‘ద్యావుడా’ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ద్యావుడా సినిమాపై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా చిత్రాన్ని నిర్మించారని, ఈ చిత్రం విడుదలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దంటూ సుభద్రమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసివంది. దీనిపై మంగళవారం విచారించిన హైకోర్టు చిత్ర నిర్మాత, దర్శకుడు సాయిరామ్ దాసరికి, ఏపీ, తెలంగాణ హోంశాఖలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.