sriramudu
-
సంచలనం కోసమే ‘కత్తి’ మాట్లాడుతున్నారు
హైదరాబాద్ : హిందువుల పట్ల జరిగిన సంఘటనకు దేశ విదేశాల్లో ఉన్న హిందువులు అందరూ ఆవేదనకు గురయ్యారని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆదివారం పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రాముడు ఒక దగుల్భాజీ అని, సీత రాముని కన్నా రావణాసురుడి దగ్గర ఉంటేనే ఎక్కువ సుఖపడేదని కత్తి మహేశ్ ఆరోపణలు చేయడం చూస్తుంటే..ఆయన సంచలనం కోసమే ఇలా మాట్లాడుతున్నాడని తెలుస్తోందని అన్నారు. కత్తి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సీతమ్మను దూషించడం అంటే యావత్ స్త్రీ జాతిని అనడమేనన్నారు. రాజ్యాంగంలో శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టడానికి కారణం..రాముడు చర్రిత కారుడు అని చెప్పడానికేనని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా అని ప్రశ్నించారు. పైశాచిక ఆనందం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కత్తి మహేశ్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది దేశద్రోహం..బడుగు బలహీన వర్గాల ముసుగులో మహేశ్ ఈవిధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రామనామ స్మరణ చేస్తూ అన్ని వర్గాల వారు రేపు(సోమవారం) తనతో పాదయాత్ర చేస్తారని తెలిపారు. కత్తి మహేశ్ మాటల వెనక కుట్ర ఉందని, కులాల అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. . ‘ నీకు ఎలా సమాధానం చెప్పాలో మా వాళ్ల దగ్గర ఉపాయాలు ఉన్నాయ్. పోలీసులు, ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పి బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కత్తి మహేష్ వ్యాఖ్యలకు రెండు రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలి. ప్రతి శ్రీరామ నవమికి ఇద్దరు సీఎంలు దగుల్బాజీల దగ్గరకు పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నారో చెప్పాలి. ఎవరు ఏ మతం మీద దాడి చేసినా ప్రభుత్వం సెక్యులర్‌గా పని చేయాలి. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి. నీవు హిందువు కాదు, శ్రీరాముడిని దూషించిన వారు ఎవరూ హిందువులు కాదు. రేపు(సోమవారం) బషీర్ బాగ్ నుంచి యాదగిరిగుట్ట వరకు ధర్మాగ్రహా యాత్ర చేస్తాం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీరాముడికి పాలాభిషేకం చేస్తాం. సాధువులకు నిగ్రహం అవసరం అంటున్నారు. ధర్మ పరిరక్షణకు మేము సైనికులము అవుతా’ మని హెచ్చరించారు. -
శ్రీరాముడిపై వ్యాఖ్యలు: కత్తి మహేశ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్ : సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై కేసు నమోదైంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై నగరంలోని కేబీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్ ఫోన్ ఇన్‌లో మాట్లాడుతూ..‘ రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
లక్ష్మణుడు ఎందుకు నవ్వాడు?
