summon
-
మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సమన్లు
డాబర్ ఇండియా ఛైర్మన్ మోహిత్ బర్మన్తో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. రెలిగేర్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ షేర్ హోల్డర్ వైభవ్గావ్లీ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.బర్మన్ కుటుంబానికి చెందిన డాబర్ సంస్థలోని కొన్ని షేర్లను గతంలో ఓపెన్ ఆఫర్ కింద విక్రయించారు. అందులో రెలిగేర్ లిమిటెడ్ షేర్ హోల్డర్లు పాల్గొన్నారు. రెలిగేర్ గ్రూప్‌లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన రెలిగేర్ ఫిన్వెస్ట్ నుంచి నిధులు సమీకరించారు. అనంతరం డాబర్ సంస్థ ఓపెన్ ఆఫర్‌తో అనుసంధానం అయిన ఇతర కంపెనీలకు ఆ డబ్బును చేరవేసింది.ఇదీ చదవండి: రూపాయి 78 ఏళ్ల ప్రస్థానం..ఇదిలాఉండగా, ఓపెన్ ఆఫర్ సమయంలో బర్మన్ కుటుంబానికి సంబంధించి సరైన వాటాను తెలియజేయకుండా తప్పుడు సమాచారం అందించారని రెలిగేర్ షేర్‌హోల్డర్ వైభవ్ గావ్లీ ఫిర్యాదు చేశారు. కంపెనీ నష్టాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పారు. వాటాల టెండర్లో మనీలాండరింగ్ జరిగిందన్నారు. ఓపెన్ ఆఫర్ ప్రకటించిన తర్వాత షేర్లను కొనుగోలు చేసిన వాటాదారులకు ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రాథమిక చర్యలో భాగంగా ఈడీ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాబర్ ఇండియా ఛైర్మన్ మోహిత్ బర్మన్తో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు, ఓపెన్ ఆఫర్ మేనేజర్‌కు సమన్లు జారీ చేసింది. అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అధికారుల పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కేసులో మే 1న విచారణకు రావాలని ఆదేశించింది. తన వెంట గ్యాడ్జెట్స్ తీసుకురావాలని తెలిపింది.కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. దీనిపై బీజేపీ, హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్(IFSO) దర్యాప్తు చేస్తోంది.అయితే తెలంగాణ పీసీసీ అధికారిక ట్విటర్ హ్యాండీలో అమిత్ షా వీడియో పోస్టు చేశారు. దీంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎంతోపాటు తెలంగాణ డీజీపీ, సీఎస్‌కు కూడా ఢిల్లీ నోటీసులు జారీ అయ్యాయి.కాగా దేవంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది -
చిన్నప్పుడు బడికి బాగా డుమ్మాలు కొట్టేవాళ్లా సార్!
చిన్నప్పుడు బడికి బాగా డుమ్మాలు కొట్టేవాళ్లా సార్! -
భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు
మాలె: ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు జారీ చేసిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారత హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. భేటీ కావాల్సిందిగా మాలేలోని భారత హైకమిషనర్ మును మహావార్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు నేడు సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు ఆయన వచ్చివెళ్లినట్లు సమాచారం. వివాదంపై రెండు దేశాలు సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసిన మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్ చేశారు. అవి ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. ఇదీ చదవండి: Lakshadweep Islands History: లక్షద్వీప్‌పై పాక్ కన్ను.. భారత్ ఎత్తుగడతో చిత్తు! -
లాలూను ప్రశ్నించనున్న సీబీఐ
ఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను నేడు సీబీఐ ప్రశ్నించనుంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థ ఇదివరకే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. సోమవారం ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నంతా పాట్నాలో ఆర్జేడీ వర్గాలు ధర్నాకు దిగగా.. ఇవాళ ఆ ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి. 2008-09 మధ్య రైల్వే బోర్డు రిక్రూట్మెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. ఐఆర్సీటీసీలో గ్రూప్ డీ సంబంధిత పోస్టులను దొడ్డిదోవన కొందరికి కట్టబెట్టినట్లు తేల్చింది. ఆ సమయంలో రైల్వే మంత్రిగా లాలూ ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగానూ.. కొంతమంది అభ్యర్థుల నుంచి కారుచౌక ధరకే భూములు పొందారన్న అభియోగాలు లాలూ కుటుంబ సభ్యులపైనా నమోదు అయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కిందటి ఏడాది మే నెలలో సీబీఐ కేసు నమోదు చేసి.. అక్టోబర్ నెలలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా, హేమలతో పాటు మరికొందరి పేర్లను చేర్చింది. మరోవైపు భూములు అప్పజెప్పి.. ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న 12 మంది పేర్లను సైతం ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు సోమవారం రబ్రీ దేవిని సుమారు ఐదు గంటలపాటు ప్రశ్నించి, ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేశారు సీబీఐ అధికారులు. ఆ సమయంలో బయట ఆర్జేడీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. ఇక ఈ స్కాంకు సంబంధించి గతంలో లాలూకు ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా పని చేసిన భోళా యాదవ్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే లాలూ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది సీబీఐ. ఇదిలా ఉంటే.. వారం కిందట ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం ఢిల్లీ కోర్టులో లాలూ, ఇతరులు హాజరయ్యారు కూడా. గత కొంతకాలంగా లాలూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది నెలల క్రితం సింగపూర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. -
ఆదిపురుష్ వివాదం.. ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్ ట్రోల్స్, మీమ్స్‌తో నిండిపోయాయి. యానిమేటెడ్ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. అంతేకాదు ఇందులో రాముడు, రావణుడు, హనుమంతుడి పాత్రలను చూపించిన విధానంపై పలు హిందు సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్ ఆదిపురుష్ తెరకెక్కించారంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూవీలో హిందు మతవిశ్వాసాలను దెబ్బతీశారని, వెంటనే ఈ మూవీని బ్యాన్ చేయలనే వాదనలు కూడా వినిపించాయి. చదవండి: చిక్కుల్లో నయన్ దంపతులు, సరోగసీపై స్పందించిన ప్రభుత్వం ఈక్రమంలో ఆదిపురుష్ టీంకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తాజాగా హీరో ప్రభాస్, మూవీ టీంకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆదిపురుష్ సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ సంస్థ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ సదరు సంస్థ తమ పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై నేడు (సోమవారం) విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్‌కు, డైరెక్టర్ ఓంరౌత్‌తో పాటు నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. -
అర్జున్ ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే..
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్‌కు ఇటీవల ఎన్సీబీ మరోసారి సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపురి విచారణకు అర్జున్ హజరవ్వాల్సిందిగా ఎన్సీబీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్జున్ సోమవారం మధ్యాహ్నం ఎన్సీబీ ఎదుట హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అర్జున్ ఎన్సీబీకి ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే అతడు అరెస్టు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగుచూసిన బాలీవుడ్ డ్రగ్ కేసును ముంబై పోలీసులు ఎన్సీబీకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో విచారణ చేపట్టి ఎన్సీబీ దర్యాప్తులో డ్రగ్ ప్లెడర్లతో అర్జున్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గత నవంబర్ 9వ తేదిన అతడి ఇంటిలో దాడులు నిర్వహించిన ఎన్సీబీ కొన్ని అనుమానిత మందులతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకుని సమన్లు అందజేశారు. (చదవండి: అర్జున్ రాంపాల్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు) అయితే నవంబర్ నెలలో జరిగిన మొదటి విచారణలో అర్జున్ తన ఇంట్లో దొరికిన మందులు డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటున్నట్లు చెప్పి దానికి సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను అధికారులకు ఇచ్చాడు. అయితే ఆ ప్రిస్క్రిప్షన్పై అనుమానం రావడంతో ఈ నెల 15న అర్జున్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు ఇచ్చి 16న విచారణకు హజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను 21న విచారణకు హజరవుతానంటూ ఎన్సీబీని 16న గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్జున్ ఈ రోజు మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి విచారణకు హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అది నకిలీ ప్రిస్క్రిప్షన్ అని తేలితే అర్జున్ తప్పనిసరిగా అరెస్టును ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్జున్ ఇంట్లో దొరికిన అనుమానిత మందులను ఎన్సీబీ చట్టం ప్రకారం షెడ్యూల్లో చేర్చినవిగా ఎన్సీబీ గుర్తించింది. (చదవండి: మరోసారి ఎన్సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు) -
అర్జున్ రాంపాల్‌కు మరోసారి సమన్లు
