Delhi High Court Refuses To Advance Hearing Of Plea Against Prabhas Adipurush, Deets Inside - Sakshi
Sakshi News home page

Adipurush Controversy: ప్రదర్శన నిలిపేయాలని పిల్‌.. ఢిల్లీ హైకోర్టులో ‘ఆదిపురుష్‌’కు స్వల్ప ఊరట

Published Wed, Jun 21 2023 5:11 PM | Last Updated on Wed, Jun 21 2023 5:49 PM

Delhi High Court Refuses To Advance Hearing Of Plea Against Prabhas Adipurush - Sakshi

‘ఆపురుష్‌’ చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆదిపురుష్’ సినిమాఫై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన ‘పిల్’ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ చిత్రంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశించింది.

(చదవండి: ఆదిపురుష్' 5 రోజుల కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు?)

ఆదిపురుష్ చిత్రంలో వివాదాస్పదమైన అంశాలెన్నో ఉన్నాయని, నేపాల్ వంటి దేశాలు కూడా ఈ సినిమాను నిషేధించాయని హిందూ సేన లాయర్ పేర్కొన్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను, తొలగిస్తానని, డైలాగులను మారుస్తామని చిత్ర దర్శకుడు ఓంరౌత్ ప్రకటించినప్పటికీ అలాంటి చర్యలేవీ ఇప్పటివరకు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.

వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని, ఈ మేరకు అత్యవసరంగా విచారణ జరపాలని హిందూ సేన లాయర్‌ కోరగా..హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఎలాంటి అత్యవసరం లేదని, జూన్ 30న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. 

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ఆదిపురుష్‌ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 16న విడుదలై.. ప్రేక్షకుల నుంచి మిశ్రస స్పందనను సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. అంతకు మించిన నిరసనలను ఎదుర్కొంటుంది. హిందూ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు.  ఈ సినిమాపై నిషేధం విధించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement