ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోగల త్రివేణీ సంగమంలో భక్తులు మహాకుంభమేళా స్నానాలను ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఉత్సవం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగనుంది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా తరలివస్తున్నారు. వీరిలో స్వామీజీలు కూడా ఉండటం విశేషం.
కుంభమేళాలోని 17వ సెక్టార్‌లో ఉన్న శక్తిధామ్ ప్రత్యేకమైన ఆశ్రమంగా పేరొందింది. ఈ ఆశ్రమంలోని తొమ్మిది మంది విదేశాలకు చెందిన మహామండలేశ్వరులు ఉన్నారు. వీరు సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఈ మహామండలేశ్వరులంతా హిందూధర్మాన్ని స్వీకరించారు. వీరిలో అమెరికా, ఇజ్రాయెల్ జపాన్‌కు చెందినవారున్నారు. ఈ తొమ్మిదిమంది మహామండలేశ్వరులలో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
అమెరికాలో నివసిస్తున్న మహామండలేశ్వర్ అనంత్ దాస్ మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ తాను అమెరికాలో ఉంటున్న సాయి మాతను కలుసుకున్నానని తెలిపారు. ఆ తరువాత తాను సనాతన ధర్మానికి అమితంగా ప్రభావితుడనయ్యానని అన్నారు. వెనువెంటనే సాయి మా ఆశ్రమంలో చేరానని, కొద్దిరోజుల తరువాత వారణాసికి వచ్చి, శక్తిధామ ఆశ్రమంలో మహామండలేశ్వర్ దీక్ష తీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తాను విద్యాబోధనతో పాటు యోగా నేర్పిస్తున్నానని, విదేశీయులను సనాతన ధర్మంతో అనుసంధానించడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.
ఇది కూడా చదవండి: నేడు కుంభమేళాకు గౌతమ్ అదాని.. సంస్థ అందిస్తున్న సేవలివే..
Comments
Please login to add a commentAdd a comment