teaser controversy
-
ఆదిపురుష్ వివాదం.. ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై పలు హిందు సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్ ఆదిపురుష్ తెరకెక్కించారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూవీలో హిందు మతవిశ్వాసాలను దెబ్బతీశారని, వెంటనే ఈ మూవీని బ్యాన్ చేయలనే వాదనలు కూడా వినిపించాయి. చదవండి: చిక్కుల్లో నయన్ దంపతులు, సరోగసీపై స్పందించిన ప్రభుత్వం ఈక్రమంలో ఆదిపురుష్ టీంకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తాజాగా హీరో ప్రభాస్, మూవీ టీంకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆదిపురుష్ సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ సంస్థ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సదరు సంస్థ తమ పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై నేడు (సోమవారం) విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్‌కు, డైరెక్టర్ ఓంరౌత్‌తో పాటు నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. -
ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఇలా ఉన్నాయేంటంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీం స్పందిస్తూ ఇది 3డీ చిత్రమని, థియేటర్లో చూస్తేను ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారని దర్శకుడు ఓంరౌత్ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో రీసెంట్గా మూవీ ట్రైలర్‌ను థియేటర్లో విడుదల చేసింది చిత్ర బృందం. అంతేకాదు 20 రోజుల్లో మరో టీజర్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. అయితే తాజాగా ఆదిపురుష్ టీజర్, ట్రైలర్‌పై దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. చదవండి: ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలవబోతున్నారా? ఇదిగో క్లారిటీ.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్‌పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ‘‘ఆదిపురుష్ ట్రైలర్ చూశాను. ప్రభాస్ సినిమా అనేసరికి అందరిలో చాలా వేడిగా వాడిగా ఉంటుంది. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో బాలీవుడ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ఫుల్ హైప్ క్రియేట్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ మూవీ నిరాశ పరిచింది. యానిమేటెడ్ చిత్రంలా ఉంది. ఓ యానిమేటెట్ చిత్రాన్ని పెద్ద సినిమా ఎలా అంటారో నాకు అర్థం కావడం లేదు. 3డీలో థియేటర్లో ఎక్స్పీరియస్ వేరు ఉంటుందని మూవీ టీం చెప్పింది. నాకు తెలిసినంతవరు 3డీలో చేసిన, 4డీ చేసిన 2డీ చేసినా యానిమేషన్‌కి, లైవ్‌కి చాలా తేడా ఉంటుంది. ఈ మూవీని రజనీకాంత్ రజినీకాంత్ తీసిన కొచ్చాడియన్లా యానిమేటెడ్ చిత్రంలా తీశారని అందరు ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి : మీడియాపై చిరు అసహనం 3డీలో చూసే సరికి మీ అభిప్రాయం మారుతుందంటున్నారు. కానీ 2డీ నుంచి 3డీకి వెళ్లినంత మాత్రాన వారి గేటప్లు, కాస్ట్యూమ్స్ మారవు కదా. పూర్తిగా యానిమేటెడ్ ప్రభాస్‌ను చూసినట్టుంది. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్‌ల మీద కూడా చాలా ట్రోలింగ్ నడిచింది. రాముడిని దేవడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు. ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి. 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు. నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే. సినిమా మంచిగా రావాలనే ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాని అల్లరి చేయాలని చేయడం లేదు. ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్” అంటూ తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. -
ఆదిపురుష్‌కు మరోషాక్, ఈ సినిమా రిలీజ్ కానివ్వం: బీజేపీ ఎమ్మెల్యే
రోజురోజుకు ఆదిపురుష్ వివాదం ముదురుతోంది. ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి దీనిపై సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్ ఓం రౌత్‌పై మండిపడుతున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్ వక్రికరించారంటూ హిందు సంఘాలు, బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రెండు వారాలు వేశ్య గృహంలో ఉన్నా: మృణాల్ షాకింగ్ కామెంట్స్ తాజాగా మరో బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్ కదమ్ ఆదిపురుష్ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వమంటూ ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్ సినిమాను మహారాష్ట్రలో విడుదల కానివ్వం. తమ చౌక ప్రచారం కోసం మరోసారి మా దేవుళ్లు, దేవతలను ఈ సినిమాలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు’’ అని ఆయన అన్నారు. ‘ఎప్పటిలాగే క్షమాపణలు చెప్పడం, సదరు సీన్లను కత్తిరించడం చేస్తే సరిపోదని, మరోసారి ఇలాంటి ఆలోచన చేయకుండా వారికి గుణపాఠం చెప్పాలన్నారు. చదవండి: గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఇటువంటి తప్పులు పునరావుతం కాకుండా సినిమాలపై పూర్తిగా నిషేధం విధించాలని అని ఎమ్మెల్యే రామ్ కదమ్ డిమాండ్ చేశారు. కాగా మైథలాజికల్ చిత్రంగా రామాయణం ఇతీహాసం నేపథ్యంలో ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలోని రావణుడు, హనుమంతుడి పాత్రలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. రామాయణలో చూపించి విధంగా వారిని చూపించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు గ్రాఫీక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈచిత్రంలో వీఎఫ్ఎక్స్ విజువల్స్ అసలు బాగాలేవని, ఓ యానిమేటెడ్ చిత్రం చూస్తున్నట్టుగా ఉందంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
‘ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాల్సిందే’.. అయోధ్య ప్రధాన పూజారి ఆగ్రహం
ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్‌పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదలైనప్పటి నుంచి దీనిపై సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్ ఓం రౌత్‌పై మండిపడుతున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలు దర్శకుడిగా తెలియదా.. అధ్యయనం చేయకుండానే ఆదిపురుష్‌ను తెరకెక్కించాడంటూ బీజేపీ అసహనం వ్యక్తం చేస్తోంది. మరోవైపు వీఎఫ్ఎక్స్ అసలు బాగోలేదని, ఇది బొమ్మల సినిమాగా ఉందంటూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ‘మై విలేజ్ షో’ గంగవ్వ నెల సంపాదన ఎంతో తెలుసా? టీజర్‌పై వస్తున్న వ్యతీరేకత చూసి ఇప్పటికే మూవీ టీం, డైరెక్టర్ అయోమయ స్థితిలో పడ్డారు. ఈ తరుణంగా ఆదిపురుష్ టీం మరో షాకిచ్చింది అయోధ్య. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. వార్షిక రథయాత్ర సందర్భంగా ఇక్కడకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదిపురుష్ టీజర్‌పై స్పందించారు. రామాయణంలో పేర్కొన్న విధంగా ఆదిపురుష్‌లో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్ ఓంరౌత్ చూపించలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ సినిమాలోని రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలు హిందుమత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయి. చదవండి: ‘పొన్నియన్ సెల్వన్’ వివాదం, కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు ఆ పాత్రలను డైరెక్టర్ రామాయణంలో ఉన్న విధంగా చూపించలేదు. ఇది వారిని అగౌరవ పరిచేలా ఉంది. తక్షణమే ఆదిపురుష్‌ను నిషేధించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని అయన పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సైతం ఆదిపురుష్ టీజర్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే బాలీవుడ్ ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఇతీహాసాలు, చరిత్రపై సినిమా తీయడం నేరం కాదని, అయితే తమ సొంత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా వివాదాలు సృష్టించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. కాగా అక్టోబర్ 2న అయోధ్య వేదికగా ఆదిపురుష్ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. -
ఆ టీజర్ వివాదాలకు దారి తీసింది..
సాక్షి, చెన్నై: నటి జ్యోతిక, దర్శకుడు బాలాలపై కేసు విచారణను కోర్టు జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం నాచ్చియార్. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలపై వివాదాలకు దారి తీసింది. టీజర్లో పోలీస్ అధికారిగా నటిస్తున్న నటి జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లోని మహిళలపై అసభ్యపదజాలాన్ని వాడినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇండియా కుడియరసు పార్టీ రాష్ట్ర నిర్వాహకుడు దళిత్ పాండియన్ సమీప కాలంలో కరూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నాచ్చియార్ చిత్ర టీజర్లో జ్యోతిక మహిళలను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఆ సంభాషణలు మహిళల మనోభావాలను బాధించేవిగా ఉన్నాయన్నారు. నటి జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన తగిన ఆధారాలను, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా పిటిషన్‌దారుడికి ఆదేశాలు జారీ చేశారు. విచారణను జనవరి 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. పిటిషన్‌దారుడు దళిత్ పాండియన్ తరఫున హాజరైన న్యాయవాది రాజేంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో మనోభావాలు దెబ్బతిన్న వారిని, తమ అభిప్రాయాలను వెల్లడించే వారిని, మదర్ సంఘాల వారి సాక్ష్యాలను జనవరి 11వ తేదీన కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. అప్పుడు నటి జ్యోతిక, దర్శకుడు బాలాలకు సమస్లు జారీ చేసేలా కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు. -
‘ద్యావుడా’ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ద్యావుడా సినిమాపై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా చిత్రాన్ని నిర్మించారని, ఈ చిత్రం విడుదలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దంటూ సుభద్రమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసివంది. దీనిపై మంగళవారం విచారించిన హైకోర్టు చిత్ర నిర్మాత, దర్శకుడు సాయిరామ్ దాసరికి, ఏపీ, తెలంగాణ హోంశాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
‘ద్యావుడా’ డైరెక్టర్ అరెస్టు
హైదరాబాద్: ‘ద్యావుడా’ సినిమా డైరెక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలో హిందూదేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పోస్టు చేసిన డైరెక్టర్ సాయిరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన దాసరి సాయిరాం డైరెక్టర్‌గా, వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జెల హరి కుమార్‌రెడ్డి ప్రొడ్యూసర్‌గాను ఇటీవల ద్యావుడా సినిమాను చిత్రీకరిస్తున్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. ఇందులో ఒక సన్నివేశంలో శివుడిపై అభ్యంతరకర సన్నివేశం ఉందంటూ పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. భజరంగ్‌దళ్‌కు చెందిన యు. నవీన్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం సాయిరాంను అదుపులోకి తీసుకున్నారు. కాగా కర్ణాటక, ఉజ్జయినిలోని దేవాలయాల్లో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉందని, వాటి స్ఫూర్తిగానే తాను సినిమాలో అటువంటి సన్నివేశాలను ఉంచినట్లు సాయిరాం విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు. అంతేకాకుండా, ఈ అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని యూట్యూట్ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రొడ్యూసర్ హరికుమార్‌రెడ్డి పరారీలో ఉన్నాడని వివరించారు. -
'ద్యావుడా' దర్శకుడి క్షమాపణ
ద్యావుడా సినిమా దర్శకుడు సాయిరాం దాసరి పత్రికాముఖంగా హిందువులకు క్షమాపణలు తెలిపారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. దాంతో దర్శకుడు స్పందించారు. ''హిందువుల మనో భావాలను దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు. నేనూ హిందువునే. కానీ ఇంతమంది నా సినిమా టీజర్ చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా హిందూ సోదరులందరికీ క్షమాపణ తెలుపుతున్నాను. కాకపోతే కర్ణాటకలోని ఉజ్జయిని దేవాలయంలో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది. మేము ఆ ఆచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో చివరికి శివమహత్యాన్ని చూపించే ప్రయత్నం చేశాం. కానీ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి.. ఆ దృశ్యాలను మా సినిమా నుంచి తొలగిస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి తెలుగు భక్తులకు నేను క్షమాపణ తెలుపుతున్నాను'' అని ఆ ప్రకటనలో తెలిపారు.