అన్నీ సన్మార్గాలే!
జ్యోతిర్మయం
‘దేహాత్మ బుద్ధ్యా దాసోహం, జీవాత్మ బుద్ధ్యా త్వదం శకః, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, స్థూలదేహమే నేను అన్న భావనలో ఉన్నప్పుడు నేను నీ దాసుణ్ణి, సూక్ష్మ శరీరమే నేను అన్న జీవభావనలో ఉన్నప్పుడు నేను నీ అంశను, అలా కాక ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు అతీతమైన ఆత్మస్వరూపుణ్ణే నేను అన్న దశలో నీవే నేను నేనే నీవు’ అని ఆంజనేయస్వామి శ్రీరామునితో అన్నాడట. ఆంజనేయస్వామి అన్నమాటల్లోని మూడు విభాగాల్లో, వరుసగా ద్వైత విశిష్టాద్వైత, అద్వైత మతాలు ప్రతిబింబిస్తున్నాయి.
జీవాత్మ పరమాత్మ పరిపూర్ణంగా భిన్నులే. భక్తితో కూడిన భగవత్ ఉపాసన ద్వారా జీవుడు ముక్తిని పొందాలి. ముక్తిలో కూడా తారతమ్యాలు ఉన్నాయి అన్నది ద్వైత సిద్ధాంతం. ఈ మతంలో జగత్తు సత్యం. బ్రహ్మ సగుణ మూర్తి. అనేక జీవులతో కూడిన ఈ జగత్తు పరబ్రహ్మ శరీ రమే అయినందువల్ల, జగత్తు కం తటికీ పరబ్రహ్మ అంతరాత్మ అయి నందువల్ల, జీవబ్రహ్మలకు అభేదం ఉంది. కానీ జీవ బ్రహ్మలకు స్వరూప ఐక్యం లేనందువల్ల, భేదమూ ఉంది అన్నది విశిష్టాద్వైతం. భక్తి ప్రపత్తుల ద్వారా జీవాత్మ ముక్తిని పొందాలి. ముక్తిలో తారతమ్యాలు లేవు. శుద్ధ సత్వమయమైన వైకుంఠంలో భగవత్ సన్నిధియే ముక్తి. ఈ సిద్ధాంతంలో కూడా పరబ్రహ్మ సాకార స్వరూపుడే. జీవాత్మకూ పరమాత్మకూ పూర్తి అభేదమే, అంటూ జీవబ్రహ్మ్యైన్ని చాటుతుంది అద్వై తం. జీవభ్రాంతికి అవిద్యే కారణం. అవిద్యా నాశమే ముక్తి అంటుంది అద్వైతం. ఈ సిద్ధాంతంలో జగత్తు మిథ్య, పరబ్రహ్మ నిరాకార స్వరూపుడు.
ద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు మధ్వాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు రామానుజాచా ర్యులు. అద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు శంకరాచా ర్యులు. ఈ ముగ్గురూ దివ్యదర్శనులే. దైవ స్వరూపులే.
త్రిమతాచార్యులు మువ్వురూ దివ్య దర్శనులే అయినప్పటికీ, వారు భిన్న అభిప్రాయాన్ని ఎందుకు కలిగి ఉన్నారు? భగవత్ స్వరూప నిర్ధారణలో, సాధనా విధానాల్లో, ఆఖరికి ముక్తిలో కూడా భిన్నా భిప్రాయాల్ని ఎందుకు కలిగి ఉన్నారు? అన్నది ప్రశ్న.
భగవత్ సాధన చేసే సాధకులకు విభిన్న అభిరు చులు ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇష్టమైన మార్గంలోనే వారు పురోగతిని సాధించగలుగుతారు. ఇష్టంలోనే కష్టాన్ని సహించగల సహిష్ణుత ఉంటుంది. అందుకనే త్రిమతాచార్యులే కాక, ఇంకా అనేక ప్రవర్త కులు లోకం ముందు అనేక మార్గాల్ని ఉంచారు. అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. సాధకులు తమ ఇష్టానుసారం సాధనా మార్గాన్ని ఎంచుకొని సాఫల్యాన్ని పొందాలన్నదే వారి అభిమతం. అదే వారి మతం. అదే సర్వసమ్మతం.
మార్గాలు వేరైనా నదులన్నీ సాగరాన్నే చేరేటట్లు, సాధనా మార్గాలు వేరయినా చివరకు చేరేది భగవత్ సన్నిధికే. మార్గాలు అన్నీ సన్మార్గాలే. కనుక ఏ మార్గా న్ని అయినా పట్టుకుందాం. పట్టిన మార్గంలో మాత్రం పట్టువదలం అన్నదే మన మతం కావాలి.
పరమాత్ముని