Paramatmuni
-
ప్రకృతే నేస్తం.. ప్రకృతే పరమాత్మ..!
చిన్న..చిన్న మొక్కలే ఓ పెద్ద వనం అవుతుంది. మనం నాటిన మొక్కే మనకు నీడను ఇస్తుంది, ప్రాణ వాయువు ఇస్తుంది. మానవ జీవితంలో మనం చేయాల్సిన ముఖ్య విధానం ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి అనేది భగవంతుడే ఏర్పరచిన ఓ అద్భుత సంపద. దాన్ని వినాశనానికి గురి చేయకుండా ప్రకృతి పట్ల అర్థవంతంగా నడచుకో అనే సందేశాన్ని ప్రతి వారు గ్రహించాలి. అప్పుడే ప్రకృతికి పరమార్థం ఇచ్చినట్లు అవుతుంది. ఈ ప్రకృతి ఏర్పడటమే ఓ విచిత్రం. చెట్లు, చేమలు, వివిధ జంతువులు, విహంగాలు, నదులు, పర్వతాలు... ఇవన్నీ ఎవరి సృష్టి అని ప్రశ్నించుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సృష్టికర్త ఆజ్ఞ వలన ఈ సృష్టి ఏర్పడింది. సృష్టిని నిర్మించింది ఆ పరమాత్మనే అనే మాట వినిపిస్తుంది. పరమాత్మ ప్రకృతికి ప్రాణం పోస్తే, పరమాత్మ ద్వారా సృష్టించబడిన మానవుడు నేడు ప్రకృతి వినాశనానికి కారకుడు అవుతున్నాడు. స్వేచ్చగా చెట్లు నరకడం, అనువుగాని చోట్ల నిర్మాణాలు చేయడం, పర్యావరణానికి విఘాతం కలిగించే కలుషిత కర్మాగారాలు స్థాపించడం వంటి వాటి వలన ప్రకృతి పాడవుతున్నది. మానవుడు తన స్వలాభాలను చూసుకుంటున్నాడే గాని పదిమందికి ఉపయోగపడే ప్రకృతికి ప్రాణం పోయాలి అనే విషయం మరచి నట్లు ఉన్నాడు. విచ్చలవిడిగా వ్యర్ధ పదార్థాలను ధరణిపై వేసి ప్రకృతి నిరోధానికి పరోక్షంగా కారకుడు అవుతున్నాడు. ప్రకృతి అనేది ఓ దైవం అనే మాటను విస్మరిస్తున్నాడు. పచ్చని ప్రకృతిని ఓ క్షణం పరిశీలిస్తే మనసు ఆనందంతో నిండిపోతుంది. ప్రకృతిలోని పక్షుల కిల.. కిల రావాలు, పారే సెలయేర్లు, శబ్దం చేసే పాల పొంగులాంటి జలపాతాలు, అందంగా పేర్చినట్లు ఉండే పర్వత శ్రేణులు చూస్తుంటేనే ఓ మధురానుభూతికి లోనవుతాం. రోజు కొంత సేపు ప్రకృతిలో విహరిస్తే మనం పొందే అనుభూతే వేరు. అయితే నేడు చాలామంది వాకింగ్ వంకతో ప్రకృతిని ఆస్వాదిస్తామంటారే కానీ వాళ్ళు ఆస్వాదించేది అంతా వాళ్ళ చెవులలో పెట్టుకుని వినే పాటలే. ఈరోజుల్లో ఎక్కడ చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకునే వారే కనిపిస్తారు. వాళ్ళు ఏమి ఆస్వాదిస్తున్నారో, ఏమి వింటున్నారో అర్థం కాదు. మనం ప్రయాణిస్తున్నప్పుడు కనపడే చెట్టు, చేమ చూడటం వలన ఓ ఆనందం కలుగుతుంది. ఈ విశ్వంలో జరిగే కార్యాలు అన్నీ ప్రకృతి వల్లనే జరుగుతూ ఉంటాయి. కానీ అహంకారం, గర్వం కారణం మూలంగా మనిషి మాత్రం తానే అన్నిటికీ కర్తనని, మూలం తానేననీ, తన ప్రయోజకత్వం వల్లనే అన్ని కార్యాలు జరుగుతున్నాయని భావిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ‘నేను చేస్తున్నాను’ అనుకోకపోతే ఏ పనినీ చేయలేడు. చిక్కు అంతా ఎక్కడ వస్తుందీ... అంటే సమస్తం నేను చేస్తున్నాను. నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అని అహంకార పూరితుడిగా మారినప్పుడే. అప్పుడే వ్యక్తి పతనపు అంచులకు ప్రయాణం సాగిస్తున్నాడని తెలుసుకోవాలి. ఇటువంటి అహంకారం మానవుణ్ణి కిందకు లాగుతుంది. సత్వ రజస్తమోగుణాలతో కూడిన ఈ ప్రకృతిని అధిగమించడం కష్టం. ఈ సువిశాల విశ్వమంతా చాలా వరకు అన్ని కార్యాలు ప్రకృతి పర్యవేక్షణలోనే జరిగిపోతూ ఉంటాయి. భూమిలో విత్తనం వేసి నీళ్ళు పోయాడమే మనం చేయగలిగేది. కాని ఆ విత్తనం నుండి మొలక రావడం, మొక్క పెరగడం, అది కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా సూర్యుని నుండి ఆహారం స్వీకరించడం మొదలగు అన్ని క్రియలలో వ్యక్తి ఏమి చేయగలుగుతున్నాడో అని బేరీజు వేసుకుంటే విశ్వంలో జరిగే ప్రతి క్రియలో ప్రకృతి పాత్ర మిక్కుటం. తల్లి గర్భంలో ఫలదీకరణ చెందిన జీవి ఎన్ని మార్పులకు గురవుతుందో సరిగ్గా ఆచి తూచగలిగే జ్ఞానం, విజ్ఞానం మనకు ఇప్పటికీ అందుబాటులో లేదు. ఇది కేవలం ప్రకృతి ద్వారానే సాధ్యం. ఇంతటి మహత్తర కార్యం ప్రకృతి వలననే జరుగుతుండగా మనిషి ‘నేనే కర్తను’ అని అహంకరించడం ఏ మాత్రం సబబు? ఎప్పుడైతే నేనే అని అనుకుంటున్నాడో అప్పుడే నాది... నాదే అనే మమకారం మొదలవుతుంది. ఈ ‘అహం’, ‘మమ’ అనే రెండు భావాలే ఇరువైపులా నుండి వ్యక్తిని పతనం వైపుకు నెడతాయి. అహంతో నేనే కర్తను అని భావించుకుంటూ తమ పతనానికి తానే గోతిని తవ్వుకుంటూ ఉంటారు కనుక ఈ సృష్టిలో ఏది జరిగినా అంతా ప్రకృతి మయమనే, ప్రకృతే సర్వం, సర్వం ప్రకృతే అని భావించవలసి వస్తుంది. అందమైన ప్రకృతిని వీక్షించడం అంటే ఆ భగవంతుని చూడటమే. ప్రకృతికి మనం ఎంత దగ్గర అవుతామో అంత భగవంతునికి దగ్గర అయినట్లు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క ను నాటి దాని ఆవశ్యకతను తెలియజేస్తే మొక్కలు పట్ల అభిరుచి పెరుగుతుంది. విద్యార్థులలో కూడా ప్రకృతి అంటే జిజ్ఞాస కలుగుతుంది. – కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర ఉపన్యాసకులు. -
శరీరత్రయం
జ్యోతిర్మయం ప్రతి జీవికి స్థూల సూక్ష్మ కారణ దేహాలనే మూడు శరీ రాలు ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియాలతో, పంచకర్మేం ద్రియాలతో, కంటికి స్పష్టంగా కనిపించే, అస్థి మాంస మజ్జ రక్తమయ శరీరమే స్థూల శరీరం. సంకల్ప వికల్పాలతో మనస్సుగా, నిశ్చయాత్మక మైన బుద్ధిగా, స్మరణమాత్రమైన చిత్తంగా, భోగించే అహమ్గా, కంటికి కనిపించకపోయినా, నిరంతరం అనుభూతమయ్యే, ఆంతరిక శరీరమే సూక్ష్మ శరీరం. స్థూల శరీరమే నేను, సూక్ష్మ శరీరమే నేను, అన్న భ్రాం తికి కారణమైన మూలాజ్ఞానమే కారణ శరీరం. అం దరూ స్థూల శరీరాన్ని, కొందరే సూక్ష్మ శరీరాన్ని, మరి కొందరే కారణ శరీరాన్ని పరికిస్తూ ఉంటారు. స్థూల శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉం చుకోవాలని అధికులు ఆరాటపడు తూనే ఉంటారు. స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయిస్తూ ఉంటారు. నిర్మాలిన్య సాధ నాల్ని సౌందర్య సాధనాల్ని పరిమళ ద్రవ్యాల్ని వాడు తూనే ఉంటారు. వైద్యుల్ని ఆరోగ్యానికై సంప్రదిస్తూనే ఉంటారు. ఈ స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయించక పోతే, అది మాలిన్యంతో దుర్గంధ భరితం అవుతుంది. అట్టి వారిని చూసి సభ్యసమాజం ముక్కు మూసుకుం టుంది. స్థూల శరీరానికి ఎలా మాలిన్యాలు ఉన్నాయో, అలానే సూక్ష్మ శరీరానికీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మాలిన్యాలు ఉన్నాయి. కానీ సూక్ష్మ శరీ రాన్ని మాలిన్య రహితంగా వినిర్మలంగా ఉంచుకోవా లని ఆరాటపడే వారు చాలా అరుదు. సూక్ష్మశరీర నిరంతర పరిశీలనమే ఆ నిర్మాలి న్యానికి తొలి సాధనం. అంతరంగంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుర్గంధాలు