రావణుడు మరణించిన తరువాత కపి సైన్యంతో విభీషణ, అంగద, సుగ్రీవులతో, సీతాలక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటున్నాడు రాముడు. శ్రీ రామ పట్టాభిషేకం అట్టహాసంగా జరుగుతోంది. రాముని పక్కనే సింహాసనానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఉన్నట్టుండి తనలో తనే నవ్వుకున్నాడు. అది అందరూ చూశారు. ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొక్కరూ ఒకలా అనుకున్నారా నవ్వు చూసి. ఆనాడు రాముడిని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని, భరతునితో తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక. సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసి నవ్వేడేమో అనుకున్నాడట. తండ్రిని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు. ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళిగా నన్ను చూసి నవ్వేడా అనుకున్నాడట విభీషణుడు. రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట. ముందు వెనక ఆలోచించకుండా బంగారు లేడిని తెమ్మని కోరి, చేజేతులా ఇన్ని కష్టాలను కొని తెచ్చినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత. బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్లి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట. అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్థాలకు దారి తీస్తుందని లక్ష్మణుని‘ఎందుకు నవ్వేవు సోదరా?‘ అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర ‘అన్నా!’ సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండా ఉండాలని నిద్రాదేవిని నన్ను వనవాస సమయంలో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని ఒక వరం అడిగాను. అందుకామె సరేనని సమ్మతించి, ‘పదునాలుగేళ్లయిన తరువాత నిన్ను ఆవహిస్తానని’ వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు‘ అన్నాడు. దానితో అందరూ తమ తమ మనసులలో అనుకున్నది నిజం కాదని, అనవసరంగా భయపడ్డామనుకుని మనసారా నవ్వుకున్నారట. జీవితంలో మనకు కూడా ఇలాంటి సందర్భాలనేకం ఎదురవుతుంటాయి. ఎవరో ఎందుకో నవ్వుకోవడం లేదా ఎవరి మీదనో చిర్రుబుర్రులాడటం, అసందర్భంగా ఆవులించడం, కళ్లు తుడుచుకోవడం, ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు. దానికి రకరకాల కారణాలు వెతుక్కుని, మనలో మనం మథన పడకుండా ఉంటే సరిపోతుంది కదా! –డి.వి.ఆర్. -
స్మరణీయం.... రమణీయం
