మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పార్లమెంటరీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్.. హిందూ కార్యకర్తల హత్యల గురించి మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హిందువులకు తమపై దాడి చేసిన వారిపై స్పందించే హక్కు ఉందని, అది వారి గౌరవానికి సంబంధించినదని అన్నారు. అలాగే తమను తాము రక్షించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉన్నందున ఇంట్లో పదునైనా కత్తులు పెట్టుకోవాంటూ పిలుపునిచ్చారు. లవ్ పేరుతో కొందరు జిహాద్ చేస్తున్నారని అందులో ప్రేమ మాత్రం ఉండదని అన్నారు.
ఈ మేరకు ప్రగ్యా ఆదివారం జరిగిన సౌత్ రీజియన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... దేవుడు సృష్టించిన ఈ లోకంలో అణిచివేతదారులను, పాపాత్ములను అంతం చేయాలని లేదంటే ప్రేమకు నిజమైన నిర్వచనం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో తమపై దాడి చేసిన వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పండి. అంతేగాదు లవ్ జిహాద్ పేరుతో బలవుతున్న అమ్మాయిలను రక్షించండి. బాలికలకు సరైన విలువలు నేర్పండి. శివమొగ్గకు చెందిన హర్షతో సహా హిందువుల కార్యకర్తల హత్యల గురించి ప్రస్తావిస్తూ... స్వీయ రక్షణ కోసం ఇంట్లోని కత్తులనైనా పదును పెట్టుకోవాలన్నారు.
ఇంట్లో ఆయుధాలైనా ఉంచుకోండి లేదా కూరగాయాల కోసం ఉపయోగించే పదునైన కత్తులైనా రెడీగా ఉంచుకోండి అని చెప్పారు. ఎప్పుడూ ఎలాంటి పరిస్థిత వస్తుందో తెలియదు కాబట్టి దాడి చేసినప్పుడు వారికి తగిన రీతిలో రిప్లై ఇవ్వడం మన హక్కు అని చెప్పారు. అలాగే మీ పిల్లలను మిషనరీ సంస్థల్లో చదివించకండి అలా చేస్తే తల్లిదండ్రులను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పంపుతారు, స్వార్థపరులుగా మారిపోతారంటూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పిల్లలకు ధర్మం గురించి, శాస్త్రల ప్రాముఖ్యత గురించి తెలియజేయండి. తద్వారా పిల్లలు మన సంస్కృతి, విలువలు గురించి తెలుసుకుంటారని ప్రగ్యా సింగ్ ఠాకూర్ అన్నారు.
(చదవండి: నడి రోడ్డుపై అడ్డగించి మరీ...మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..)
Comments
Please login to add a commentAdd a comment