పేరుకుం టున్నాయని ప్రథమంగా గుర్తించాలి. గుర్తించిన వెం టనే భగవన్నామ స్మరణంతో భగవత్ ధ్యానంతో భగ వత్ చింతనతో ఆ సూక్ష్మ శరీరానికి స్నానం చేయించి, దుర్గంధాల్ని నివారించాలి. అలా చేయకపోతే, సూక్ష్మ శరీరం దుర్గంధ భరిత మవుతుంది. సాధు సజ్జనులు ఇలాంటి సూక్ష్మ శరీ రాన్ని చూసి ముక్కు మూసుకుంటారు. మనం మన సూక్ష్మ శరీరానికి స్నానం చేయించకుండా, ఎన్నాళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి ఎన్ని జన్మల నుంచి దుర్గంధ భరి తం చేశామో, పరిశీలించాలి. అలా పరిశీలించి, తప్పి దాన్ని తెలుసుకొని, వెంటనే సూక్ష్మ శరీర అభ్యంగన స్నానానికి సమాయత్తం కావాలి. అనుదినం ఆమరణ పర్యంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అలా సూక్ష్మ శరీరాన్ని శుభ్రంగా వినిర్మలంగా ఉంచుకోగలిగితే, మూలాజ్ఞానమనే కారణ శరీరం కూడా జ్ఞానమయమవుతుంది. దేహ భ్రాంతి జీవభ్రాం తి అనే అవిద్య నశిస్తుంది. ఆత్మ నిష,్ఠ జ్ఞాన నిష్ఠ సిద్ధి స్తుంది. జీవితమే వినిర్మలమవుతుంది. కనుక స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీర పారిశుద్ధ్యానికీ, తక్షణమే ప్రాధాన్యాన్ని ఇద్దాం. శరీరత్రయ శుద్ధికి సంకల్పిద్దాం. ఈ పుడమిని స్వర్గధామం చేద్దాం. నరజాతికి నారా యణ తత్వాన్ని ప్రబోధిద్దాం. పరమాత్ముని -
ప్రేమోపాసన
రుజుమార్గం నందవ్రజంలో ఒక గోపిక కొత్త ఇల్లు కట్టుకుంది. గృహప్రవేశానికి ఎందరో ఆత్మీయులు, బంధువులు, సన్నిహితులు వచ్చారు. ఆ గోపికకు ఎంతో ప్రియమైన ఇష్టసఖి కూడా బహుదూరం నుంచి వచ్చింది. గృహప్ర వేశానంతరం వాళ్లిద్దరూ యమునా నదీ స్నానానికి వెళ్లారు. నదీ జలాల్లో జలకాలాడుతూ ఇష్టసఖి గోపి కతో ‘చెలీ! మీరంతా ఎంతో అదృష్టవంతులు. శ్రీకృ ష్ణునితో రాసలీలలో పాల్గొనే మహదవకాశం మీకు ప్రా ప్తించింది కదా అన్నది. ‘నిజమేనేమో’ అన్నది గోపిక. ‘చెలీ! రాసలీల జరిగిన ఆ ఒక్క రాత్రీ ఆరు నెలల సాధారణ రాత్రులతో సమానం అని అంటారు కదా! అంత సుదీర్ఘ సమయంలో శ్రీకృష్ణుడు ఎన్నిమార్లు నీ తనువుపై తన అధరాల ముద్రల్ని అంకితం చేశాడో, మరి ఎన్నిమార్లు తన బాహువల్లరిలో నిన్ను లాలిం చాడో? చెప్పవా?’ అన్నది కుతూహలంగా ఇష్టసఖి. గోపిక విలాసంగా నవ్వుతూ ‘సఖీ! రాసలీల ఒక తరగతి గది కాదు కదా, లెక్కల్నీ ఎక్కాల్నీ వల్లించటా నికి! అది ఒక దుకాణం కాదుకదా, లెక్కలు సరిచూసు కోవటానికి! శ్రీకృష్ణ ప్రేమ గణాంకాలకు అందేది కాదు. అది ఒక అనిర్వచనీయమైన రసానుభూతి. స్వామి సన్నిధి చేరగానే స్వామి స్పర్శానుభూతిని పొం దగానే, నాకు శరీరస్పృహ నశించింది. స్వామి ధ్యానం లో నా అంతరంగం అంతరించిపో యింది. నేను నేనుగా మిగలలేదు. నేను అంతరించగానే, ఇంక మిగి లింది పరమానంద స్ఫూర్తియే! సత్ చిత్ ఆనంద చైతన్యమే!’ అన్నది పర వశంగా. ‘అదృష్టవంతురాలివే చెలీ! ఈ దశకు చేరటా నికి నువ్వు ఎంత జపాన్ని చేశావో? ఎన్ని వ్రతాల్ని అనుష్టించావో? కదా అని అన్నది ఇష్టసఖి. ‘సఖీ! నేనింత జపించాను. నేనింత ధ్యానించా ను. అన్న లెక్కల్లో ‘అహమ్’ ఉంటుంది. అహం ఉన్నం త కాలం స్వామి సన్నిధి దక్కదు. స్వామి విరహంలో ఎంతగా జ్వలించావు? స్వామి సన్నిధికై ఎంతగా తపిం చావు? అన్నదే ప్రధానం. సన్నిధికి పూర్వం దర్శనాన్ని పొందకుండా ‘నేను’ ఉండలేను, అన్న స్థితి కలగాలి. అప్పుడే స్వామి దర్శనం!’ అన్నది గోపిక. ఆ యమునా నదీ తీరంలోని చెట్ల పొదల్లో కూర్చొ ని ఒక సాధకుడు కొంత కాలంగా కృష్ణమంత్రాన్ని జపి స్తున్నాడు. శరీరం శుష్కించిందే కానీ, తలపై జటలు కట్టాయే కానీ, శ్రీకృష్ణ సాక్షాత్కారం సంప్రాప్తించ లేదు. నిరాశలో ఉన్న ఆ సాధకునికి ఈ కాంతల సంభాషణ వినిపించింది. వెంటనే ఆ సాధకుడు తన తప్పు తెలుసుకొని, జపమాలను యమునలోకి విసిరి వేశాడు. ప్రేమోపాసనకు ఉద్యుక్తుడైనాడు. చేతిలో మాల ప్రధానం కాదు. చిత్తంలో ప్రేమ జ్వాల ప్రధానం. భగవంతుణ్ణి ప్రేమించాలి. విరహం లో తపించాలి. హృదయం ద్రవించాలి. అశ్రువులు స్రవించాలి. జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తి పొందాలని మనస్సు పరితపించాలి. మహదానంద స్వరూపులమై ప్రేమ స్వరూపులమై నిలవాలని జ్వలించాలి. అదే వినిర్మలభక్తి. మనమూ వినిర్మల భక్తులమై ప్రేమోసాకులమై సాధనను కొనసాగిద్దాం. పరమాత్ముని -
జై వీరహనుమాన్
జ్యోతిర్మయం హిందీ సాహిత్య గగనంలో చంద్రునిగా కీర్తినం దుకున్న భక్త కవి తులసీదాస్ రచించిన ‘హనుమాన్ చాలీసా’ హనుమంతుని సమగ్ర స్వరూపాన్నీ మహా త్మ్యాన్నీ అభివర్ణిస్తుంది. ఈ చాలీసా యావత్ భార తీయ భక్తజనుల నాల్కలపై నర్తిస్తుందనడం అతి శయోక్తి కాదు. ఈ చాలీసా ఆరంభంలోనే హనుమంతుని ‘జ్ఞాన గుణసాగర’ అని సంబోధించింది. హనుమంతుని జ్ఞానం అంతులేని సాగరం వంటిదని అర్థం. ఆ జ్ఞాన మే ముల్లోకాల్ని జాగృతం చేస్తుందని చెప్తూ ‘తిహులోక ఉజాగర’ అని జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మగా ఈ స్తోత్రరాజం కీర్తించింది. ఆ జ్ఞానమే దేహాత్మబుద్ధి జీవా త్మబుద్ధితో కూడిన కుమతిని తొలగించి ఆత్మబుద్ధి అనే సుమతిని కలిగిస్తుందని ధ్రువీకరిస్తూ ‘కుమతినివార సుమతికే సంగీ’ అని ఆ కపీశుణ్ణి శ్లాఘించింది. సాగరోల్లంఘన చేసి లంకలో హనుమంతుడు ప్రదర్శించిన ధైర్యాన్నీ పరాక్రమాన్నీ సమయోచిత చాతుర్యాన్నీ ఈ చాలీసా వేనోళ్ల శ్లాఘించింది. హను మంతుడు ‘రామకాజకరివేకో ఆతుర’ రామకార్య నిర్వ హణలో మహా ఆత్రుత కలవాడు అని వివరించింది. లంకలో హనుమంతుడు, సీతకు కాపలా కాచే రాక్షస స్త్రీలు ఎక్కడ తన రాకను గమనిస్తారో అని, అత్యంత సూక్ష్మరూపాన్ని ధరించి ‘సూక్ష్మ రూపధరి సియహి దిఖావ’ సీతా దేవికి కనిపించాడు అన్నది చాలీసా. పిదప హనుమంతుడు బృహద్రూ పాన్ని ధరించి లంకాదహనం చేసిన ఘట్టాన్ని వర్ణిస్తూ ‘వికట రూపధరి లంక జరావా’ అన్నాడు తులసీదాస్. పిమ్మట ‘భీమరూపధరి అసుర సంహారే’ భీకర రూపాన్ని ధరించి హనుమ అసురుల్ని మట్టుబెట్టాడని చెప్పి, ఇలా హనుమ ‘రామచంద్రకే కాజ సంవారే’ రాముని కార్యాన్ని చక్కబెట్టాడని, తులసీదాసు హనుమ పరాక్రమాన్ని కీర్తించాడు. హనుమంతుని భక్త రక్షణా దృఢ వ్రతాన్ని అభివ ర్ణిస్తూ తులసీదాసు ‘సుబసుఖలహై తుమార్హరీ శరనా, తుమ రక్షక కాహూకో డరనా’ ఓ హనుమా! నిన్ను శర ణుజొచ్చితే సర్వసుఖాలు సంప్రాప్తిస్తాయి. అసలు నీ రక్షణలో భయానికి తావే లేదు అని అన్నాడు. ‘భూతపి శాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై’ ఓ హనుమా! నీ నామస్మరణంచే, దుష్టశక్తులు దరిచేరవు అని హనుమన్నామ ప్రాశస్త్యాన్ని వర్ణించాడు. ‘సాధు సంతకే తుమ రఖవారే’- ఓ హనుమా! నీవు సాధు రక్షకుడవు అని అంటూ, ‘జన్మ జన్మకే దుఃఖ బిసరావై’- జన్మజన్మల జీవుని వేదనను తొల గించే ముక్తి ప్రదాత అని హనుమ మహాత్మ్యాన్ని కీర్తిం చాడు తులసీదాస్. ‘జో యహ పఢై హనుమాన్ చాలీసా, హొయసిద్ధి సాఖీ గౌరీసా’ హనుమాన్ చాలీసాను నిత్యం పారా యణ చేస్తే, జీవన్ముక్తి ప్రాప్తిస్తుందని, అందుకు పార్వ తీ పరమేశ్వరులే సాక్షులని తులసీదాస్ అభయమి చ్చాడు. హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తూ సిద్ధిని పొందుదాం. పరమాత్ముని -
శ్రుతిసారం
జ్యోతిర్మయం ‘అంతా మిథ్య తలంచి చూడ’... లోతుగా పరిశీలించి చూస్తే, ఈ లౌకికమైన జగత్తంతా మిథ్యే. ఇందులో మనం దక్కుతాయని ఆశిస్తున్న ఆనందాలూ మిథ్యే. ఈ భోగాలూ మిథ్యే. ఈ విషయం తెలిసినప్పటికీ నరులు ‘నేనూ నా సంతానం, నా సంసారం, నా సంపద, నా ఇల్లూ వాకిలీ’ అనే మోహంలో కొట్టుమి ట్టాడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారే కానీ, పర మార్థమైన దైవాన్ని ధ్యానింపరు కదా అని ధూర్జటి మహాకవి వాపోయాడు కాళహస్తీశ్వర శతకంలో. ‘తద్యథా ఇహ కర్మచితః లోక క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యచితః లోకః క్షీయతే’ ఈ లోకంలో వ్యవసాయం, వాణిజ్యం సేవ మొదలైన కర్మల వల్ల సంపాదించుకున్న భోగాలు కాలక్రమంలో ఎలా గతించిపోతాయి. అలానే అగ్నిహోత్రాది కర్మల వల్ల సాధించుకున్న స్వర్గాది ఫలాలూ, చేసుకున్న పుణ్యం నశించగానే నశిస్తాయి, కనుక వాటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నది శ్రుతిమాత. ఈ లోకంలోని ఆనందానుభవం ఎలా అనిత్యమో, పరలోకంలోని స్వర్గాది సౌఖ్యాల ఆనందానుభవమూ అలానే అనిత్యం అన్నది శ్రుతి తాత్పర్యం. ఈ లోకాలు కేవలం అవిచార రమణీయమే. లలితా పరమేశ్వరి సహస్ర నామాల్లో ‘మిథ్యా జగదధిష్ఠానా’ అన్నది ఒక నామం. ఈ నామానికి విశేషమైన అర్థం ఉన్నది. అమ్మవారు ఈ మిథ్యా జగత్తుకు అధిష్ఠాన స్వరూపం అన్నది ఈ నామ తాత్పర్యం. మసక చీకట్లో తాడు పాములా అనిపిస్తుంది. భ్రాంతి గొల్పుతుంది. అలా ఈ మిథ్యా జగత్తుకు అమ్మవారు అధిష్ఠానం, ఆధారం. వాస్తవమైన తాడు ఉండబట్టి మిథ్య అయిన సర్పం తాత్కాలికంగా ఆభాసిస్తోంది. ఉన్నట్లు అనిపిస్తుంది. భ్రాంతి తొలగితే మిథ్యా సర్పం మటు మాయమై, వాస్తవమైన తాడే మిగులుతుంది. అదే విధంగా అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ జగత్తు, జగత్తులోని సుఖ దుఃఖాలు, జన్మ మృత్యువులూ, సత్యంగా గోచరిస్తాయి. అజ్ఞానం తొలగితే జగత్తు పట్ల సత్యత్వ భావన అదృశ్యమవుతుంది. అధిష్ఠాన మైన అమ్మవారే గోచరిస్తుంది. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అన్న పారమార్థిక సత్యం సుదృఢం అవుతుంది. అప్పుడంతా అద్వైతమే. జగత్తు పారమార్థిక సత్యం కాదన్నదే శ్రుతి సారం. లలిత నామ సహస్రం బోధ అదే. ధూర్జటి పల్కుల తాత్పర్యం అదే. ఈ జగత్తుకు సంబంధించిన అసత్వాన్ని తెలుసుకొని, నేను కర్తను భోక్తను కాను అన్న పరమార్థాన్ని గ్రహించి, ఈ వ్యావహారిక జగత్తులో, ఫలాల్ని ఆశించకుండా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిత్యం నిర్వహించాలన్నదే గీతాసారం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ నీకు అధికారం కర్మల్లోనే, ఫలాల్లో కాదు, అన్నది గీతా తాత్పర్యం. గీతా సారాన్ని గ్రహించి, ఉపనిషత్ బోధను స్వీక రించి, నిష్కామ కర్మను చేబట్టి, మన జీవితాన్ని సార్థ కం చేసుకుందాం. పరమాత్ముని -
అన్నీ సన్మార్గాలే!