ఆత్మీయం శ్రీరాముడు సకల గుణాభిరాముడు. మానవుడిగా పుట్టినా, మంచిలక్షణాలను, ధర్మప్రవర్తనను కలిగి ఉండటం వల్ల దేవుడిగా కొనియాడబడ్డాడు. మొదటి మంచి లక్షణంగా చెప్పుకోవాలంటే, పితృవాక్యపరిపాలకుడు. లేలేత వయసులో ఉన్నప్పుడే విశ్వామిత్రుడు వచ్చి, యాగరక్షణ కోసం తనను పంపమని తండ్రిని అడిగినప్పుడు లక్ష్మణునితో కలసి మౌనంగా విశ్వామిత్రుని వెంట నడిచాడు. సీతాస్వయంవరంలో శివధనుర్భంగం చేసి, సీతను గెలుచుకున్నప్పుడు కూడా తనంతట తాను ఆమెను పరిణయం చేసుకోలేదు. గురువు ద్వారా తలిదండ్రులకు సమాచారాన్ని తెలియజేసి, వారు వచ్చిన తర్వాతనే వివాహం చేసుకున్నాడు. అయోధ్యానగరానికి రాజయ్యాకా, అంతకు ముందూ కూడా తాను దశరథ తనయుడనని తప్ప రాజునని ఏనాడూ చెప్పుకోలేదు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం మరికొద్దిసేపటిలో యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన వాడు కూడా వనవాసం చేసేందుకు సిద్ధపడ్డాడు. తన వనవాసానికి కారకురాలైన సవతి తల్లి కైకను పన్నెత్తి ఒక్కమాట అనలేదు. కన్నతల్లి కౌసల్యను ఎంతగా ప్రేమించాడో, సుమిత్రను, కైకను కూడా అంతగా ప్రేమించాడు. గౌరవించాడు. వనవాస సమయంలో తండ్రి మృతి చెందాడన్న వార్తను తెలుసుకుని ఎంతగానో దుఃఖించాడు. పెద్దకుమారుడిగా ఆయనకు తానే శ్రాద్ధకర్మలు నిర్వర్తించాడు. జటాయువు తండ్రికి స్నేహితుడని తెలుసుకుని, జటాయువుకు కూడా శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వర్తించాడు. అంతేకాదు, మంచిశిష్యుడు, మంచి భర్త, మంచి స్నేహితుడు, మంచి సోదరుడు, స్ఫూర్తిప్రదాత. దేవుళ్లను పూజించడమే కాదు, వారిలోని మంచి లక్షణాలను కూడా అలవరచుకోవాలి. అనుసరించాలి. అప్పుడే ఆ భక్తికి అర్థం... పరమార్థం. -
సగుణం నిర్గుణం
జ్యోతిర్మయం నహి తస్మాన్మనః క శ్చిచ్చక్షుషీ వా నరోత్తమాత్, నరః శక్నోత్యపాకృష్టుమతిక్రాంతేపి రాఘవః ‘మీ పిన తల్లి కైకేయీ దేవి, మీ తండ్రి దశరథ మహారాజు మిమ్మల్ని కలవ కాంక్షిస్తున్నారు’ అన్న సుమంత్రుని సందేశాన్ని అందుకొని, శ్రీరాముడు పితృ మందిరానికి బయలుదేరాడు. రామచంద్రమూర్తి రాజమార్గం గుండా వెళ్లను న్నాడన్న సమాచారాన్ని విని, వేలాది అయోధ్యా పౌరు లు మార్గం ఇరువైపులా బారులు తీరి భక్తి ప్రపత్తులతో అంజలి ఘటించి ఉన్నారు. రథం ముందుకు సాగుతోంది. రథంపై రామభ ద్రుడు ఆసీనుడై ఉన్నాడు. పౌరులు సంస్తుతిస్తున్నారు. అయోధ్యాకాంతలు భవనాలపెకైక్కి పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. అన్ని దృక్కులూ రామునిపైనే కేంద్రీకృ తమై ఉన్నాయి. అన్ని మనస్సులూ రామ పాదాలకు ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా హర్షాతి రేకాలే. రామ నామస్మరణమే. శ్రీరాముని రథం మరింత ముందుకు సాగిపో యింది. దృక్కుల కందని దూరానికి సాగిపోయింది. అయినప్పటికీ పౌరుల దృక్కులూ, మనస్సులూ వెనుది రగలేకపోయాయి. పౌరులు ఆ నరశ్రేష్ఠుని నుండి దృక్కుల్నీ మనసుల్నీ మరల్చ అశ క్తులై నిశ్చేష్ఠులై నిలిచిపో యారు. ఇదీ శ్రీమద్రామయణం లో అయోధ్యాకాండలో వాల్మీకి మహర్షి అభివర్ణించిన ఒక ఘట్టం. ఇందులో పౌరుల భక్తి పారవశ్యం కళ్లకు కడుతోంది. సగుణ సాకారమూర్తి అయిన రామచంద్రమూర్తి రూపాన్ని వీడలేని భక్తుల దృక్కుల, మనస్సుల అశక్తతను అతి మనోజ్ఞంగా వర్ణిం చాడు వాల్మీకి. సగుణ సాకారమూర్తి సంస్మరణం లోని మహత్తర శక్తిని అభివర్ణించాడు వాల్మీకి మహర్షి ఈ ఘట్టంలో. ‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ,’... నిర్గుణ నిరాకార పరబ్రహ్మను పొందాలని బయలుదేరిన వాక్కులు, దృక్కులు, అంతరింద్రియం, ఆ పరబ్రహ్మను పొందలేక వెనుదిరిగాయి అంటున్నది తైత్తిరీయోపనిషత్తు. సగుణ సాకారమూర్తి సంస్మరణంలోని, సందర్శ నంలోని సౌలభ్యాన్ని రామాయణం విశదీకరిస్తే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సాక్షాత్కారంలోని సంక్లిష్ట తను వివరించింది తైత్తిరీయోపనిషత్తు. ‘ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ చామృతం చ స్థితం చ యచ్చ సచ్చ త్య్రచ్చ, పర బ్రహ్మకు రెండు రూపాలూ ఉన్నాయి. సగుణం నిర్గు ణం మర్త్యం అమృతం చలం అచలం అపరోక్షం పరో క్షం’ అన్నది బృహదారణ్యక ఉపనిషత్తు. ఆదిశంకరులు సూత్రభాష్యంలో ‘భేదస్యోపాసనార్థత్వాద భేదో తాత్ప ర్యాత్, సగుణం భేదం ఉపాసన కొరకే, తత్వం మాత్రం నిర్గుణమే’ అన్నారు. వాస్తవం నిర్గుణమే అయినా, తొలిదశలో సాధ నలో సగుణమే గ్రాహ్యం. సగుణం అన్న పునాదిపైనే దివ్యసౌధాన్ని నిలపాలి అన్నది ఆర్షసమ్మతం. అం దుకే ముందు సగుణారాధనతో సాధన సాగిద్దాం. నిర్గుణారాధన అన్న శిఖరాగ్రానికి చేరుదాం. సంక ల్పించండి. సాధించండి. పరమాత్ముని -
సుఖదుఃఖాలు
జ్యోతిర్మయం రాజవుతాడనుకున్న రాముడు నారచీరల్ని కట్టి వనానికి బయలుదేరాడు. ఇంక కొన్నేళ్లు కనిపించడు. అడవుల్లో పడరాని పాట్లు పడతాడు. దుఃఖంలో మొదలు నరికిన చెట్టులా కౌసల్యాదేవి నేల కూలింది. తల్లిని రాముడు లేవనెత్తాడు. ప్రేమగా నిమిరాడు. ఈ పుత్ర ప్రేమ దూరం కాబోతున్నదన్న ఆవేదనలో - యది పుత్ర న జా యేథా మమ శోకాయ రాఘవ, న స్మ దుఃఖమతో భూయః పశ్యేయమహమ్రపజాః ‘ఓ రామా! ఇంతటి దుఃఖాన్ని కలిగించడానికి నీవు పుట్టకపోయినా బాగుండేది. అప్పుడు పిల్లలు లేర న్న ఒక్క దుఃఖమే ఉండేది. ప్రజారంజకుడైన పుత్రుడు, సర్వాన్నీ వీడి అడవులకు పోతున్నాడన్న దుఃఖంతో పోలిస్తే, గొడ్రాలినన్న దుఃఖం అత్యల్పమైందే!’ అని కౌసల్యాదేవి ఆక్రోశించింది. ఆ క్షణంలో కౌలస్యకు రాముడు అడవులకు వెళ్తు న్నాడని మాత్రమే తెలుసు. భోగాలకు దూరమై అడవుల్లో కష్టాలు పడబోతున్నాడని మాత్రమే తెలుసు. కానీ వన వాస సమయంలో సీతను రావణుడు అపహరిస్తాడని, రామాంజనేయ సంయోగం ఘటింపనున్నదని, రాక్షస సంహారం జరగనున్నదని, లోకాలన్నీ సుఖించ గలవనీ, తెలియదు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణ కథా లోకేషు ప్రచురిష్యతి. భూతలంలో పర్వతాలు, నదులూ ఉన్నంత కా లం, రామాయణ గాథ, కౌసల్యా తనయుడైన శ్రీరామ కథ, లోకంలో వ్యాపించి ఉంటుం దని, ఈ గాథ వేదతుల్యమై పరమ పవిత్రమై పాప వినాశకమై పుణ్య ప్రదాయకమై భాసిల్లకలదని కౌస ల్యకు తెలియదు. రాముడు అడవు లకు వెళ్తున్నాడన్న సమయంలో కౌసల్యకు ప్రాప్తించిన దుఃఖం వెనుక ఇంతటి మహా సుఖం దాగి ఉంది. కనుక కౌసల్య దుఃఖం దుఃఖం కానే కాదు. కేవలం దుఃఖ ఆభాసయే! దుఃఖం కాకపోయినా దుఃఖంలా తాత్కాలికంగా పరితపింపచేసేదే! అలాగే సీతను అపహరించినప్పుడు, మార్గమధ్యం లో అడ్డుకున్న జటాయువు రెక్కల్ని విరిచి నేలకూల్చి నప్పుడు, సీతను తెచ్చి అశోకవనంలో ఉంచినప్పుడు, రావణుడు విజేతనయినానన్న మహా సుఖానుభూతిని పొందాడు. కానీ ఈ సుఖానుభూతి నీడలో, తన మర ణం అన్న మహాదుఃఖం దాగి ఉన్నదని, ఆనాడు రావణు నకు తెలియదు. కనుక ఆ నాటి రావణుని సుఖం సుఖం కానేకాదు. కేవలం సుఖాభాసయే. సుఖం కాక పోయినా తాత్కాలికంగా ఆనందింప చేసేదే! తరతరాలుగా రామాయణ గాథను నరనరాల్లో జీర్ణించుకున్న మనం, సుఖాలకు పొంగి పరవశింప గూడదనీ, దుఃఖాలకు తల్లడిల్లి నిర్వేదాన్ని పొందకూ డదనీ, తెలుసుకోవాలి. దుఃఖాలన్నీ నిజమైన దుఃఖాలు కావు, సుఖాలన్నీ నిజమైన సుఖాలు కావు, అన్న స్పృహ కలిగి ఉండాలి. కష్టాల్లో దిగులు చెందని వాడు, సుఖాల్లో పరవశింపని వాడు, రాగమూ భయమూ క్రోధమూ లేనివాడే ధీరుడనీ, ముని అనీ, అందుకే భగ వద్గీత అన్నది. కనుక రామాయణాన్ని పఠిద్దాం, గీతను అధ్యయనం చేద్దాం, ధీరులమై నిలుద్దాం. పరమాత్ముని -
నేడు శ్రీరామనవమి
మంచిర్యాల అర్బన్/ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : శ్రీ సీతారాముల కల్యాణం అంతటా కన్నులపండువగా జరుపుకుంటారు. సీతారాముల కల్యాణాన్ని భక్తులు లోక కల్యాణంగా భావిస్తుంటారు. మిథిలా రాజ్య పాలకుడు జనక మహరాజు తనయ సీతాదేవి. శ్రీరాముడు శివ ధనస్సు విరిచి సీతను వివాహామాడుతాడు. వారి కల్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అందుకే త్రేతాయుగం నాటి రామాయణాన్ని వాల్మికీ రాసి లక్ష వసంతాలు అవుతున్నా ఇప్పటికి సీతారాముల కల్యాణాన్ని భక్తులు తమ ఇంటిలో వివాహ వేడుకలా భావిస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళ సూత్రధారణ, తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ.. తదితర ఘట్టాలు అంగరంగవైభంగా నిర్వహిస్తారు. మానవాళికి ఆదర్శ దంపతులైన సీతారాముల కల్యాణం చూసినా ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు. ఏకపత్ని వ్రతుడు... శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. సీతాదేవిని తప్ప పర స్త్రీని ఎరగని యుగపురుషుడు. సీతాదేవికి దూరమయ్యాక రాముడు తల్లడిల్లిపోతాడు. అశ్వమేధ యాగం సందర్భంగా సీతాదేవి విగ్రహంతో యాగం చేస్తాడు. పితృ వాక్య పరిపాలన దక్షుడు శ్రీరాముడు మంచి భర్తే కాదు తండ్రి మాట జవదాటని పుత్రుడు కూడా. అందుకే ఆయనకు పితృవాక్య పరిపాలకుడన్న పేరుంది. తండ్రి దశరథునికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని, పాలనను త్యజించి వనవాసం చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి మాటను గౌరవించాలే తప్ప ఎదురు చెప్పవద్దనే నీతి ధర్మాన్ని శ్రీరాముడు బోధించాడు. రాజ్య పాలన కోసం తగువు పెట్టుకోలేదు. తమ్ముళ్లనే రాజ్యం ఏలాలని సూచించాడు. రాముడు వనవాసానికి వెళితే సోదరుడు