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌కు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మరోసారి సమన్లు ఇచ్చింది. సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసుపై ఎన్సీబీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డ్రగ్ ప్లెడర్లతో ఆర్జున్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో గత నవంబర్‌లో ఎన్సీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 6 గంటల పాటు అర్జున్ విచారించి అధికారులు తాజాగా తదుపరి విచారణకు ఆదేశిస్తూ మరోసారి మంగళవారం సమన్లు అందజేసింది. రేపు(డిసెంబర్ 16) ఎన్సీబీకి కార్యాలయానికి విచారణకు హాజరకావాల్సిందిగా ఎన్సీబీ పేర్కొంది. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు) అంతేగాక గతనెలలోనే ఎన్సీబీ అధికారులు అర్జున్ ఇంటిలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలపాటు అర్జున్ ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నవంబర్ 9న అర్జున్‌కు నోటీసులు అందజేస్తూ.. 11వ తేదీన విచారణకు హజరుకావాల్సిందిగా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అలాగే ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌కు కూడా అదే సమయంలో ఎన్సీబీ సమన్లు ఇచ్చి విచారించింది. (చదవండి: అర్జున్ను ఆరు గంటలు విచారించిన ఎన్సీబీ) -
దీపికా మేనేజర్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు
న్యూఢిల్లీ: బాలీవుడ్లో డ్రగ్స్ కేసు దర్యాప్తు భాగంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్(ఎన్సీబీ) మరోసారి సమన్లులు జారీ చేసింది. గత నెలలో ఎన్సీబీ ఆమెకు సమాన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కరిష్మా ప్రకాష్ విచారణకు గైర్హాజరు కావడంతో కరిష్మా పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఇవాళ (సోమవారం) ఎన్సీబీ ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి, ఆ నోటీసులు ఆమె తల్లి మితాక్షర పురోహిత్‌కు అందచేశారు ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే దీపికా పదుకొనెతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించాం. ఈ క్రమంలో కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.7 కిలోగ్రాముల చరాస్, మూడు సీసాల సీబీడీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశాం’ అని తెలిపారు. (చదవండి: పరారీలో హీరోయిన్ దీపిక మేనేజర్) అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలైన నటి రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో పలువురు బాలీవుడ్ నటీనటులు పేర్లను వెల్లడించింది. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టగా దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా ఆలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లు ఉన్నాయి. అంతేగాక దీపికా, ఆమె మేనేజర్ కరిష్మాల పాత వాట్సప్ డ్రగ్స్ చాట్ కూడా వెలుగులోకి రావడంతో వీరిద్దరిని ఎన్సీబీ విచారణకు పిలిచింది. అలాగే వీరితోపాటు శ్రద్దా కపూర్, సారా, రకుల్‌లకు కూడా ఎన్బీసీ అధికారులు సమన్లు ఇచ్చారు. వీరిపై ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో వారిని ఎన్సీబీ తిరిగి పంపించిన విషయం తెలిసిందే. చదవండి: మరిన్ని కోడ్ వర్డ్లు బయటపెట్టిన దీపికా!) -
ఫేస్బుక్ సీఈఓకు భారత కోర్టు సమన్లు
భోపాల్ : ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు భోపాల్ జిల్లా కోర్టు సమన్లు పంపింది. భోపాల్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ద ట్రేడ్‌బుక్.ఆర్గ్’ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు స్వప్నిల్ రాయ్ ఫిర్యాదు మేరకు అడిషినల్ సెషన్స్ న్యాయమూర్తి పార్థ్ శంకర్ జుకర్‌బర్గ్‌కు ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని ఆదేశించారు. ఈ వివాదంపై స్వప్నిల్ స్పందిస్తూ తాను నిర్వహిస్తున్న ద ట్రేడ్‌బుక్ బిజినెస్ నెట్ వర్క్ ప్లాట్‌ఫామ్ అని తెలిపారు. తన పెయిడ్ అడ్వర్జైజ్‌మెంట్‌ని ఫేస్బుక్ అర్థాంతరంగా నిలిపివేసిందని ఆరోపించారు. తన ట్రేడ్‌బుక్ ప్రచారాన్ని మూడు రోజుల పాటు నిర్వహించిన ఫేస్బుక్ తర్వాత తన టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపిందన్నారు. తన వెబ్ పేజ్ మొదటి దశ ప్రమోషన్స్ 2016 ఆగస్టు 8 నుంచి 16 వరకు విజయవంతగా నిర్వహించామని.. రెండో దశ 2018 ఏప్రిల్ 14 నుంచి 21 మధ్య నిర్వహించాల్సి ఉండగా, ఫేస్బుక్ 16వ తేదీ నుంచి తన పేజ్ ప్రమోషన్ని నిలిపివేసిందని స్వప్నిల్ పేర్కొన్నారు. తన వెబ్ పేజ్‌కి అధికారిక ట్రేడ్‌మార్క్ ఉందని ఆయన స్పష్టం చేశారు. తన వెబ్ పేజ్ టైటిల్లోని బుక్ పదాన్ని తొలగించాలని నోటీసులు పంపారని, ఇది తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసిందని అన్నారు. -
ఆజాద్ కేసు.. పోలీస్ శాఖలో వణుకు!