జ్యోతిర్మయం ‘దేహాత్మ బుద్ధ్యా దాసోహం, జీవాత్మ బుద్ధ్యా త్వదం శకః, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, స్థూలదేహమే నేను అన్న భావనలో ఉన్నప్పుడు నేను నీ దాసుణ్ణి, సూక్ష్మ శరీరమే నేను అన్న జీవభావనలో ఉన్నప్పుడు నేను నీ అంశను, అలా కాక ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు అతీతమైన ఆత్మస్వరూపుణ్ణే నేను అన్న దశలో నీవే నేను నేనే నీవు’ అని ఆంజనేయస్వామి శ్రీరామునితో అన్నాడట. ఆంజనేయస్వామి అన్నమాటల్లోని మూడు విభాగాల్లో, వరుసగా ద్వైత విశిష్టాద్వైత, అద్వైత మతాలు ప్రతిబింబిస్తున్నాయి. జీవాత్మ పరమాత్మ పరిపూర్ణంగా భిన్నులే. భక్తితో కూడిన భగవత్ ఉపాసన ద్వారా జీవుడు ముక్తిని పొందాలి. ముక్తిలో కూడా తారతమ్యాలు ఉన్నాయి అన్నది ద్వైత సిద్ధాంతం. ఈ మతంలో జగత్తు సత్యం. బ్రహ్మ సగుణ మూర్తి. అనేక జీవులతో కూడిన ఈ జగత్తు పరబ్రహ్మ శరీ రమే అయినందువల్ల, జగత్తు కం తటికీ పరబ్రహ్మ అంతరాత్మ అయి నందువల్ల, జీవబ్రహ్మలకు అభేదం ఉంది. కానీ జీవ బ్రహ్మలకు స్వరూప ఐక్యం లేనందువల్ల, భేదమూ ఉంది అన్నది విశిష్టాద్వైతం. భక్తి ప్రపత్తుల ద్వారా జీవాత్మ ముక్తిని పొందాలి. ముక్తిలో తారతమ్యాలు లేవు. శుద్ధ సత్వమయమైన వైకుంఠంలో భగవత్ సన్నిధియే ముక్తి. ఈ సిద్ధాంతంలో కూడా పరబ్రహ్మ సాకార స్వరూపుడే. జీవాత్మకూ పరమాత్మకూ పూర్తి అభేదమే, అంటూ జీవబ్రహ్మ్యైన్ని చాటుతుంది అద్వై తం. జీవభ్రాంతికి అవిద్యే కారణం. అవిద్యా నాశమే ముక్తి అంటుంది అద్వైతం. ఈ సిద్ధాంతంలో జగత్తు మిథ్య, పరబ్రహ్మ నిరాకార స్వరూపుడు. ద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు మధ్వాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు రామానుజాచా ర్యులు. అద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు శంకరాచా ర్యులు. ఈ ముగ్గురూ దివ్యదర్శనులే. దైవ స్వరూపులే. త్రిమతాచార్యులు మువ్వురూ దివ్య దర్శనులే అయినప్పటికీ, వారు భిన్న అభిప్రాయాన్ని ఎందుకు కలిగి ఉన్నారు? భగవత్ స్వరూప నిర్ధారణలో, సాధనా విధానాల్లో, ఆఖరికి ముక్తిలో కూడా భిన్నా భిప్రాయాల్ని ఎందుకు కలిగి ఉన్నారు? అన్నది ప్రశ్న. భగవత్ సాధన చేసే సాధకులకు విభిన్న అభిరు చులు ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇష్టమైన మార్గంలోనే వారు పురోగతిని సాధించగలుగుతారు. ఇష్టంలోనే కష్టాన్ని సహించగల సహిష్ణుత ఉంటుంది. అందుకనే త్రిమతాచార్యులే కాక, ఇంకా అనేక ప్రవర్త కులు లోకం ముందు అనేక మార్గాల్ని ఉంచారు. అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. సాధకులు తమ ఇష్టానుసారం సాధనా మార్గాన్ని ఎంచుకొని సాఫల్యాన్ని పొందాలన్నదే వారి అభిమతం. అదే వారి మతం. అదే సర్వసమ్మతం. మార్గాలు వేరైనా నదులన్నీ సాగరాన్నే చేరేటట్లు, సాధనా మార్గాలు వేరయినా చివరకు చేరేది భగవత్ సన్నిధికే. మార్గాలు అన్నీ సన్మార్గాలే. కనుక ఏ మార్గా న్ని అయినా పట్టుకుందాం. పట్టిన మార్గంలో మాత్రం పట్టువదలం అన్నదే మన మతం కావాలి. పరమాత్ముని -
సగుణం నిర్గుణం
జ్యోతిర్మయం నహి తస్మాన్మనః క శ్చిచ్చక్షుషీ వా నరోత్తమాత్, నరః శక్నోత్యపాకృష్టుమతిక్రాంతేపి రాఘవః ‘మీ పిన తల్లి కైకేయీ దేవి, మీ తండ్రి దశరథ మహారాజు మిమ్మల్ని కలవ కాంక్షిస్తున్నారు’ అన్న సుమంత్రుని సందేశాన్ని అందుకొని, శ్రీరాముడు పితృ మందిరానికి బయలుదేరాడు. రామచంద్రమూర్తి రాజమార్గం గుండా వెళ్లను న్నాడన్న సమాచారాన్ని విని, వేలాది అయోధ్యా పౌరు లు మార్గం ఇరువైపులా బారులు తీరి భక్తి ప్రపత్తులతో అంజలి ఘటించి ఉన్నారు. రథం ముందుకు సాగుతోంది. రథంపై రామభ ద్రుడు ఆసీనుడై ఉన్నాడు. పౌరులు సంస్తుతిస్తున్నారు. అయోధ్యాకాంతలు భవనాలపెకైక్కి పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారు. అన్ని దృక్కులూ రామునిపైనే కేంద్రీకృ తమై ఉన్నాయి. అన్ని మనస్సులూ రామ పాదాలకు ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా హర్షాతి రేకాలే. రామ నామస్మరణమే. శ్రీరాముని రథం మరింత ముందుకు సాగిపో యింది. దృక్కుల కందని దూరానికి సాగిపోయింది. అయినప్పటికీ పౌరుల దృక్కులూ, మనస్సులూ వెనుది రగలేకపోయాయి. పౌరులు ఆ నరశ్రేష్ఠుని నుండి దృక్కుల్నీ మనసుల్నీ మరల్చ అశ క్తులై నిశ్చేష్ఠులై నిలిచిపో యారు. ఇదీ శ్రీమద్రామయణం లో అయోధ్యాకాండలో వాల్మీకి మహర్షి అభివర్ణించిన ఒక ఘట్టం. ఇందులో పౌరుల భక్తి పారవశ్యం కళ్లకు కడుతోంది. సగుణ సాకారమూర్తి అయిన రామచంద్రమూర్తి రూపాన్ని వీడలేని భక్తుల దృక్కుల, మనస్సుల అశక్తతను అతి మనోజ్ఞంగా వర్ణిం చాడు వాల్మీకి. సగుణ సాకారమూర్తి సంస్మరణం లోని మహత్తర శక్తిని అభివర్ణించాడు వాల్మీకి మహర్షి ఈ ఘట్టంలో. ‘యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ,’... నిర్గుణ నిరాకార పరబ్రహ్మను పొందాలని బయలుదేరిన వాక్కులు, దృక్కులు, అంతరింద్రియం, ఆ పరబ్రహ్మను పొందలేక వెనుదిరిగాయి అంటున్నది తైత్తిరీయోపనిషత్తు. సగుణ సాకారమూర్తి సంస్మరణంలోని, సందర్శ నంలోని సౌలభ్యాన్ని రామాయణం విశదీకరిస్తే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సాక్షాత్కారంలోని సంక్లిష్ట తను వివరించింది తైత్తిరీయోపనిషత్తు. ‘ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ చామృతం చ స్థితం చ యచ్చ సచ్చ త్య్రచ్చ, పర బ్రహ్మకు రెండు రూపాలూ ఉన్నాయి. సగుణం నిర్గు ణం మర్త్యం అమృతం చలం అచలం అపరోక్షం పరో క్షం’ అన్నది బృహదారణ్యక ఉపనిషత్తు. ఆదిశంకరులు సూత్రభాష్యంలో ‘భేదస్యోపాసనార్థత్వాద భేదో తాత్ప ర్యాత్, సగుణం భేదం ఉపాసన కొరకే, తత్వం మాత్రం నిర్గుణమే’ అన్నారు. వాస్తవం నిర్గుణమే అయినా, తొలిదశలో సాధ నలో సగుణమే గ్రాహ్యం. సగుణం అన్న పునాదిపైనే దివ్యసౌధాన్ని నిలపాలి అన్నది ఆర్షసమ్మతం. అం దుకే ముందు సగుణారాధనతో సాధన సాగిద్దాం. నిర్గుణారాధన అన్న శిఖరాగ్రానికి చేరుదాం. సంక ల్పించండి. సాధించండి. పరమాత్ముని -
సుఖదుఃఖాలు
జ్యోతిర్మయం రాజవుతాడనుకున్న రాముడు నారచీరల్ని కట్టి వనానికి బయలుదేరాడు. ఇంక కొన్నేళ్లు కనిపించడు. అడవుల్లో పడరాని పాట్లు పడతాడు. దుఃఖంలో మొదలు నరికిన చెట్టులా కౌసల్యాదేవి నేల కూలింది. తల్లిని రాముడు లేవనెత్తాడు. ప్రేమగా నిమిరాడు. ఈ పుత్ర ప్రేమ దూరం కాబోతున్నదన్న ఆవేదనలో - యది పుత్ర న జా యేథా మమ శోకాయ రాఘవ, న స్మ దుఃఖమతో భూయః పశ్యేయమహమ్రపజాః ‘ఓ రామా! ఇంతటి దుఃఖాన్ని కలిగించడానికి నీవు పుట్టకపోయినా బాగుండేది. అప్పుడు పిల్లలు లేర న్న ఒక్క దుఃఖమే ఉండేది. ప్రజారంజకుడైన పుత్రుడు, సర్వాన్నీ వీడి అడవులకు పోతున్నాడన్న దుఃఖంతో పోలిస్తే, గొడ్రాలినన్న దుఃఖం అత్యల్పమైందే!’ అని కౌసల్యాదేవి ఆక్రోశించింది. ఆ క్షణంలో కౌలస్యకు రాముడు అడవులకు వెళ్తు న్నాడని మాత్రమే తెలుసు. భోగాలకు దూరమై అడవుల్లో కష్టాలు పడబోతున్నాడని మాత్రమే తెలుసు. కానీ వన వాస సమయంలో సీతను రావణుడు అపహరిస్తాడని, రామాంజనేయ సంయోగం ఘటింపనున్నదని, రాక్షస సంహారం జరగనున్నదని, లోకాలన్నీ సుఖించ గలవనీ, తెలియదు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణ కథా లోకేషు ప్రచురిష్యతి. భూతలంలో పర్వతాలు, నదులూ ఉన్నంత కా లం, రామాయణ గాథ, కౌసల్యా తనయుడైన శ్రీరామ కథ, లోకంలో వ్యాపించి ఉంటుం దని, ఈ గాథ వేదతుల్యమై పరమ పవిత్రమై పాప వినాశకమై పుణ్య ప్రదాయకమై భాసిల్లకలదని కౌస ల్యకు తెలియదు. రాముడు అడవు లకు వెళ్తున్నాడన్న సమయంలో కౌసల్యకు ప్రాప్తించిన దుఃఖం వెనుక ఇంతటి మహా సుఖం దాగి ఉంది. కనుక కౌసల్య దుఃఖం దుఃఖం కానే కాదు. కేవలం దుఃఖ ఆభాసయే! దుఃఖం కాకపోయినా దుఃఖంలా తాత్కాలికంగా పరితపింపచేసేదే! అలాగే సీతను అపహరించినప్పుడు, మార్గమధ్యం లో అడ్డుకున్న జటాయువు