శ్రీరాముడిపై వ్యాఖ్యలు: కత్తి మహేశ్‌పై కేసు | Case Filed Against Kathi Mahesh Over His Controversial Comments on Srirama | Sakshi
Sakshi News home page

శ్రీరాముడిపై వ్యాఖ్యలు: కత్తి మహేశ్‌పై కేసు

Published Sat, Jun 30 2018 1:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Case Filed Against Kathi Mahesh Over His Controversial Comments on Srirama - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై కేసు నమోదైంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌  ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’  అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement