'ద్యావుడా' దర్శకుడి క్షమాపణ
Published Mon, Jan 9 2017 7:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
ద్యావుడా సినిమా దర్శకుడు సాయిరాం దాసరి పత్రికాముఖంగా హిందువులకు క్షమాపణలు తెలిపారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. దాంతో దర్శకుడు స్పందించారు. ''హిందువుల మనో భావాలను దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు. నేనూ హిందువునే. కానీ ఇంతమంది నా సినిమా టీజర్ చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా హిందూ సోదరులందరికీ క్షమాపణ తెలుపుతున్నాను.
కాకపోతే కర్ణాటకలోని ఉజ్జయిని దేవాలయంలో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది. మేము ఆ ఆచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో చివరికి శివమహత్యాన్ని చూపించే ప్రయత్నం చేశాం. కానీ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి.. ఆ దృశ్యాలను మా సినిమా నుంచి తొలగిస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి తెలుగు భక్తులకు నేను క్షమాపణ తెలుపుతున్నాను'' అని ఆ ప్రకటనలో తెలిపారు.
Advertisement