రెక్కల్ని విరిచి నేలకూల్చి నప్పుడు, సీతను తెచ్చి అశోకవనంలో ఉంచినప్పుడు, రావణుడు విజేతనయినానన్న మహా సుఖానుభూతిని పొందాడు. కానీ ఈ సుఖానుభూతి నీడలో, తన మర ణం అన్న మహాదుఃఖం దాగి ఉన్నదని, ఆనాడు రావణు నకు తెలియదు. కనుక ఆ నాటి రావణుని సుఖం సుఖం కానేకాదు. కేవలం సుఖాభాసయే. సుఖం కాక పోయినా తాత్కాలికంగా ఆనందింప చేసేదే! తరతరాలుగా రామాయణ గాథను నరనరాల్లో జీర్ణించుకున్న మనం, సుఖాలకు పొంగి పరవశింప గూడదనీ, దుఃఖాలకు తల్లడిల్లి నిర్వేదాన్ని పొందకూ డదనీ, తెలుసుకోవాలి. దుఃఖాలన్నీ నిజమైన దుఃఖాలు కావు, సుఖాలన్నీ నిజమైన సుఖాలు కావు, అన్న స్పృహ కలిగి ఉండాలి. కష్టాల్లో దిగులు చెందని వాడు, సుఖాల్లో పరవశింపని వాడు, రాగమూ భయమూ క్రోధమూ లేనివాడే ధీరుడనీ, ముని అనీ, అందుకే భగ వద్గీత అన్నది. కనుక రామాయణాన్ని పఠిద్దాం, గీతను అధ్యయనం చేద్దాం, ధీరులమై నిలుద్దాం. పరమాత్ముని -
ఆత్మసాక్షాత్కారం
జ్యోతిర్మయం ‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు. ఒకే వ్యక్తి ఆఫీస్లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీ, ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీ, ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ, ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీ నంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది. కనుక మన కున్న రెండు సాధనాల్లో అంతరంగమే ప్రధానం. శరీరం గౌణం. మనిషి జీవన యాత్రలో విజయాల్ని సాధించాలన్నా, పరాజ యాల్ని చవిచూడాలన్నా, రాజ్యాలేలాలన్నా, అంతరిక్షంలోకి ఎగ రాలన్నా, కావ్యాల్ని అల్లాలన్నా, వైజ్ఞానికంగా అభివృద్ధి చెందా లన్నా, ఇలా లౌకికంగా ఏ వ్యవహారాన్ని చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం. ఇంక అలౌకిక మార్గంలో జపతపాల్ని చేయాలన్నా, పూజాదికాల్ని నిర్వహించాలన్నా, యజ్ఞయాగాదుల్ని నిర్వర్తించాలన్నా, వ్రతాదుల్ని అనుష్టించాలన్నా, పారాయణల్ని చేయాలన్నా, మహాత్ముల ప్రవచనాల్ని వినాలన్నా, పుణ్యక్షేత్రాల్ని దర్శించాలన్నా, శాస్త్రాల్ని అధ్యయనం చేయాలన్నా, ఈ అంత రంగమే ప్రధాన సాధనం. ఇంక ఆధ్యాత్మికంగా నేనెవర్ని, ఈ జగత్తేమిటి, పరమేశ్వరు డెవ్వడు అన్న విచారణ చేయాలన్నా, వేదాంత వాక్యాల్ని శ్రవణం చేయాలన్నా, మననం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఈ అంతరంగమే ప్రధాన సాధనం. ఆధ్యాత్మిక మూలాల్ని తరచి చూస్తే, అమనస్క స్థితియే అంటే మనసు లేని స్థితియే బంధ విముక్తి అనీ ముక్తి అనీ వేదాంతం ఘోషిస్తోంది. సూటిగా చెప్పా లంటే ముక్తిని సాధించాలంటే మనిషి, తనకున్న ఏకైక ప్రధాన సాధనమైన అంతరంగాన్ని కోల్పోవాలి. ఈ అమనస్క స్థితికి చేరాలన్నా, మనిషి మనస్సునే ఆశ్రయించాలి. అంటే మనస్సుతోనే మనస్సును నిర్వీర్యం చేయాలి. ఇది ఎలా సాధ్యం? మన నిత్యజీవితంలో మనకు తారసపడే అవస్థలు, జాగ్రత్ స్వప్న సుషుప్తులు. జాగ్రత్ స్వప్నాలు మనసును ఆశ్రయించినవే. మనసులేని స్థితి సుషుప్తియే కదా! జీవన్ముక్తి పొందాలంటే మనసు అధీనంలో ఉన్న జాగ్రత్ దశలో ఉంటూనే, మనసు లేని సుషుప్తిని పొందగలగాలి. అంటే కర్మ చేస్త్తూనే కర్తృత్వ భోక్తృత్వాల్ని పరిత్య జింపగలగాలి. నేను కర్తను భోక్తను కాను, సర్వ వ్యవహారాలకు ఆధారమైన చైతన్యాన్నే నేను, అన్న నిష్ఠ కలిగి ఉండాలి. అదే ఆధ్యా త్మికం. నిన్ను నీవు చైతన్య స్వరూపంగా ధ్యానిస్తూ, ప్రాణులందరినీ చైతన్య స్వరూపాలుగా భావించాలి. ప్రపంచాన్నే ఒక చైతన్య స్రవం తిగా దర్శించాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. ఆ స్థితిలో తరతమ భేదాలుండవు. జయాపజయాలుండవు. సుఖదుఃఖాలుండవు. అప్పుడు కర్మల్ని మనం మరింత ఉత్తేజంగా చేయగలుగుతాం. ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాం. లోకహితాన్ని కోరగలుగుతాం. ఇహపరాల్ని సాధించగలుగుతాం. పరమాత్ముని