సగుణం నిర్గుణం
జ్యోతిర్మయం
నహి తస్మాన్మనః క శ్చిచ్చక్షుషీ వా నరోత్తమాత్,
నరః శక్నోత్యపాకృష్టుమతిక్రాంతేపి రాఘవః
‘మీ పిన తల్లి కైకేయీ దేవి, మీ తండ్రి దశరథ మహారాజు మిమ్మల్ని కలవ కాంక్షిస్తున్నారు’ అన్న సుమంత్రుని సందేశాన్ని అందుకొని, శ్రీరాముడు పితృ మందిరానికి బయలుదేరాడు.
రామచంద్రమూర్తి రాజమార్గం గుండా వెళ్లను న్నాడన్న సమాచారాన్ని విని, వేలాది అయోధ్యా పౌరు లు మార్గం ఇరువైపులా బారులు తీరి భక్తి ప్రపత్తులతో అంజలి ఘటించి ఉన్నారు.
రథం ముందుకు సాగుతోంది. రథంపై రామభ ద్రుడు ఆసీనుడై ఉన్నాడు. పౌరులు సంస్తుతిస్తున్నారు. అయోధ్యాకాంతలు భవనాలపెకైక్కి పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. అన్ని దృక్కులూ రామునిపైనే కేంద్రీకృ తమై ఉన్నాయి. అన్ని మనస్సులూ రామ పాదాలకు ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా హర్షాతి రేకాలే. రామ నామస్మరణమే.
శ్రీరాముని రథం మరింత ముందుకు సాగిపో యింది. దృక్కుల కందని దూరానికి సాగిపోయింది. అయినప్పటికీ పౌరుల దృక్కులూ, మనస్సులూ వెనుది రగలేకపోయాయి. పౌరులు ఆ నరశ్రేష్ఠుని నుండి దృక్కుల్నీ మనసుల్నీ మరల్చ అశ క్తులై నిశ్చేష్ఠులై నిలిచిపో యారు.
ఇదీ శ్రీమద్రామయణం లో అయోధ్యాకాండలో వాల్మీకి మహర్షి అభివర్ణించిన ఒక ఘట్టం. ఇందులో పౌరుల భక్తి పారవశ్యం కళ్లకు కడుతోంది. సగుణ సాకారమూర్తి అయిన రామచంద్రమూర్తి రూపాన్ని వీడలేని భక్తుల దృక్కుల, మనస్సుల అశక్తతను అతి మనోజ్ఞంగా వర్ణిం చాడు వాల్మీకి. సగుణ సాకారమూర్తి సంస్మరణం లోని మహత్తర శక్తిని అభివర్ణించాడు వాల్మీకి మహర్షి ఈ ఘట్టంలో.
‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ,’... నిర్గుణ నిరాకార పరబ్రహ్మను పొందాలని బయలుదేరిన వాక్కులు, దృక్కులు, అంతరింద్రియం, ఆ పరబ్రహ్మను పొందలేక వెనుదిరిగాయి అంటున్నది తైత్తిరీయోపనిషత్తు.
సగుణ సాకారమూర్తి సంస్మరణంలోని, సందర్శ నంలోని సౌలభ్యాన్ని రామాయణం విశదీకరిస్తే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సాక్షాత్కారంలోని సంక్లిష్ట తను వివరించింది తైత్తిరీయోపనిషత్తు.
‘ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ చామృతం చ స్థితం చ యచ్చ సచ్చ త్య్రచ్చ, పర బ్రహ్మకు రెండు రూపాలూ ఉన్నాయి. సగుణం నిర్గు ణం మర్త్యం అమృతం చలం అచలం అపరోక్షం పరో క్షం’ అన్నది బృహదారణ్యక ఉపనిషత్తు. ఆదిశంకరులు సూత్రభాష్యంలో ‘భేదస్యోపాసనార్థత్వాద భేదో తాత్ప ర్యాత్, సగుణం భేదం ఉపాసన కొరకే, తత్వం మాత్రం నిర్గుణమే’ అన్నారు.
వాస్తవం నిర్గుణమే అయినా, తొలిదశలో సాధ నలో సగుణమే గ్రాహ్యం. సగుణం అన్న పునాదిపైనే దివ్యసౌధాన్ని నిలపాలి అన్నది ఆర్షసమ్మతం. అం దుకే ముందు సగుణారాధనతో సాధన సాగిద్దాం. నిర్గుణారాధన అన్న శిఖరాగ్రానికి చేరుదాం. సంక ల్పించండి. సాధించండి.
పరమాత్ముని