ప్రేమోపాసన | Rujumargam - 17.04.2015 | Sakshi
Sakshi News home page

ప్రేమోపాసన

Published Fri, Apr 17 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

ప్రేమోపాసన

ప్రేమోపాసన

 రుజుమార్గం
 నందవ్రజంలో ఒక గోపిక కొత్త ఇల్లు కట్టుకుంది. గృహప్రవేశానికి ఎందరో ఆత్మీయులు, బంధువులు, సన్నిహితులు వచ్చారు. ఆ గోపికకు ఎంతో ప్రియమైన ఇష్టసఖి కూడా బహుదూరం నుంచి వచ్చింది. గృహప్ర వేశానంతరం వాళ్లిద్దరూ యమునా నదీ స్నానానికి వెళ్లారు. నదీ జలాల్లో జలకాలాడుతూ ఇష్టసఖి గోపి కతో ‘చెలీ! మీరంతా ఎంతో అదృష్టవంతులు. శ్రీకృ ష్ణునితో రాసలీలలో పాల్గొనే మహదవకాశం మీకు ప్రా ప్తించింది కదా అన్నది. ‘నిజమేనేమో’ అన్నది గోపిక.
 ‘చెలీ! రాసలీల జరిగిన ఆ ఒక్క రాత్రీ ఆరు నెలల సాధారణ రాత్రులతో సమానం అని అంటారు కదా! అంత సుదీర్ఘ సమయంలో శ్రీకృష్ణుడు ఎన్నిమార్లు నీ తనువుపై తన అధరాల ముద్రల్ని అంకితం చేశాడో, మరి ఎన్నిమార్లు తన బాహువల్లరిలో నిన్ను లాలిం చాడో? చెప్పవా?’ అన్నది కుతూహలంగా ఇష్టసఖి.

 గోపిక విలాసంగా నవ్వుతూ ‘సఖీ! రాసలీల ఒక తరగతి గది కాదు కదా, లెక్కల్నీ ఎక్కాల్నీ వల్లించటా నికి! అది ఒక దుకాణం కాదుకదా, లెక్కలు సరిచూసు కోవటానికి! శ్రీకృష్ణ ప్రేమ గణాంకాలకు అందేది కాదు. అది ఒక అనిర్వచనీయమైన రసానుభూతి. స్వామి సన్నిధి చేరగానే స్వామి స్పర్శానుభూతిని పొం దగానే, నాకు శరీరస్పృహ నశించింది. స్వామి ధ్యానం లో నా అంతరంగం అంతరించిపో యింది. నేను నేనుగా మిగలలేదు. నేను అంతరించగానే, ఇంక మిగి లింది పరమానంద స్ఫూర్తియే! సత్ చిత్ ఆనంద చైతన్యమే!’ అన్నది పర వశంగా. ‘అదృష్టవంతురాలివే చెలీ! ఈ దశకు చేరటా నికి నువ్వు ఎంత జపాన్ని చేశావో? ఎన్ని వ్రతాల్ని అనుష్టించావో? కదా అని అన్నది ఇష్టసఖి.
 ‘సఖీ! నేనింత జపించాను. నేనింత ధ్యానించా ను. అన్న లెక్కల్లో ‘అహమ్’ ఉంటుంది. అహం ఉన్నం త కాలం స్వామి సన్నిధి దక్కదు. స్వామి విరహంలో ఎంతగా జ్వలించావు? స్వామి సన్నిధికై ఎంతగా తపిం చావు? అన్నదే ప్రధానం. సన్నిధికి పూర్వం దర్శనాన్ని పొందకుండా ‘నేను’ ఉండలేను, అన్న స్థితి కలగాలి. అప్పుడే స్వామి దర్శనం!’ అన్నది గోపిక.

 ఆ యమునా నదీ తీరంలోని చెట్ల పొదల్లో కూర్చొ ని ఒక సాధకుడు కొంత కాలంగా కృష్ణమంత్రాన్ని జపి స్తున్నాడు. శరీరం శుష్కించిందే కానీ, తలపై జటలు కట్టాయే కానీ, శ్రీకృష్ణ సాక్షాత్కారం సంప్రాప్తించ లేదు. నిరాశలో ఉన్న ఆ సాధకునికి ఈ కాంతల సంభాషణ వినిపించింది. వెంటనే ఆ సాధకుడు తన తప్పు తెలుసుకొని, జపమాలను యమునలోకి విసిరి వేశాడు. ప్రేమోపాసనకు ఉద్యుక్తుడైనాడు.
 చేతిలో మాల ప్రధానం కాదు. చిత్తంలో ప్రేమ జ్వాల ప్రధానం. భగవంతుణ్ణి ప్రేమించాలి. విరహం లో తపించాలి. హృదయం ద్రవించాలి. అశ్రువులు స్రవించాలి. జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తి పొందాలని మనస్సు పరితపించాలి. మహదానంద స్వరూపులమై ప్రేమ స్వరూపులమై నిలవాలని జ్వలించాలి. అదే వినిర్మలభక్తి. మనమూ వినిర్మల భక్తులమై ప్రేమోసాకులమై సాధనను కొనసాగిద్దాం.
 పరమాత్ముని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement