
గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై పలు హిందు సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్ ఆదిపురుష్ తెరకెక్కించారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూవీలో హిందు మతవిశ్వాసాలను దెబ్బతీశారని, వెంటనే ఈ మూవీని బ్యాన్ చేయలనే వాదనలు కూడా వినిపించాయి.
చదవండి: చిక్కుల్లో నయన్ దంపతులు, సరోగసీపై స్పందించిన ప్రభుత్వం
ఈక్రమంలో ఆదిపురుష్ టీంకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తాజాగా హీరో ప్రభాస్, మూవీ టీంకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆదిపురుష్ సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ సంస్థ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సదరు సంస్థ తమ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై నేడు (సోమవారం) విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్‌కు, డైరెక్టర్ ఓంరౌత్‌తో పాటు నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment