్యక్తీకరణ అని మోహన్ భగవత్ తెలియజేశారు. మనమంతా సమాజంలో భాగమేనని, ఐక్యంగా లేకపోతే మనం పరిపూర్ణం కాదని తేల్చిచెప్పారు. సమాజంలో అసమానతలు ఎంతమాత్రం వాంఛనీయం కాదన్నారు. దురదృష్టవశాత్తూ అసమానతలు కొనసాగుతున్నాయని వివరించారు. సేవ అనేది ఆరోగ్యకరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. -
ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోండి: బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పార్లమెంటరీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్.. హిందూ కార్యకర్తల హత్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందువులకు తమపై దాడి చేసిన వారిపై స్పందించే హక్కు ఉందని, అది వారి గౌరవానికి సంబంధించినదని అన్నారు. అలాగే తమను తాము రక్షించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉన్నందున ఇంట్లో పదునైనా కత్తులు పెట్టుకోవాంటూ పిలుపునిచ్చారు. లవ్ పేరుతో కొందరు జిహాద్ చేస్తున్నారని అందులో ప్రేమ మాత్రం ఉండదని అన్నారు. ఈ మేరకు ప్రగ్యా ఆదివారం జరిగిన సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణిచివేతదారులను, పాపాత్ములను అంతం చేయాలని లేదంటే ప్రేమకు నిజమైన నిర్వచనం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో తమపై దాడి చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి. అంతేగాదు లవ్ జిహాద్ పేరుతో బలవుతున్న అమ్మాయిలను రక్షించండి. బాలికలకు సరైన విలువలు నేర్పండి. శివమొగ్గకు చెందిన హర్షతో సహా హిందువుల కార్యకర్తల హత్యల గురించి ప్రస్తావిస్తూ... స్వీయ రక్షణ కోసం ఇంట్లోని కత్తులనైనా పదును పెట్టుకోవాలన్నారు. ఇంట్లో ఆయుధాలైనా ఉంచుకోండి లేదా కూరగాయాల కోసం ఉపయోగించే పదునైన కత్తులైనా రెడీగా ఉంచుకోండి అని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి పరిస్థిత వస్తుందో తెలియదు కాబట్టి దాడి చేసినప్పుడు వారికి తగిన రీతిలో రిప్లై ఇవ్వడం మన హక్కు అని చెప్పారు. అలాగే మీ పిల్లలను మిషనరీ సంస్థల్లో చదివించకండి అలా చేస్తే తల్లిదండ్రులను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పంపుతారు, స్వార్థపరులుగా మారిపోతారంటూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పిల్లలకు ధర్మం గురించి, శాస్త్రల ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. తద్వారా పిల్లలు మన సంస్కృతి, విలువలు గురించి తెలుసుకుంటారని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు. (చదవండి: నడి రోడ్డుపై అడ్డగించి మరీ...మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..) -
హత్యకు కుట్ర, ముగ్గురి అరెస్ట్
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో మరో హిందూ కార్యకర్తను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు... శివమొగ్గ నగరానికి చెందిన హిందూ కార్యకర్త భరత్‌ను హత్య చేయడానికి సల్మాన్, అబ్బాస్, ఉస్మాన్ కుట్రపన్నారు. విషయం తన సోదరుడి ద్వారా తెలుసుకున్న భరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వక్కచెట్ల నరికివేత: శివమొగ్గ జిల్లాలోని వీరాపుర గ్రామంలో రైతు మోహన్ కుమార్‌కు చెందిన 40 వక్కచెట్లను దుండగులు నరికివేశారు. సోమవారం రాత్రి దుండగులు చెట్లను నరికి పారిపోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: కేటీపీసీ అగ్నిప్రమాద ఘటనలో ఒకరి మృతి) -
కేరళలో ఉద్రిక్తంగా మారిన బంద్
-
రణరంగంగా కేరళ
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో 266 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ పి. సదాశివం ముఖ్యమంత్రి విజయన్ను ఆదేశించారు. తాజా హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని విజయన్ ఆరోపించారు. మరోవైపు, శబరిమల ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత గర్భగుడిని శుద్ధిచేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీజేపీ కార్యకర్తలకు కత్తిపోట్లు.. త్రిసూర్‌లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, పాలక్కడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్స్ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పాలక్కడ్‌లో సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు, దాని ముందు నిలిపిన వాహనాల్ని ధ్వంసం చేశారు. కన్నూర్ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. మీడియాపై దాడికి నిరసనగా తిరువనంతపురంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యక్రమాలను బహిష్కరించాలని కేరళ మీడియా వర్కింగ్ యూనియన్ నిర్ణయించింది. హర్తాళ్ వల్ల దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. గురువారం కాంగ్రెస్ ‘బ్లాక్ డే’గా పాటించింది. పాతనంతిట్టా జిల్లాలోని పాండలమ్లో సీపీఎం కార్యకర్తలు తమ కార్యాలయ భవనం పైనుంచి రాళ్లు రువ్వడంతో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఉన్నితాన్ చనిపోయారు. బుధవారం సాయంత్రం శబరిమల కర్మ సమితి చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 9 మందిని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నితాన్ గుండెపోటుతో మరణించాడని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. చెన్నైలో కేరళ సీఎం దిష్టిబొమ్మ దహనం సాక్షి, చెన్నై: శబరిమల ఆందోళనలు చెన్నైకీ విస్తరించాయి. పల్లవరంలో బీజేపీ కార్యకర్తలు కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ విమర్శించారు. హింస వెనక బీజేపీ, ఆరెస్సెస్: విజయన్ హర్తాళ్ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్ తప్పుబట్టారు. ఢిల్లీలో కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్న అయ్యప్ప ధర్మ సంరక్షక సమితి సభ్యులు -
10 వేల మందికి ఫోన్‌కాల్స్
బనశంకరి: పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో సిట్ విచారణ సాగేకొద్దీ కొత్త పాత్రలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ముఖ్య నిందితుడు అమూల్ కాలేకు మాస్టర్ అయిన సుజిత్ అనే వ్యక్తి హిందూ సంఘాల సమావేశాల్లో పాల్గొంటున్న సుమారు 10 వేల మంది యువకుల ఫోన్ నంబర్లు సేకరించినట్లు సిట్ విచారణలో తేలింది. ఈ నంబర్లతో అతడు యువకులను పరిచయం చేసుకునేవాడు. కరడుగట్టిన హిందూ మతాభిమానులను సుజిత్ కలసి.. హిందూ వ్యతిరేకులను అంతమొందించాలనేవాడు. దాదా అనే మరో వ్యక్తి వెళ్లి యువకులను ఎంపిక చేసేవాడు. ఎంపికైన వారికి మహారాష్ట్ర, గోవా, బెళగావిలోని నిర్జన ప్రదేశాల్లో ఎయిర్‌గన్ ద్వారా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇచ్చేవాడు. షార్ప్షూటర్లుగా శిక్షణ పొందిన 100 మంది యువకులను అమూల్‌కాలేకు దాదా పరిచయం చేశాడు. ఈ యువకుల్లో గౌరీని హత్యచేసిన వాగ్మారే కూడా ఉన్నాడు. -
శ్రీరాముడిపై వ్యాఖ్యలు: కత్తి మహేశ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై కేసు నమోదైంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్ ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నా మాటల్ని వక్రీకరించారు; దిగ్విజయ్ సింగ్
మధ్యప్రదేశ్ : ‘మీడియా నా మాటల్ని తప్పుగా అర్ధం చేసుకుంది. నేను మాట్లాడింది ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి. కానీ మీడియా మాత్రం దాన్ని ‘హిందూ టెర్రరిజమ్’ అని ప్రచారం చేసిందం’టూ వివరణ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్. మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ఏక్తా యాత్ర సందర్భంగా శుక్రవారమిక్కడ నిర్వహించిన మీడియ సమావేశంలో పాల్గొన్నారు దిగ్విజయ్ సింగ్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చేసిన ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి వివరణ ఇచ్చారు. నేను మాట్లాడింది ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి..కానీ మీడియా మాత్రం ‘హిందూ టెర్రరిజమ్’ అంటూ ప్రచారం చేసిందన్నారు. అంతేకాక తీవ్రవాద కార్యకలపాలను మత ప్రతిపాదికను వేరు చేసి చెప్పలేమని, ఏ మతం కూడా తీవ్రవాదాన్ని సమర్ధించదన్నారు. అంతేకాక ‘సంఘ్ టెర్రరిజమ్’ గురించి తాను గతంలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని బలపరుస్తూ ‘మాలేగావ్, మక్కా మసీదు, సంఝౌతా ఎక్స్‌ప్రెస్, దర్గా షరీఫ్ పేలుళ్ల’కు పాల్పడ్డ వారు ‘సంఘ్ భావజాలం’ నుంచి స్ఫూర్తి పొందే ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ‘సంఘ్ టెర్రరిజమ్’... గతంలో దిగ్విజయ్ ‘ఆర్ఎస్ఎస్’ ప్రచారం చేస్తున్న హింసాకాండ గురించి ‘హింస, ద్వేషం గురించి ప్రచారం చేసే ఈ సంస్థ తీవ్రవాదాన్ని కూడా ప్రచారం చేస్తుంద’ని విమర్శించారు. అంతేకాక ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ‘సంఘ్ టెర్రరిజమ్’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కానీ మీడియ మాత్రం దిగ్విజయ్ ‘హిందూ టెర్రరిజమ్’ అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని ప్రచారం చేసింది. బీజేపీ పార్టీ కూడా దిగ్విజయ్ చేసిన ‘సంఘ్ టెర్రరిజమ్’ వ్యాఖ్యలను హిందూ టెర్రరిజమ్ అంటూ ప్రచారం చేసింది. సంఘ్ కార్యకర్తలందరూ హిందువులేనని తెలిపింది. ‘సంఘ్ టెర్రరిజమ్’ అంటే ‘హిందూ టెర్రరిజమే’నంటూ దిగ్విజయ్ హిందువులైన సంఘ్ కార్యకర్తలను ఉగ్రవాదులతో పోల్చి వారి మనోభావాలను దెబ్బతీసారని మండిపడింది. -
ప్రణబ్ హితవచనాలు
భిన్న సిద్ధాంతాల, అవగాహనల మధ్య చర్చ జరగడం ఎప్పుడూ స్వాగతించదగిందే. ప్రజా స్వామ్య వ్యవస్థ మనుగడకు అది ఎంతో అవసరం. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరె స్సెస్) కార్యక్రమానికి రావాలంటూ ఆ సంస్థ నుంచి అందిన ఆహ్వానాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించినప్పటినుంచి ఆ విషయంలో వ్యక్తమైన అభిప్రాయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయిదు పదుల సుదీర్ఘ రాజకీయ జీవితంలో స్వల్పకాలం మినహా మొత్తం కాంగ్రెస్‌తోనే కలిసి ప్రయాణించిన ప్రణబ్ ఆ ఆహ్వానాన్ని ఎలా మన్నిస్తారని ప్రశ్నిం చినవారు కొందరైతే... వెళ్తే తప్పేమిటన్నవారు మరికొందరు. వద్దని కోరినవారిలో కాంగ్రెస్ వాదులు మాత్రమే కాదు... కమ్యూనిస్టులు, ఉదారవాదులు కూడా ఉన్నారు. చిదంబరం వంటి కాంగ్రెస్ నాయకులు ‘వెళ్తే వెళ్లండిగానీ, వారి సిద్ధాంతంలోని లోపాలేమిటో చెప్పి రండి’ అని ప్రణబ్‌కు హితబోధ చేశారు. మరికొందరు మాత్రం నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరారు. అధికారికంగా తన వైఖరేమిటో చెప్పని కాంగ్రెస్ చివరికొచ్చేసరికి మాత్రం అలా వెళ్లడం మహాపరాధం అన్నట్టు మాట్లాడింది. ‘మీనుంచి ఇలాంటిది ఆశించలేద’ంటూ సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ట్వీట్ చేశారు. ఎందుకైనా మంచిదని ప్రణబ్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్టతో కూడా ప్రణబ్‌కు వ్యతిరేకంగా ప్రకటన ఇప్పించారు. కానీ ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే ఆ పార్టీ గొంతు సవరించుకుని ప్రణబ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం గంభీరంగా సాగింది. రాష్ట్రపతిగా జాతినుద్దేశించి చేసిన ప్రసం గాల తరహాలోనే ఇది కూడా ఉంది. ఎవరికి వారు తమ తమ వైఖరులకు అనుగుణమైన అంశాలను వెదుక్కోవడానికి వీలుగానే ఉంది. ఆయన భారతీయ సమాజ మూలాల గురించి మాట్లాడారు. శిఖరాలనూ, సాగరాలనూ, ఎడారులనూ దాటుకుని మన సంస్కృతి, విశ్వాసాలు ప్రపంచంలోని నలుమూలలకూ విస్తరించిన వైనాన్ని ప్రస్తావించారు. జాతి, జాతీయతలను భౌగోళిక హద్దులు, భాష, మతం, తెగ వగైరా పరిమితులకు లోబడి చూడరాదని చెప్పారు. భారత జాతీయత కొందరికే పరిమితమైన భావన కాదని, దానికి దూకుడు లేదా విధ్వంసకర స్వభావాలు లేవని చెప్పిన మహాత్మా గాంధీతోపాటు... హిందూ, ముస్లిం, సిక్కు తదితర సమూ హాల సైద్ధాంతిక సమ్మేళనమే భారత జాతీయతగా నిర్వచించిన జవహర్లాల్ నెహ్రూనూ గుర్తు చేశారు. బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా ఈ నేల నాలుగుచెరగులా వ్యాపించిన పోరాటాల సమష్టితత్వం వ్యక్తిగత, సైద్ధాంతిక, రాజకీయ పాయలకు అతీతంగా దేశభక్తిని ప్రేరేపించిందని వివరించారు. మన రాజ్యాంగం నుంచే మన జాతీయత ఆవిర్భవించిందని నొక్కిచెప్పారు. భిన్నాభిప్రాయాల మధ్య సంవాదం అవసరమని, అవి ఉండొద్దనుకోవడం సరికాదని హితవు పలికారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప అసహనం, ద్వేషం, హింస కూడదని తెలి పారు. సంగమం, సమీకరణం, సహజీవనాల సుదీర్ఘ ప్రక్రియ నుంచే ఈ జాతి రూపు దిద్దు కున్నదని వివరించారు. అయితే ‘భరతమాత మహోన్నత పుత్రుడి’గా ప్రణబ్ అభివర్ణించిన ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ అభిప్రాయాల్లో చాలావాటికి ఇవి భిన్నమైనవి. ఉదాహరణకు ‘రాజ్యాంగ జాతీయత’ను ఆరెస్సెస్ అంగీకరించదు. ఈ గడ్డపై పురాతన కాలం నుంచే ఇది కొనసాగుతూ వస్తున్నదని చెబుతుంది. జాతీయతకు సంబంధించిన ఈ భిన్నమైన అభిప్రాయాల్లో తన వైఖరిలోని సహేతుకతను గురించి ప్రణబ్ స్పృశించలేదు. ఆయనే చెప్పి నట్టు ఇలా భిన్నాభిప్రాయాలుండటం, అవి వ్యక్తం కావడం, వాటిపై చర్చ జరగడం ఇప్పటి పరి స్థితుల్లో ఎంతో అవసరం. ఈ ప్రసంగంలో ఎక్కడా ప్రణబ్ వర్తమానంలో కనబడుతున్న విభిన్న ఆచరణల గురించి, అవి పోతున్న పోకడల గురించి, వాటి పర్యవసానంగా సంభవించిన విషాద ఉదంతాల గురించి, అందులోని మంచిచెడ్డల గురించి ప్రస్తావించలేదు. ప్రణబ్ ఆ పని చేసి ఉంటే బహుశా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ఆ వేదికపై నుంచే ఆ అంశాలపై తమ వైఖరేమిటో వివరించేవారు. 2007లో అప్పటి ఆరెస్సెస్ చీఫ్ కేఎస్ సుదర్శన్ ఆహ్వానంపై ఇలాంటి సమావేశానికే ప్రధాన అతిథిగా వెళ్లిన వైమానిక దళ మాజీ ప్రధానాధికారి ఏవై టిప్నిస్ ఆ సంస్థ ఆచరణపై, దాని సిద్ధాంతాలపై తన అభిప్రాయాలు చెప్పడం, అందుకు సుదర్శన్ సమాధానమివ్వడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అయితే ప్రణబ్ నిష్కర్షగా తన అభి ప్రాయాలు చెప్పిన సందర్భాలున్నాయి. యూపీలోని దాద్రిలో గొడ్డు మాంసం తింటున్నారని అనుమానం వచ్చి ఒక కుటుంబంపై దాడిచేసి ఆ కుటుంబ పెద్దను కొట్టి చంపిన ఉదంతం జరిగినప్పుడు రాష్ట్రపతిగా ప్రణబ్ దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రంగా ఖండించారు. ప్రణబ్ ప్రసంగానికి ముందు మాట్లాడిన భాగవత్ తమ సంస్థ ఏ ఒక్క వర్గానికో పరిమి తమైనది కాదని చెప్పడంతోపాటు అందరినీ కలుపుకొని వెళ్తామని వివరించారు. ప్రజల మత విశ్వాసాలతో తమకు పని లేదని, అందరి సహకారంతో దేశాన్ని ‘విశ్వ గురు’గా నిలపడమే ధ్యేయమని తెలిపారు. ప్రణబ్ ఈ సమావేశానికి రావడంపై చెలరేగిన దుమారాన్ని ప్రస్తా వించి... ఈ కార్యక్రమం తర్వాత కూడా ప్రణబ్ ప్రణబ్‌గానే ఉంటారని, సంఘ్ సంఘ్‌గానే ఉంటుందని మోహన్ భాగవత్ చెప్పారు. అయితే మార్పునకు ఎవరూ అతీతం కాదు. పర స్పరం ప్రభావితం కానివేవీ ఉండవు. ఎల్లకాలమూ ఎవరికి వారుగానే ఉండటం సాధ్యమూ కాదు. కొన్నేళ్లక్రితం ఆరెస్సెస్ నుంచి ఇలాంటి ఆహ్వానమే వచ్చి ఉంటే ప్రణబ్ అంగీ కరించేవారా? అసలు ఆరెస్సెస్ ఆయన్ను పిలిచేదా? హెడ్గేవార్ అభిప్రాయాలకూ, ఇప్పుడు మోహన్ భాగవత్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలకూ మధ్యనే ఎంతో వ్యత్యాసముంది. అయితే ఆరెస్సెస్ వేదికపై ప్రసంగించినంతమాత్రాన వారితో ప్రణబ్‌కు ఏకీభావమున్నదని అనుకో వడం లేదా ఆ సంస్థ ఈ సందర్భాన్ని తనకనుకూలంగా మలచుకుంటుందన్న వాదన సరికాదు. ఎవరేం చెప్పినా అంతిమంగా ఆచరణే అన్నిటికీ గీటురాయి. దాన్నిబట్టే ఎవరికైనా అభిప్రా యాలు ఏర్పడతాయి. ప్రణబ్ చెప్పారనో, ఆరెస్సెస్ చెప్పుకున్నదనో ఎవరూ దేనిపైనా నిర్ణ యానికి రారు. మొత్తానికి ప్రణబ్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపిందని చెప్పాలి. దేశ రాజకీయాలపై దీని ప్రభావం ముందూ, మునుపూ ఎలా ఉంటుందో చూడాలి. -
‘నమాజ్‌లను అడ్డుకున్న హిందూ సంస్థలు’
సాక్షి, న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు నమాజ్‌లు చేయడాన్ని తాము పలుచోట్ల అడ్డుకున్నామని హర్యానాలోని గుర్గావ్కు చెందిన హిందూ సంస్థలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో గుర్గావ్ సమీపంలో 10 బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లను సంయుక్త్ హిందూ సంఘర్ష్ సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమితిలో భజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్, శివ్‌సేన, హిందూ జాగరణ్ మంచ్ తదితర పన్నెండు హిందూ సంస్థలున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని అఖిల భారత హిందూ క్రాంతి దళ్ జాతీయ సమన్వయకర్త రాజీవ్ మిట్టల్ పేర్కొన్నారు. అధికారుల నుంచి అనుమతి తీసుకుని ప్రార్థనలు జరుపుకోవాలని తాము కోరామని, ఈ సందర్భంగా శాంతిభద్రతల సమస్య ఎక్కడా తలెత్తలేదని చెప్పారు. కాగా, గుర్గావ్ సెక్టార్ 53లోని రెండు గ్రామాల్లో 700 మంది మస్లింలు ఇటీవల బహిరంగ ప్రదేశంలో నమాజ్ చేయడాన్ని స్ధానికులు నిలిపివేసిన నేపథ్యంలో తాజా ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ స్థలంలో ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటున్నారని గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నమాజ్‌లను భగ్నం చేశారంటూ తమకు ఎక్కడా ఫిర్యాదు అందలేదని గుర్గావ్ పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడం తమ బాధ్యతని, ప్రార్థనలు ఎక్కడ నిర్వహించాలనేది జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు. -
ఆరెస్సెస్ కార్యాలయంపై హిందూ శ్రేణుల దాడి!
ధార్: మధ్యప్రదేశ్ ధార్‌లోని త్రిమూర్తినగర్‌లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యాలయంపై హిందూ కార్యకర్తలు శుక్రవారం దాడి చేశారు. కార్యాలయంపై రాళ్లు రువ్వి.. కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. బసంత పంచమీ సందర్భంగా ఇక్కడి భోజ్‌శాల కమల్ మౌలా మసీదు విషయమై వివాదం తలెత్తింది. ఈ ప్రాంగణంలో ఏకకాలంలో పూజలు చేసేందుకు హిందువులు, ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు రావడంతో శుక్రవారం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో భోజ్‌శాలలోకి ప్రవేశించవద్దని ఆరెస్సెస్ నాయకత్వంతోపాటు, ధర్మ జాగరణ్ మంచ్, భోజ్ ఉత్సవ సమితి హిందువులకు పిలుపునిచ్చింది. దీనిపై హిందూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆరెస్సెస్ నాయకులు భోజ్‌శాలను అమ్మేశారంటూ మండిపడ్డారు. స్థానిక ఆరెస్సెస్ నాయకుడు విజయ్‌సింగ్ రాథోడ్ ఇంటి వద్ద భారీగా మూగి ఆందోళన చేసేందుకు వారు ప్రయత్నించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం విజయ్‌సింగ్ రాథోడ్ బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కయి.. ఈ వ్యవహారంలో ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ వారు నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజ్‌శాలలోకి ప్రవేశించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆరెస్సెస్ నాయకత్వం తీరుపై మండిపడుతూ హిందూ కార్యకర్తలు ఆ సంస్థ కార్యాలయంపై దాడి దిగారు.