జై వీరహనుమాన్
జ్యోతిర్మయం
హిందీ సాహిత్య గగనంలో చంద్రునిగా కీర్తినం దుకున్న భక్త కవి తులసీదాస్ రచించిన ‘హనుమాన్ చాలీసా’ హనుమంతుని సమగ్ర స్వరూపాన్నీ మహా త్మ్యాన్నీ అభివర్ణిస్తుంది. ఈ చాలీసా యావత్ భార తీయ భక్తజనుల నాల్కలపై నర్తిస్తుందనడం అతి శయోక్తి కాదు.
ఈ చాలీసా ఆరంభంలోనే హనుమంతుని ‘జ్ఞాన గుణసాగర’ అని సంబోధించింది. హనుమంతుని జ్ఞానం అంతులేని సాగరం వంటిదని అర్థం. ఆ జ్ఞాన మే ముల్లోకాల్ని జాగృతం చేస్తుందని చెప్తూ ‘తిహులోక ఉజాగర’ అని జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మగా ఈ స్తోత్రరాజం కీర్తించింది. ఆ జ్ఞానమే దేహాత్మబుద్ధి జీవా త్మబుద్ధితో కూడిన కుమతిని తొలగించి ఆత్మబుద్ధి అనే సుమతిని కలిగిస్తుందని ధ్రువీకరిస్తూ ‘కుమతినివార సుమతికే సంగీ’ అని ఆ కపీశుణ్ణి శ్లాఘించింది.
సాగరోల్లంఘన చేసి లంకలో హనుమంతుడు ప్రదర్శించిన ధైర్యాన్నీ పరాక్రమాన్నీ సమయోచిత చాతుర్యాన్నీ ఈ చాలీసా వేనోళ్ల శ్లాఘించింది. హను మంతుడు ‘రామకాజకరివేకో ఆతుర’ రామకార్య నిర్వ హణలో మహా ఆత్రుత కలవాడు అని వివరించింది. లంకలో హనుమంతుడు, సీతకు కాపలా కాచే రాక్షస స్త్రీలు ఎక్కడ తన రాకను గమనిస్తారో అని, అత్యంత సూక్ష్మరూపాన్ని ధరించి ‘సూక్ష్మ రూపధరి సియహి దిఖావ’ సీతా దేవికి కనిపించాడు అన్నది చాలీసా. పిదప హనుమంతుడు బృహద్రూ పాన్ని ధరించి లంకాదహనం చేసిన ఘట్టాన్ని వర్ణిస్తూ ‘వికట రూపధరి లంక జరావా’ అన్నాడు తులసీదాస్. పిమ్మట ‘భీమరూపధరి అసుర సంహారే’ భీకర రూపాన్ని ధరించి హనుమ అసురుల్ని మట్టుబెట్టాడని చెప్పి, ఇలా హనుమ ‘రామచంద్రకే కాజ సంవారే’ రాముని కార్యాన్ని చక్కబెట్టాడని, తులసీదాసు హనుమ పరాక్రమాన్ని కీర్తించాడు.
హనుమంతుని భక్త రక్షణా దృఢ వ్రతాన్ని అభివ ర్ణిస్తూ తులసీదాసు ‘సుబసుఖలహై తుమార్హరీ శరనా, తుమ రక్షక కాహూకో డరనా’ ఓ హనుమా! నిన్ను శర ణుజొచ్చితే సర్వసుఖాలు సంప్రాప్తిస్తాయి. అసలు నీ రక్షణలో భయానికి తావే లేదు అని అన్నాడు. ‘భూతపి శాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై’ ఓ హనుమా! నీ నామస్మరణంచే, దుష్టశక్తులు దరిచేరవు అని హనుమన్నామ ప్రాశస్త్యాన్ని వర్ణించాడు.
‘సాధు సంతకే తుమ రఖవారే’- ఓ హనుమా! నీవు సాధు రక్షకుడవు అని అంటూ, ‘జన్మ జన్మకే దుఃఖ బిసరావై’- జన్మజన్మల జీవుని వేదనను తొల గించే ముక్తి ప్రదాత అని హనుమ మహాత్మ్యాన్ని కీర్తిం చాడు తులసీదాస్.
‘జో యహ పఢై హనుమాన్ చాలీసా, హొయసిద్ధి సాఖీ గౌరీసా’ హనుమాన్ చాలీసాను నిత్యం పారా యణ చేస్తే, జీవన్ముక్తి ప్రాప్తిస్తుందని, అందుకు పార్వ తీ పరమేశ్వరులే సాక్షులని తులసీదాస్ అభయమి చ్చాడు. హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తూ సిద్ధిని పొందుదాం.
పరమాత్ముని