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఆదిలాబాద్ జిల్లా కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతోంది. జూలై 1, 2010 న ఆదిలాబాద్ జిల్లా సార్కపల్లిలో ఆజాద్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చినట్టు ఆయన భార్య అప్పట్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై ఏళ్లుగా విచారణ సాగగా పోలీసులపై హత్యానేరం అవసరంలేదని ఇటీవల కింది కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను జిల్లా కోర్టు కొట్టివేస్తూ ఎన్కౌంటర్లో పాల్గొన్న 29 మందిని హత్యానేరం కింద విచారించాలని కింది కోర్టుకు సూచించింది. ఈ మేరకు పోలీస్ అధికారులు, సిబ్బందికి సమస్లు జారీ చేసింది. రాష్ట్రంలో మొదటిసారిగా పోలీసులు హత్యానేరం ఎదుర్కోవాల్సి రావడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖలో కలవరం మొదలైంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న అప్పటి సీఐ రఘునందన్, ఎస్ఐ ప్రవీణ్, ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, ఇతర ఆర్మ్డ్ పార్టీ సిబ్బందిపై హత్య కేసు విచారణ మళ్లీ మొదలవడంతో పోలీసు శాఖ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తోంది. ఎటు వెళ్లి.. ఎవరి మెడకు బిగిసేనో..? మహారాష్ట్ర నుంచి ప్రాణాలతో పట్టుకొచ్చి ఆజాద్‌ను కాల్చి చంపారనే అభియోగం ఉంది. ఆజాద్‌తో ఉన్న జర్నలిస్టు హేమచంద్ర పాండేను సైతం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కోర్టు డైరెక్షన్‌తో చేపట్టే విచారణ సంచలనాత్మకంగా మారే అవకాశముంది. ఎన్కౌంటర్ సమయంలో ఆజాద్ ఒక్కడే ఎలా దొరికాడు? నిజంగా ఎదురుకాల్పుల్లో మృతి చెందాడా? పట్టుకొచ్చి కాల్చిచంపారా? అన్న వాటిపై పూర్తి వివరాలు బయటకు వస్తాయని సర్వత్రా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ చేయాలన్న ఆదేశం ఎవరి నుంచి వచ్చింది? అప్పటి డీజీపీ ఎవరు? వారికి, ప్రభుత్వానికి ఈ ఎన్కౌంటర్ నిర్ణయంపైన చర్చ జరిగిందా? జరిగితే ఆదేశాలు వెలువరించింది ఎవరు? అన్న దానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారుల మెడకు కేసు ఉచ్చు బిగుస్తుందని చర్చ సాగుతోంది. మావోయిస్టు వ్యవహారాలను పర్యవేక్షించే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పెద్దలకు సైతం ఈ కేసులో షాక్ తప్పదని పౌరహక్కుల సంఘం అభిప్రాయపడింది. దీనికి అప్పటి ప్రభుత్వం, హోంమంత్రి, డీజీపీ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడేంటి పరిస్థితి? ఎన్కౌంటర్ కేసు విచారణతో రాష్ట్ర పోలీస్ శాఖ ఆందోళనలో పడ్డట్టు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం, అప్పటి పోలీస్ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తలనొప్పులు తెచ్చిపెట్టినట్టు అభిప్రాయపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు తెలంగాణ పోలీస్ అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ఆదేశాలు పాటించడం వల్లే తాము ఇరుకున్నామని, ఇప్పుడు ఏం చేయాలో తమకు తెలియడంలేదని బాధిత అధికారులు గోడువెళ్లబోసుకుంటున్నారు. కూంబింగ్‌కు వెళ్లిన కానిస్టేబుళ్లు సైతం విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని, దీనిపై ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై కేసులో ఉన్న పోలీస్ అధికారులు విచారణలో నోరు విప్పితే అప్పటి ప్రభుత్వ పెద్దలకూ చిక్కులు తప్పవని తెలుస్తోంది. కేసు ఎటు నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తుందన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠనెలకొంది. పోలీసులపై ఇదే మొదటి కేసు ‘‘దేశవ్యాప్తంగా జరిగిన అనేక బూటకపు ఎన్కౌంటర్ల కేసుల్లో ఎక్కడా కూడా పోలీసులపై విచారణ చేయాలని కోర్టులు ఆదేశించలేదు. కానీ ఒక జిల్లా న్యాయస్థానం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యా నేరం కింద విచారణకు ఆదేశించడం న్యాయ వ్యవస్థలో కీలక పరిణామం. దీనివల్ల బాధితులకు న్యాయ వ్యవస్థపై ప్రగాఢ విశ్వాసం కలిగింది. ఈ ఎన్‌కౌంటర్‌కు ఆదేశాలు ఎవరివి, అసలు దోషులెవరు అన్న విషయాలన్నీ బయటకు రావాలని పోరాటం చేస్తాం..’’ – న్యాయవాది, పౌర హక్కుల నేత రఘునాథ్ -
మరోసారి ఉర్జిత్ పటేల్‌కు నోటీసులు?
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 20 న కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా కోరింది. డీమానిటైజేషన్ కాలంలో(50 రోజులు) ఎన్ని పాత కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చాయి, రీమానిటైజేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది తదితర అంశాలపై కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలీ సారథ్యంలోని పార్లమెంటరీ ప్యానెల్ ఉర్జిత్‌ను ప్రశ్నించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఆర్థికవ్యవహారాల కార్యదర్శి శక్తి కాంత్ దాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శి అంజులే చిబ్ దుగ్గల్ ని కూడా కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ కోరింది. జనవరి 18 న సమావేశమైన కమిటీ ఏప్రిల్ 20 న తిరిగి సమావేశమయ్యేందుకు నిర్ణయించింది. ఈమేరకు ఆర్బీఐకి, ఆర్థిక అధికారులకు నోటీసులు జారీ చేసింది. కమిటీ తన తుది నివేదికను రూపొందించే క్రమంలో ఓరల్ ఎవిడెన్స్ నిమిత్తం జరగనున్న చివరి సమావేశం కావచ్చని భావిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 20 సమావేశానికి ఉర్జిత్ పటేల్ హాజరుకాని పక్షంలో మరో సమావేశం నిర్వహించాల్సి వస్తుందనే సూచన కూడా ఇచ్చనట్టు తెలుస్తోంది. 31మంది సభ్యుల స్టాండింగ్ కమిటీలో బీజేపీ నుంచి నిషికాంత్ దూబే, బిజెపి కిరిత్ సోమయ్య, నరేష్ అగర్వాల్(ఎస్పీ) దినేష్ త్రివేది(టీఎంసీ) సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ) తదితరులు ఉన్నారు. అయితే గత సమావేశంలో నగదు విత్‌డ్రాపై పరిమితి, ఎత్తివేతపై కాంగ్రెస్ ఎంపి దిగ్విజయ్ సింగ్ పలు ప్రశ్నలు సంధించిన సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ఆదుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పద్దని పటేల్‌కు సలహా ఇచ్చారట.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉర్జిత్ పటేల్‌ను ప్రశ్నించి ఒత్తిడికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మధ్యలో కల్పించుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పవద్దని ఉర్జిత్‌కు సలహా ఇచ్చారని సమాచారం. నగదు పరిస్థితి ఎప్పుడు సాధారణ పరిస్థితికి వస్తుందనే దానిపై ఉర్జిత్ పటేల్ సమాధానం ఇవ్వలేదు. రూ.500, రూ.1000 పాత నోట్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి సలహాను నవంబర్ 7న అందుకున్నామని, మరునాటి దీనికిఆర్బీఐ సమ్మతించిందని లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించింది. దీనికి కొన్ని గంటల తరువాత ప్రధాని టీవీలో ఈ షాకింగ్ ప్రకటన చేసినట్టు వివరణ ఇచ్చింది. అలాగే 86 శాతం చలామణిలోఉన్న పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంత నగదు బ్యాంకులకు జమ అయిందో స్పష్టంగా చెప్పలేకపోయారు. రద్దైన మొత్తం పెద్దనోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు కాగా, రూ.9.2లక్షల కోట్ల కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కళ్లు తిరిగే సాహసం..మోడల్‌కు సమన్లు