లక్ష్మణుడు కూడా వెంట ఉన్నాడు. భరతునికీ రాముడంటే ఎంతో గౌరవం, భక్తిభావం. సోదరులంతా ఐక్యంగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలకు ఆరాధ్యుడు శ్రీరాముడు. సకల గుణాభిరాముడు. శ్రీరామునికి సకల గుణాభిరాముడనే నామకరణం ఉంది. ఏ కోణం నుంచి చూసినా సద్గుణాలు తప్ప దుర్గుణాలనేవి మచ్చుకైనా కనిపించవు. పితృ వాక్య పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతునిగా, ప్రజాపరిపాలకుడిగా, గురువుగా, సోదరునిగా, తండ్రిగా, యుద్ధ వీరునిగా ఖ్యాతి గడించారు. ఇప్పటికీ రాముడు మంచి బాలుడనే మాట వాడుకలో ఉంది. పరిపాలన దక్షునిగా పేరు సంపాదించారు. ఎవరైనా మంచి పాలన అందిస్తామనే బదులు గ్రామాన్ని రామరాజ్యంగా తీర్చిదిద్దుతామని అంటారు. అంటే రాముని పాలన ఎలా సాగిందో వాల్మికీ మహర్షి రామాయణంలో చక్కగా కీర్తించారు. వానర సేనకూ రాముడంటే అపారమైన భక్తిభావం ఉంది. సీతాదేవిని దశకంఠుడు అపహరించిన సమయంలో సముద్రంలో రామసేతు నిర్మించి లంకకు దారి చూపింది, అశోకవనంలో ఉన్న సీతమ్మను కనుగొన్నది వానరసేనే. ఇలా రాముడు అందరివాడుగా త్రేతా యుగం నుంచి కలియుగం వరకు ఆదర్శ పురుషుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. సత్యాన్ని నమ్ముకుని ప్రపంచాన్ని జయించి సత్యమేవ జయతే అనే సూక్తిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. విద్యుద్దీపాలతో అలంకరణ శ్రీరామ నవమి సందర్భంగా రామాలయాలు, ఇతర ఆల యాలు అందంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల వి ద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆవరణ లో, ఎదుట చలువ పందిళ్లు వేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆలయాల్లో ఇప్పటికే ప్రత్యేక పూజాకార్యక్రమాలు కొనసాగుతుండగా మంగళవారం శ్రీరామనవమి కోసం ఆ యా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. స్వామివారి కల్యాణానికి ప్రత్యేకంగా ముత్యాల పందిరి ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యా లు కల్పించారు. ఈ మేరకు మంచిర్యాల ఏసీసీలోని కోదండ రామాలయం, గౌతమినగర్‌లోని ఆలయం, సాయిబాబా ఆలయం, రైల్వే కాలనీలోని విశ్వనాథ ఆలయం, గర్మిళ్ల, హమాలివాడ, మారుతీనగర్‌లోని ఆలయాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని హౌసింగ్బోర్టుకాలనీ రామాలయం, చాంద(టి), మావల, తలమడుగు మండలం కజ్జర్లలోని రామాలయాలు, మల్లిఖార్జునస్వామి ఆలయాలు, నిర్మల్‌లోని బాగులవాడ, మందమర్రి మూడో జోన్‌లోని కోదండ రామాలయం, చెన్నూర్ మండల సుద్దాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, బోథ్ ప్రాంతాల్లోని రామాలయాలు, హనుమాన్ దేవస్థానాలు అందంగా ముస్తాబయ్యాయి. పానకం.. ప్రత్యేకం.. శ్రీరామ నవమి పర్వదినం రోజున పానకం ప్రత్యేకంగా ఉంటుంది. బెల్లం, మిరియాలు కలిపి పానకం తయారు చేస్తారు. వడ పప్పును ప్రసాదంగా ఆలయాల్లో భక్తులకు అందజేస్తారు.