దుబాయ్: ఓ సాహస మోడల్‌కు దుబాయ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ వికీ ఓడింట్కోవా చేసిన సాహసం ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిదని పోలీసు ఉన్నతాధికారి ఖలీల్ ఇబ్రహీం మన్సూరీ పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించకుండా దుబాయ్‌లో ప్రాణాలకు అపాయం కలిగించే సాహసాలు చేయొద్దని సూచించారు. సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఇలాంటివి చేయాలన్నారు. ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ చేసిన సాహసం కళ్లు తిరిగేలా ఉంది. దుబాయ్‌లోని ఓ ఆకాశహర్మ్యం ఎక్కింది. అక్కడ పై అంతస్తు వద్ద ఓ వ్యక్తిని ఇవతల నిలబెట్టి, కేవలం అతడి చెయ్యి మాత్రమే పట్టుకుని గాల్లో వేలాడింది. ఏమాత్రం పట్టు తప్పినా వెయ్యి అడుగుల కిందకు పడి తల వంద ముక్కలు కావాల్సిందే. 73 అంతస్థులకు పైగా ఉన్న అలాంటి భవనం ఎక్కి మామూలుగా కిటికీలోంచి కిందకు చూస్తేనే మనకు కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఈ మోడల్ ఏకంగా కిటికీలోంచి బయట గాల్లోకి వేలాడిందంటే.. చెప్పాలా! ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కూడా తీసి దాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికి ఐదు లక్షల మందికిపైగా చూశారు. Full video (link in bio)! @a_mavrin #MAVRINmodels #MAVRIN #VikiOdintcova #Dubai A post shared by Viki Odintcova (@viki_odintcova) on Feb 3, 2017 at 7:12am PST -
భారత హైకమినర్కు పాక్ సమన్లు
కరాచీ: ఇండియన్ ఆర్మీ సర్జికల్ ఎటాక్ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అక్కడి భారత హైకమిషనర్ కార్యాలయానికి సమన్లు పంపించింది. దాడిని ఖండిస్తూ ఇండియన్ హైకమిషనర్ గౌతం బాంబ్వాలేకు నోటీసులు పంపించింది. సర్జికల్ స్ట్రైక్స్ పై వివరణ ఇవ్వాలని, దాడులను ఎలా సమర్థిస్తారో చెప్పాలంటూ పాక్ అందులో ప్రశ్నించినట్లు సమాచారం. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కూడా ఇక్కడి పాక్ హైకమిషనర్ కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహాలో పాక్ సమన్లు పంపించింది. -
ఆయనకు సమన్లు జారీ చేయండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమన్లు జారీ చేయాలని జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా ఓ పిటిషన్ లో కోరుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మన్మోహన్సింగ్ సహా, మరో ఇద్దరికి సమన్లు జారీ చేయాలని మధుకోడా తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 28 న జరగనుంది. బొగ్గ క్షేత్రాల అక్రమ కేటాయింపుల కేసులో కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్, మధు కోడా, కేంద్ర మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావు, మాజీ కోల్ సెక్రటరీ హెచ్‌సీ గుప్తా తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై చార్జ్‌షీట్ కూడా నమోదైంది. అయితే మధుకోడా సహా 8 మంది నిందితులకు ప్రత్యేకకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరుచేసింది. ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులో మధుకోడా సహా, మిగిలిన నిందితులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు పేర్కొంది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మన్మోహన్ సింగ్ తన అభిప్రాయాలను కోర్టు ముందుంచిన సంగతి తెలిసిందే. -
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సమన్లు
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా కేసులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 27న న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధీరజ్ మిట్టల్ ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ స్మృతిపై కేసును దాఖలు చేశారు. 2012 డిసెంబర్ 20న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల సందర్భంగా ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి తన పరువుకు భంగం కలిగించేలా దుర్భాషలాడారని సంజయ్ పరువు నష్టం కేసు వేశారు. కాగా ఇదే సందర్భంలో తనపై సంజయ్ అనుచిత, తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ స్మృతి కూడా ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.